సంగీతం

మద్రాస్ లో డిసెంబర్ కర్ణాటక సంగీత ఉత్సవ వివరాలు!

మూడేళ్ళ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా కుదరనిది, ఈ యేడు బంపర్ ఆఫర్ తగిలినట్టు ఉత్సవ సీజన్ మొత్తం చెన్నైలోనే ఉండే అవకాశం వచ్చింది. అదేంటో తెలియని వాళ్లకి రెండు ముక్కల్లో చెప్పాలంటే - క్రికెట్ అభిమానులకి వరల్డ్ కప్ ఎలాగో, సంగీతాభిమానులకి చెన్నై డిసెంబర్ ఉత్సవాలు అలాంటివేనని చెప్పొచ్చు!

మొత్తం మూడు రకాల ప్రోగ్రాంలు ఉంటాయంట.

An Informative Podcast on Carnatic Music

Here is something from which people like me would benefit immensely! The "like me" part implies the shared interests in Indian music and culture. To brief it up, it's an audio podcast by a Carnatic musician-teacher or guru and an enthusiastic listener or rasika. The sole purpose of the podacast is to inculcate necessary knowledge to enjoy listening Carnatic music. It's in English. Here is a brief description of the guru and the rasika from the podcast's home page.

CompMusic: ప్రపంచ సంగీత సంప్రదాయాల పరిశోధనకై యంత్రగణిత నమూనాలు

CompMusic (English version of this article here) అని పిలవబడే ఈ పరిశోధక ప్రాజెక్టు, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సౌజన్యంతో చావియర్ సెర్ర (Xavier Serra) నిర్వహణలో 2011 నుంచి 2016 దాకా నడుస్తుంది.

కర్ణాటక సంగీతం - ఉపోద్ఘాతం (An Introduction to Carnatic Music)

Click here for the english version.

నా తలరాత రాసిన వాడు కుంచె తేనెలో ముంచి రాశాడో ఏమో.. నా జీవితం అంతా ఇంతగా సంగీతమయం అవుతుందని కొన్నేళ్ళ క్రితం అనుకోను కూడా లేదు. ఆ తీపి నాకు దగ్గరలో ఉన్న నలుగురికీ రుచి చూపించాలన్న తాపత్రయంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అందాలు పైపైన చూస్తే అగుపించవు, పాలపుంతల్లో వింతల్లా! విశ్లేషించే కొద్దీ కితకితలు పెట్టి, వెన్ను చలి పుట్టించే అద్భుతాలు దర్శనమిస్తాయి. అలాంటి అపురూమైన ఒక కళ మన కర్ణాటక సంగీతం! వైరాగ్యం ఒళ్ళంతా పులుముకుని, సర్వరస పానం చేస్తూ, భావ గర్భంగా ఒక మౌని పలికే పలుకును ఆబాలగోపాలం సహానుభూతితో వింటూ పరవశించేలా చేసే అమోఘమైన వాహకం! ఎన్ని చెప్పినా ఆ అమృతం తీపి అనుభవిస్తేనే గాని తెలీదు. అందుకే ముందు ఈ కృతి వినేయండి :-)

మహానగరంలో మాయగాడు

ఆఫీస్ మెట్లు దిగి అలా నడుస్తూ వస్తున్న గోపాలం చుట్టూ ఏదో మాయ అల్లుకుంటోంది. అది మాయో కాదో దానిలో పూర్తిగా మునిగిపోయిన అతనికి రవ్వంతైన తెలియలేదు. అతను జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 11 మొదలు అక్కడ్నుంచి పెద్దమ్మ గుడివైపు వస్తున్న దారి మొత్తం హఠాత్తుగా సినిమాల్లో చూపించినట్టు పచ్చని బయళ్ళతో నిండిపోయింది. రోడ్డు ఒక నదిపాయలా, కార్లు, బైకులు దానిలో హంసల్లా కనబడుతున్నాయి. అలాంటి ఆ ప్రదేశంలో చేనుగట్లు మీద, అదే, పాదాచారుల మార్గం, ఆ గట్లు మీద నడుస్తూ కొందరు ముద్దుగుమ్మలు చేసే నాట్యం చూడ్డంలో లీనమైపోయిన గోపాలం తను వెళ్తున్నదెక్కడికో, నడిచేదెటో మర్చిపో్యాడు. అలా వింత అనుభూతులతో కాసేపు ఏదో సినిమా క్లైమాక్సులో ఉన్నట్టు ఉత్కంఠగా పెడతాడు మొహం, ఇంకాసేపు చిరునవ్వుతో ఏదో దొరికినవాడిలా మురిసిపోతాడు - చూసేవాళ్ళకి సరిగ్గా పిచ్చోడిలా కనిపిస్తాడేమో! ఈ రకంగా అలా వెళ్తున్న అతన్ని పక్కనే వెళ్తున్న ఒక హంస ఏదో అంది, గోపాలం నవ్వుకున్నాడు. అది చుర చుర చూసి మళ్ళీ ఏదో అంది. గోపాలం మళ్ళీ నవ్వుకున్నాడు. ఈసారి ఏమనుకుందో ఏమో, కాస్త గట్టిగా ఇంకేదో అంది.

