తిరుపతి

Submitted by gopal on Fri, 05/08/2011 - 19:18

ఎప్పుడో చిన్నప్పుడు చుట్టాలందరం కలిసి ఒకసారి వెళ్లినట్టు గుర్తు అంతే. మళ్ళీ దాని ముఖమెరిగింది లేదు. అప్పుడప్పుడు టీవీలో జనం పెరిగారు, తగ్గారు అని వినడమే. ఇదిగో ఇన్నాళ్ళకి ఇప్పుడు ఇంట్లో అందరికీ కుదిరి మొన్న శుక్రవారం 29న వెళ్ళాం. శనివారం పొద్దున్నే రైలు దిగ్గానే మా చెల్లి, నేను మెట్ల దారిలోనూ, అమ్మ, నాన్న, మావయ్య బస్సులోనూ తిరుమలకి చేరుకున్నాం. దాదాపు 3500 ఉన్నాయేమో మెట్లు, ఎక్కడానికి సుమారు 4 గంటలు పట్టింది, మెల్లగా ఫోటోలు తీస్కుంటూ ఎక్కితే. తెలిసినవాళ్ళు ఉండబట్టి రూం దొరికింది. మామూలుగానైతే ఏ ఎమ్మార్వోనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫార్సు చేస్తేనేగాని ఓ పట్టాన దొరకవంట అంత తొందరగా!

నడిచి కొండెక్కిన వాళ్లకి త్వరగా దర్శనం అవ్వడానికి ఏదో సదుపాయం చేసారు. తీరా మేం వెళ్లి ఆ లైన్లో నిలబడ్డాక తెలిసింది దాని పనితనం. మామూలుగా చెప్పినట్టు ఐతే 2 గంటలలోపు అయిపోవాలి దర్శనం. మాకు 5 గంటలు పైనే పట్టింది. అదీకాక ఆ లైనంతా బందెలదొడ్డి లాగా నెట్టుకోవడం, తొక్కుకోవడం. ఆడవాళ్ళకి, పిల్లలకి, ముసలాళ్ళకి వేరే క్యూ పెట్టాలన్న ఇంగితం ఇన్ని సంవత్సరాలైనా రాలేదా ఆ __@#$%__ గాళ్ళకి? ఒక నెలల పిల్లాడికి ఆ తోపులాటలో ఊపిరి ఆడకపోతే ఎంతో కష్టం మీద వందల మంది మీద పడుతుంటే లైనుకి ఎదురీదుకుంటూ బయటకుపోతుంది ఆ పిల్లాడి తల్లి. దున్నపోతుల్లా ఉన్న జనం సందివ్వడం మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎముకుల కోసం కొట్టుకునే కుక్కల్లా తోసుకొచ్చేస్తున్నారు. ఎంత చెప్పినా ప్రయోజనం శూన్యం. నాకైతే ఒక్క క్షణం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కిపోయి ఏ అడవిలోనో పడ్డట్టు అనిపించింది. "దర్శనం" మీద అప్పటిదాకా ఉన్న ఆసక్తి పూర్తిగా పోయింది. ఆ క్యూలో ఆడవాళ్ళ ఇబ్బందులు చెప్పేవి కావు.

