Very concisely for non-telugu readers, here is what I have to say: You can learn this language (Telugu) just for this movie! If you think it is an exaggeration, ask your Andhra friends about Jandhyala or Viswanath movies.
జంధ్యాల, విశ్వనాధ్ సినిమాలు చాలానే చూశాను. ఇదెక్కువ అది తక్కువ అనను కాని చాలా కారణాల వల్ల ఈ ఆనంద భైరవి సినిమా మటుకు మా బాగా నచ్చేసింది. అదేదో సినిమా చూసినట్టు కాదు, వాస్తవాన్ని నెమరువేసుకున్న భావన కలుగుతుంది తెలుగుదనం తెలిసిన వాడికి. కథ సంప్రదాయ నృత్యం కోసం ప్రాణాలిచ్చే ఒకతని పట్టుదల చుట్టూ అల్లుకుని ఉంటుంది, శంకరాభరణం సంగీతానికెలాగో ఇది నృత్యానికలాగన్నట్టు. కథని ఒకపక్క వాస్తవానికి చాలా దగ్గరగా నడిపిస్తూనే, ప్రేక్షకుల బావోద్వేగాలకేలోటూ రానియ్యలేదు జంధ్యాల. అది పక్కనబెడితే ఇందులో చాలా విషయాలు కళ్ళు చెమర్చేలా, మనసు నిండేలా, కడుపు పగిలేలా... ఇలా ఒకరకం గాకుండా ఉన్నాయ్! జరిగే సన్నివేశాలన్నీ అస్సలు ఊహించనివి కావూ, మనం జీవితంలో చూడనివి కావూ, అయినాసరే! ఉదాహరణకి, రెండు సీనులు.
మూడేళ్ళ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా కుదరనిది, ఈ యేడు బంపర్ ఆఫర్ తగిలినట్టు ఉత్సవ సీజన్ మొత్తం చెన్నైలోనే ఉండే అవకాశం వచ్చింది. అదేంటో తెలియని వాళ్లకి రెండు ముక్కల్లో చెప్పాలంటే - క్రికెట్ అభిమానులకి వరల్డ్ కప్ ఎలాగో, సంగీతాభిమానులకి చెన్నై డిసెంబర్ ఉత్సవాలు అలాంటివేనని చెప్పొచ్చు!
మొత్తం మూడు రకాల ప్రోగ్రాంలు ఉంటాయంట.
Here is something from which people like me would benefit immensely! The "like me" part implies the shared interests in Indian music and culture. To brief it up, it's an audio podcast by a Carnatic musician-teacher or guru and an enthusiastic listener or rasika. The sole purpose of the podacast is to inculcate necessary knowledge to enjoy listening Carnatic music. It's in English. Here is a brief description of the guru and the rasika from the podcast's home page.
ఎప్పుడో చిన్నప్పుడు చుట్టాలందరం కలిసి ఒకసారి వెళ్లినట్టు గుర్తు అంతే. మళ్ళీ దాని ముఖమెరిగింది లేదు. అప్పుడప్పుడు టీవీలో జనం పెరిగారు, తగ్గారు అని వినడమే. ఇదిగో ఇన్నాళ్ళకి ఇప్పుడు ఇంట్లో అందరికీ కుదిరి మొన్న శుక్రవారం 29న వెళ్ళాం. శనివారం పొద్దున్నే రైలు దిగ్గానే మా చెల్లి, నేను మెట్ల దారిలోనూ, అమ్మ, నాన్న, మావయ్య బస్సులోనూ తిరుమలకి చేరుకున్నాం. దాదాపు 3500 ఉన్నాయేమో మెట్లు, ఎక్కడానికి సుమారు 4 గంటలు పట్టింది, మెల్లగా ఫోటోలు తీస్కుంటూ ఎక్కితే. తెలిసినవాళ్ళు ఉండబట్టి రూం దొరికింది. మామూలుగానైతే ఏ ఎమ్మార్వోనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫార్సు చేస్తేనేగాని ఓ పట్టాన దొరకవంట అంత తొందరగా!
బార్సిలోనా రాంగానే చేతిలో ఉన్న ల్యాప్టాప్ కి రెక్కలొచ్చో కాళ్ళొచ్చో తుర్రుమంది. సమయానికి ల్యాబ్ వాళ్ళు ఒక మ్యాక్ బుక్ ఇచ్చి ఆదుకున్నారు. ఈ స్పానిష్ సామ్రాజ్యంలో ఇంగ్లీషు వస్తువు మచ్చుకైనా కనబడ్డం కష్టం కనుక ఇన్నాళ్ళు మన దేశానికొచ్చిన తర్వాతో, అమెరికా నుంచి ఎవరైనా వచ్చేట్టుంటే వాళ్ళతోనో తెప్పిద్దాం అని ఊర్కున్నా. కాని ఇన్నాళ్ళు ఆపుకున్న ఆత్రం నాజూగ్గా, సెక్సీగా ఉన్న కొత్త మోడల్ ఒకటి చూసే సరికి కట్టలు తెంచుకుంది :P
ఇదిగో ఇదే! ఏసర్ వాళ్ళు మార్కెట్లో దింపిన కొత్త మోడల్. Dell XPS, Lenovo Thinkpad ని పక్కకు నెట్టి నన్ను ఇదే కొనేలా చేసింది.
సౌమ్య బజ్జులో ఈ టపా చూసి నా రొమేనియా స్నేహితుడ్ని వివరాలు అడిగాను. ఇంతవరకు నా మనసులో ఉన్న శ్రీశ్రీ గీసిన కమ్యూనిజం అనే అందమైన చిత్రమాలిక మీద రక్తం జల్లినట్టైంది, కమ్యూనిజమంటే భయం వేసింది.
చంద్రముఖికి గుణశేఖరుడు ఎలాగో.. కోతికి కొబ్బరిచిప్ప ఎలాగో.. తెలుగు, కర్ణాటక సంగీతం, కృష్ణదేవరాయలు - ఇవి నాకు అలాగ. నాతో పాటు ఉంటున్న పెరూ దేశస్తుడికి వీటి గురించి నేను చెప్పేవి వినీ వినీ వినీ నేను చెప్పే కొన్ని విషయాలు కంఠతా వచ్చేశాయి. ఒక రోజు రాయల గురించి చెప్పాక, వాడిలా అన్నాడు, "అదంతా బానే ఉంది గురు (వాడ్ని వాడు శిష్య అని పిలుచుకుంటాడు), ఇప్పుడు మీ రాజు గురించి కొన్ని నచ్చని విషయాలు చెప్పు" అని. అంతగా ఏం లేవు పొమ్మన్నా. "పోనీ నచ్చనవి కాకపోతే, తను చేసిన ఏదైనా పనిని పరివిధాల ఆలోచించి విమర్శిస్తూ చెప్పు" అన్నాడు. "అబ్బే, ఏమీ తోచట్లేదబ్బాయ్, ఒకవేళ చెప్పినా ఆయన గొప్పతనానికి ఆ విమర్శలన్నీ చంద్రుడి మీద మచ్చలే అవుతాయి" అన్నా. నా సమాధానం అసంతృప్తిగానే ఉంది వాడికి.