బార్సిలోనా రాంగానే చేతిలో ఉన్న ల్యాప్టాప్ కి రెక్కలొచ్చో కాళ్ళొచ్చో తుర్రుమంది. సమయానికి ల్యాబ్ వాళ్ళు ఒక మ్యాక్ బుక్ ఇచ్చి ఆదుకున్నారు. ఈ స్పానిష్ సామ్రాజ్యంలో ఇంగ్లీషు వస్తువు మచ్చుకైనా కనబడ్డం కష్టం కనుక ఇన్నాళ్ళు మన దేశానికొచ్చిన తర్వాతో, అమెరికా నుంచి ఎవరైనా వచ్చేట్టుంటే వాళ్ళతోనో తెప్పిద్దాం అని ఊర్కున్నా. కాని ఇన్నాళ్ళు ఆపుకున్న ఆత్రం నాజూగ్గా, సెక్సీగా ఉన్న కొత్త మోడల్ ఒకటి చూసే సరికి కట్టలు తెంచుకుంది :P
ఇదిగో ఇదే! ఏసర్ వాళ్ళు మార్కెట్లో దింపిన కొత్త మోడల్. Dell XPS, Lenovo Thinkpad ని పక్కకు నెట్టి నన్ను ఇదే కొనేలా చేసింది.
![]() |
![]() |
![]() |
![]() |
దాని వివరాలు:
Processor: Intel core i3-2310m 2.1 GHz
Hard disk: 640 GB (5400 rpm)
Memory: 4GB (1333 MHz)
Screen: 13.3 inch (1380x720)
Graphics: NVIDIA GT540M with optimus, 1 GB vram.
Battery: 6-cell (claims 8 hours backup)
Weight: 1.9 kg
ప్రత్యేకించి నాకు నచ్చింది ఆ చివరి రెండూనూ! సౌండ్ కూడా చాలా బావుంది (Dolby home theater)! ఇంకో మంచి విషయం - ఎంత సేపు పని చేసినా వేడి తెలియదు మనకి. మామూలుగా ఐతే ఒళ్ళు, చేతులు కాలి బూడిదయిపోతాయి వెధవ వేడికి! కాని భలే నిర్మాణంలే దీనిది! ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది కొనుక్కోవచ్చని నా సలహా! :-)
నాకు స్పెయిన్ లో 699€ అయింది. ఇండియాలో ఇంకా ఇవి వచ్చాయో లేదో తెలీదు. హైదరాబాద్ లో ఐతే లేవు అని నిన్న గవేష్ చెప్పాడు.
acer valla models baguntay
acer valla models baguntay .... specially heat chala thakkuva generate chesthay .... mine is acer ....
:-) మొన్నటి దాక చాలా చెత్త
:-) మొన్నటి దాక చాలా చెత్త అభిప్రాయం ఉండేది, ఫ్రెండ్స్ అందరూ తిట్టుకోవడం చూసి..
ఈపాటికి పాడై ఉండాలే. నాది
ఈపాటికి పాడై ఉండాలే.
నాది ఏసర్ అనుభవం.
లేదండీ, బాగానే పని చేస్తుంది.
లేదండీ, బాగానే పని చేస్తుంది. ఈ సిరీస్ అంతా బాగానే ఉన్నాయని వినికిడి.
Post new comment