దాదాపు సంవత్సరకాలంగా మనసులో కదులుతున్న కల కళ్ళముందు ఒక రూపం తీస్కుంటుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు! తెలుగువారికి సాంకేతిక సహాయం అందించాలన్న దిశలో నేటికి తొలిఅడుగు సాకారమైంది. ఈనాడులో టెక్‌సేతు పరిచయమైంది, కొన్ని వేల, లక్షలమందికి అది చేరింది. టిడ్బిట్స్ లో గత రెండు నెలలుగా టపాలు కరువైంది కూడా ఇందుకే :) ఈనాడులో టెక్‌సేతు గురించిన ఆర్టికల్ - ఇక్కడ చూడండి. ఇదీ టెక్‌సేతు లింకు. పేపరు వేయించునేవారు, గురువారం వచ్చే e-నాడు సెక్షన్‌లో ఇది ఉంటుంది.
నా సైటులో ఉండే సమాచారం ఈ మధ్య తెలుగులో కూడా ఎక్కువ ఉండటం వల్ల, ద్రుపాల్‌తో పాటే వచ్చే శోధన యంత్రంలో యూనీకోడ్ వెతకడానికి సదుపాయం లేకపోవడంతో కాస్త చిక్కుల్లో పడ్డాను. వెతికినప్పుడల్లా, "You must include at least one positive keyword with 3 characters or more." అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది.

దీనికోసం "ద్రుపాల్ లో తెలుగు వెతకడం ఎలా" అని అక్కడ, ఇక్కడ కనబడిన వారందర్నీ అడిగి విసిగించేశాను. కాస్త స్వయంగా రంగంలోకి దిగి కిందా మీదా పడ్డాను, కాని ద్రుపాల్ గురించి తెలుసుకోవల్సినవి బోల్డన్ని తెలుసుకున్నాం కాబట్టి, అదంతా వృధాగా పోలేదు. మొత్తానికి దారి దొరికింది. మీ సైటులో యూనీకోడ్ మూలానికి సూచిక నెలకొల్పాలంటే చేయాల్సిందిదీ..
Note: Just press 'F5' if you find the layout messy.
Here are list of Firefox add-ons which I love; Hence, let's call them tidbits list of best 'n' Firefox add-ons.
|
Nothing beats it! As a hobbyist web developer, I love it! It's just, *amazing tools* brought together. You call yourself a web developer and you don't understand firebug, then better never anymore call yourself a web developer. Need say more? |
|