ఇక తిండి. ఎంత దరిద్రగొట్టు హోటలైనా సరే, మా గోదావరి సైడులో కనీస సదుపాయంతో మంచి ఆహారమే పెడతారు. కాని ఆ తిరుపతిలో వెధవలు ఎంత ముదనష్టపు సంతంటే, వాళ్ళ గొప్ప చెప్పడానికి మాటలు రావట్లేదు. తిరుమల మొత్తానికి ఓ మోస్తరు తిండి అన్నమయ్య హోటల్లో తిన్నాం (సప్తగిరి అనే హోటల్ కూడా పర్లేదు అని చెప్పారు). మొదటి రోజు తిన్న చోటల్లా ఐతే తిట్టుకుని లేవడమే. నాకు తిరుపతిలో వ్యాపారం తప్పితే ఏమీ కనబడలేదు. భక్తి ఉన్నవాడికి క్షమ, క్రమశిక్షణ ఉంటాయి. ఆ తోపులాటలు, తొక్కిసలాటలు చూస్తే ఉన్మాదం గుర్తొస్తుందే తప్ప భక్తి భావన ఉందని అనిపించదు. ఇక భక్తి పేరు మీద అక్కడికి వచ్చే జనాన్ని మోసం చేస్తూ చేస్తున్న వ్యాపారాలు అనేకం. ఇంత మంచితనం మధ్య చేస్కునే ఆ దర్శన అనుభవం ఎంతవరకు, ఏ విధంగా గుర్తుండిపోతుందో దేవుడికే తెలియాలి.

సాంస్కృతిక కార్యక్రమాలు, చుట్టూ పచ్చని కొండలు, పేదలకు ఉచితాన్నదానాలు - సత్రాలు తిరుపతిలో నాకు నచ్చిన విషయాలు.

Vori vedhava, vachavani oka

Vori vedhava, vachavani oka mata kuda cheppaledhu kadharaa adda gaadidha. 6 nelala tharvatha correct ga adhe rojuna nenu ma intikella ra. nuvvochavani thelusunte nenu vachevadini, adho chethanaina sayam chesevadini ga. annintiki minchi maa musalodini chusi enni rojulaindhoo... :(

Aina ekkada padithe akkada thinte alane vuntadi gopi. konda paina okka hotel lo kuda bagundadhu okka mayura thappa. veetannintikanna akkada annadanam lo pette bhojanam taste vere eh hotel lonu radhu.

Aina asalu nenokadini vunnani mamuluga gurthulekapoina, atleast ma Tirupati ki vachinappudaina gurthundali kada ra vedhavannari vedhava.

Inkoka sareppudaina naku thelikunda TPT ki vachinatlu theliyali ah musali kallu rendu inchi poilo pedtha. jagratha......!!!!!!

ఈసారికి క్షమించేయ్రా

ఈసారికి క్షమించేయ్రా తిరపతోడా! ఇంకోసారి ఇలా చేస్తే నాలుగు తగిలిద్దూ గానిలే!

hmmm....!!! :)

hmmm....!!! :)

ఆడవాళ్ళకి, పిల్లలకి,

ఆడవాళ్ళకి, పిల్లలకి, ముసలాళ్ళకి వేరే క్యూ పెట్టాలన్న ఇంగితం ఇన్ని సంవత్సరాలైనా రాలేదా ఆ __@#$%__ గాళ్ళకి? ఒక నెలల పిల్లాడికి ఆ తోపులాటలో ఊపిరి ఆడకపోతే ఎంతో కష్టం మీద వందల మంది మీద పడుతుంటే లైనుకి ఎదురీదుకుంటూ బయటకుపోతుంది ఆ పిల్లాడి తల్లి.
---
వాళ్ళకి వేరే క్యూ ఉంటుంది. గుడి ముందు వైపు సీనియర్ సిటిజెన్స్ క్యూ అని ఉంటుంది..అక్కడ నుండి వెళ్ళాలి.

మామూలుగానైతే ఏ ఎమ్మార్వోనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫార్సు చేస్తేనేగాని ఓ పట్టాన దొరకవంట అంత తొందరగా!
---
అలా ఏం ఉండదు. తీతీదే వాళ్ళ సైట్ వాడి ముందే రిజర్వేషన్ చేస్కోవచ్చు. అక్కడ బుకింగ్ అయిపోతే ప్రైవేటు హోటళ్ళు, సత్రాలు నమ్ముకోవాల్సిందే.

