జోకులు

జోకులు - 2

కొన్ని జోకులు చదివేకంటే, చెప్తేనే బావుంటాయి.. ఈ కిందవాటిలో 'రావణుడు - April Fool!' జోక్ ఆ కోవలోనిదే.(ఈ జోకులన్నిటికి మూలాలు కూడా చెబుదామనుకున్నగాని ఇవన్నీ చాలా చోట్ల ఉండే జోకులే.. ఏది మొదటి మూలమని చెప్పటమో కుదరక చెప్పటం లేదు.. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మందు

రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏంటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

జోకులు!

నాకు అప్పుడప్పుడు వెబ్ లోనో, స్నేహితుల దగ్గరో తారసపడే కాస్త బావుండే జోకులన్ని పొందుపరిచాను.. అందులో కొన్ని ఇవి...

ముఖ్య గమనిక : తొక్కలో లాజిక్కులు తీయకుండా, ఎక్కువైంది, తక్కువైంది అని గొణక్కుండా, జోక్ ని జోక్ లా ఆస్వాదించ ప్రార్థన.  ఇవి మీకు ముందే తెలిసుంటే 'పోనిలే' అని వదిలేయటం మంచిది. ఇక జోకుల విషయంకెళ్ళిపోదాం..

లింగం మావ - మూత్ర పరీక్ష