మా చెల్లికి ఎంసెట్ లో 639 ర్యాంక్ వస్తే ఎక్కడ జాయిన్ చేస్తే బావుంటుందో తెలుసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఏరియా ని బట్టి వచ్చే సీటు రాకుండా పోవడం, అమ్మాయి కాబట్టి బెనిఫిట్ ఉంటుందేమో చూసుకోవడం.. ఇవన్నీ కలిపి చూస్తే, తర్వాత చింతించకుండా ఉండే సరైన ఒక నిర్ణయానికి రావడం కొంచెం కష్టమైనా వ్యవహారమే. అప్పట్లో తను పడిన ఖంగారు నాకు ఇంకా గుర్తుంది. ఇక మీద పాపం పిల్లలు అంత ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఒకే సైట్ లో మొత్తం సమాచారం అందించే ప్రయత్నంలో స్నేహితులు aftereamcet.com మొదలుపెట్టారు. వాళ్ళ ర్యాంకు, పరిథి ఇలాంటివి దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి ఏయే కాలేజీల్లో సీట్లు రావచ్చో చూపిస్తుంది. మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఎంసెట్ రాసిన వాళ్ళు ఉండి ఉంటె వాళ్ళకి ఈ సమాచారం చేరవేయండి మరి.
దాని కర్తలందరికి నా మనస్పూర్తి ధన్యవాదాలు! శుభాశీస్సులు!