మామూలుగా చెప్పినట్టు ఐతే 2 గంటలలోపు అయిపోవాలి దర్శనం. మాకు 5 గంటలు పైనే పట్టింది.
----------
ఎక్కిన వాళ్ళు వేలల్లో ఉంటారు. అందుకే ఆ సదుపాయాన్ని ఎక్కిన 24 గంటల్లోపు ఎప్పుడన్నా వాడుకోవచ్చు. 2 గంటల్లో తిరుమల దేవుని దర్శనం అంటే చాలా అరుదు.
ఇక ప్రైవేటు హోటల్ ఏదీ బావుండదు. అలాగే వాళ్ళ నిత్యాన్నదానంలో పెట్టే తిండి మరే హోటల్ లో దొరకదు.

ఆడవాళ్ళకి వేరే క్యూ ఉందన్న

ఆడవాళ్ళకి వేరే క్యూ ఉందన్న సంగతి ఎవరూ చెప్పలేదు. నాకు తెలిసి లేదు కూడా. నువ్వన్నట్టు బహుశా ముసలి వాళ్లకి ఉండి ఉండొచ్చు. సైట్ లో రూమ్లు అన్నీ అయిపోయాయి అని చూపించినా ఇంకా బోల్డన్ని గదులు అలాగే ఉంటున్నాయి. అవి ఇలా ఏదో ఒక రికమండేషన్ తెచ్చిన వాళ్లకి ఇస్తున్నారు. ఇది నా మాట కాదు.. అక్కడ పడిగాపులు కాస్తున్న వాళ్ళ మాట. నాకా ఇబ్బంది లేకపోయింది.

వాళ్ళు క్యూ పద్దతి బాగా తీర్చి దిద్దితే 2 గంటల్లో దర్శనం అందని ద్రాక్షలా ఉండదు. ఎంత చెండాలంగా ఉందో అది! పైగా నేను చెప్పింది మాములు దర్శనం కాదు కదా!

aadavallaki vere queue

aadavallaki vere queue ledanukunta.. pilla tallulaki.. musali vallaki aithe vere queue undi.. btw tinadaniki tindi dorakakpovadam entra.. tirumala lo nenu eppudu vellina brahmandanga tintoo unte.. nuvvu edo tappu place ki tappu time lo vellintav!!! rooms peak season lo dorakadam kashtam avvochu kani mamooluga aithe dorukutai....darshanam kuda ditto.. naaku oo sari 45 mins lo darshanam aipoindi...nadichi vellina vallaki general ga tondaragane aipotadi..

aadavallaki separate queue anedi nenu swatahaga aithe avasaram ledantanu..devuni deggaraki kutumba sametanga vellalanukuntaru janalu... nuvvu vellina vela visheshamo.. europe valla nidanam paddatulu vallanemo neeku ala anipinchi undochu!

నేను చెప్పిన క్యూ

నేను చెప్పిన క్యూ పసిపిల్లలు-కూడా ఒక మనిషి, పెద్ద వారు-కూడా ఒక మనిషి. కూడా ఇద్దరు వెళ్ళొచ్చు అన్న సవరణ కూడా ఉండింది అంట. ఆడవాళ్ళకి వేరే క్యూ ఉండనక్కర్లేదు నా దృష్టిలో కూడా.

రూములు అయిపోయాయి అని సైట్ కోటాలో చూపించి ఉంటుంది. అక్కడ కోటా వేరే ఉంటుందని తెలిసింది. మీకు ఎందుకు ఇవ్వలేదో మరి వివరంగా కనుక్కున్నారా లేదా అన్నది నాకు తెలీదు. అవి వేరే వాళ్ళు బుక్ చేస్కుని ఉండొచ్చు. ఏజెన్సీస్ ద్వారా అయ్యుండచ్చు.

క్యూ పద్దతి వాళ్ళు తీర్చి దిద్దితే మాత్రమే సరిపోదు. దేవుడి దెగ్గర తోపులాట ఎందుకు అన్న స్పృహ జనాల్లో ఉండాలి. కోట్ల మందిలో ఈ మార్పు ఒక్కసారిగా ఆశించలేం. ఇక వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళకి తగులుతున్న అడ్డంకులు తెలిసినవే కదా!