Jugalbandi!

It all began when I came to know about the series of Classical Music concerts and Dance performances, called 'Festival of Bala Murali', at Chowmahalla palace, a beautiful place!

Third day(yeah, I missed first two) there were two cultural events, a concert by Devan-Drone and a Kuchipudi dance performance by Mrs.Shallu Zindal. The concert went well except for few minor mistakes. I liked 'nothing but peace', 'english note', 'jagadodharana' and the conclusion concept of 'colors' where they played various pieces of classical bits, one after the other with smooth transition. The dance performance was good.

Fourth day rocked!! There was a natyalaya run by Dr.Bala Murali in chennai, called Vipanchi. Four from that group performed four forms of dance, Bharatanatyam, Kuchipudi, Odyssey and Kathak. And the final piece was Jugalbandi!! It's a mix of the four forms performed by all four on stage! About the performances, 'awesome' and 'astounding' can at best be modest in talking of those enthralling performances. Following are few details about the performers...

Indian Rock!

Carnatic Fusion

నిన్న రవీంద్ర భారతిలో రాజేష్ వైద్య గారి వీణ కచేరీ అని మన పురుష్ చేప్తే వాడితో బయల్దేరా. పురుష్ అతని గురించి కొంచెం చెప్పాడు, మాం..చి స్పీడులో వాయిస్తాడు మామ, వీణ, అని. ఒక video కూడా చూపించాడు. ఆ బావుందిలే అనుకున్నా, నిజంగానే బావుందనుకోండి, కాకపోతే ఎందుకో.. ఎందుకో ఏమిట్లే నా బొంద, ఆ బొచ్చు విరబోసుకుని, వాయించేటప్పుడు తెగ ఊగిపోతుంటే నాకు కాస్త చిర్రెత్తుకొచ్చింది. ఏదో శిలా విగ్రహంలా కూర్చోమని కాదుగాని, ఎందుకో కాస్త అతిలా అనిపించింది ఆ ఊపు! సరే ఆ చిరాకు కాసేపు దిగమింగుకుని వెళ్ళాను కచేరీకీ.

ఘల్ ఘల్ 'ఘజల్'

అనగా అనగా అనగా... ఒక ఐఐఐటి. అదేంటోగాని నిన్నమొన్నటి దాకా 'made of techy-crap' లా కనిపించిన ఆ ఐఐఐటి... మన ఐఐఐటి.. హైదరాబాద్ లో, గచ్చిబౌలిలో ఉన్న ఇదే ఐఐఐటి.. నాకీ మధ్య రకరకాలుగా కనిపిస్తుంది. ఒక సంగీతారాధనలోనేంటి, ఒక 'స'సమాజ నిర్మాతగానేంటి.. ఒక సదిశానిర్ధేశిగానేంటి.. ఇలా మొత్తానికి నేను చేరుకోవల్సిన చోటికే చేరుకున్నానని, నా జీవితంలో మూడు అతి చిన్న[1]సంవత్సరాలలో తెలిసింది..అనగా నేనిప్పుడే నాలుగో సంవత్సరంలోకి వచ్చానన్నమాట! ఒకసారందరూ SE[2]కి గోవింద కొట్టాలమ్మా.. 'గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద!..' శబ్బాష్!!

Memorable… the chevalier!

నాకు ఐఐఐటి పంచిన మరిచిపోలేని అనుభూతుల్లో మరో ముత్యం… ఇవాళ HCU లో ఆయన (chevalier అన్నా గుర్తు రాకపోయుంటే.. బాల మురళి కృష్ణ గారు) కచేరీ ఉంటే, తొక్కలో exams వల్ల వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సమయంలో సామ్రాట్ రూం కి వెళ్ళా. అదే time లో వాడు 'DVDs ఇవ్వాలి.. HCU కి వస్తావా?' అన్నాడు. హమ్మా.. దొరికాడ్రా బాబు తోడు, అనుకుని 'సరే' నన్నా. ఇద్దరం బైక్ మీద 3 నిమిషాల్లో ఆడిటోరియంకి చేరుకున్నాం. అప్పటికి లోన్నుంచి 'గౌరీ.. నన్ను బ్రోవుమా' అని వినిపిస్తుంది. లోపలికి వెళ్ళేసరికి, ఖాళీల్లేవే! చూడగా చూడగా చివరగా రెండు సీట్ట్లు కనిపించాయి.. పోయి కూర్చున్నాం.

పెద్దవాళ్ళు కొంతమంది తాళం వేస్తూ ఉన్నారు. students మాత్రం 'hmmm..' అన్నట్టు చూస్తున్నారు. ఒక నిమిషం అలాగే గడిచింది. వాసు sir, పురుష్ stage మీదనే వున్నారు. ఈ మధ్యలో సామ్రాట్ వెళ్తానని చెప్పి బయల్దేరాడు. sudden గా hall అంతా నిశ్శబ్దం!