కాన్వెయర్ బెల్ట్ పెడతాము అంటే ఆగమ శాస్త్రం ఒప్పుకోదని, పైన బస ఎక్కువ రోజులు ఉంచకూడదు అని అంటే దేవుని సన్నిధి,పెళ్ళిళ్ళు-షష్టిపూర్తులకి అవసరం అని.

వాళ్ళు గర్భగుడిలో దేవుని దెగ్గర లాగేస్తున్నారు ,ఈడ్చేస్తున్నారు అన్న కోపం తప్పితే తీతీదే వారి యాజమాన్యం ఉన్నవాళ్ళలో మంచికి మంచిగానే పనిచేస్తున్నారు.

మీ చాదస్తం ఏమిటో నాకు అర్థం

మీ చాదస్తం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అలా మగవాళ్ళు ఆడవాళ్ళ మీద మీద పడుతూ వెళ్తుంటే సమ్మగా ఉంటుందా ఏంటి ఖర్మ? అలా అవస్థ పడుతూ వేల్లెకంటే, కనీసం వేరుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైనా ఉండాలి ఆ క్యూ. ఆ రోజు తితిదే యాజమాన్యాన్ని తిట్టుకోకుండా వెళ్ళిన ఒక్క జీవిని చూడలేదు నేను. మీరు ఏ టైంలో వెళ్ళారో ఏమో.. తెల్లవారు జాము తప్ప మిగతా టైం అంతా బాలేదు అనే వింటున్నాను. నేనైతే నా అంతట నేను చూసి వచ్చాను కాబట్టి అక్కడి పరిస్థితి గుర్చి మంచి అభిప్రాయం మటుకు లేదు.

ఇక తిండి విషయం - ఆ నిత్యాన్నదానాల్లో కూడా లైన్లో పోవాలేమో అని భయమేసి హోటళ్ళలోనే తిన్నాం. అదొక్కటే పొరపాటు నిర్ణయం.

ఎవరికీ అది సమ్మగా ఉండదు.

ఎవరికీ అది సమ్మగా ఉండదు. జనాభా ఎక్కువున్నప్పుడు కొన్ని తప్పవు. ౩౦౦ రూపాయల క్యూ అన్నా అలానే ఉంటుంది,ఏం చేస్తాం? ఇక అన్నేసి క్యూలు ఉంటె కలిపే దెగ్గర గుద్దులాట అనివార్యం. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఘోరం.

ప్రభుత్వాన్ని లేదా యాజమాన్యాన్ని(ఇక్కడ) తిట్టకుండా ఏ జీవి ఉన్నాడులే మన దేశంలో? వాడు సరిగ్గా ఉన్నాడో లేదో అక్కర్లేదు వాడికి. అందుకని నువ్వలా విని ఉంటావు. వాళ్ళ తప్పులు లేవు అనట్లేదు. అది మన దేశంలో సహజం. ఎటొచ్చి వారి ప్రయత్నం ఉంది. మిగితా సంస్థలతో పోలిస్తే కొన్ని రెట్లు నయం.

నేను చాలా సార్లు వెళ్ళాను.తృప్తిగానే దేవుణ్ణి చూస్కుని వచ్చాను. గుంపులో గుద్దులాట సహజం.అంత మందిలో మరీ సహజం.

నిత్యాన్నదానం అప్పుడు పెద్ద క్యూ తప్పనిసరిగా ఉంటుంది.

సగటు భారతీయుడి బుద్ది

సగటు భారతీయుడి బుద్ది అంతేలే..  సర్దుకుపోవడం, గుంపులో కొట్టుకుపోవడం! గళం కలపడం మానేసి వేలెత్తి చూపెట్టినవాడినే దుయ్యబట్టడం... సరేలే. వదిలేయ్ ఈ వాదన, ఇక్కడ వాదించుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options