అది నాకు రాసింది కాదనుకోండి. కాని నాకు ఇదివరలో బాగా నచ్చిన రాతల్లో అదొకటి. చాలా సహజంగా రాశారామె. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో, ఒకానొక ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిందది. నా అలవాటు ప్రకారం కత్తిరించి దాచుకున్నా. అలా దాచుకున్నవి ఎన్ని పోయిన ఇదోటి మాత్రం భద్రంగా ఉంది. శ్రీ చైతన్యలో మాది మగాళ్ళ కొంప కావడం వల్ల ప్రతి ఒక్కడు కక్కృత్తి గాడే. మా హాస్టలు కూకట్‌పల్లిలో సరిగ్గా బస్టాండుకి ముందుండేది. పక్కనే అమ్మాయిల కాలేజీ. ఇక సాయంత్రం ఐదైంది మొదలు, వాళ్ళ కాలేజీ వదిలేయగానే సొళ్ళు కార్చుకుంటూ వరండాలోకొచ్చి తిష్టేసేవాళ్ళం. ఒక అరగంట నేత్రానందం. :P అలాంటి బీభత్సమైన హాస్టల్ వాతవరణంలో ఇలాంటివి చదివిన ప్రతిసారి మామీద మాకే అసహ్యం వేసేది. ఎందుకురా మన బ్రతుకు అని! ఇదే అది... హా.. ఒక్క విషయం, ఇది నచ్చలేదని చెప్తూ చేసిన ఏ చెత్త వ్యాఖ్యైనా నిర్థాక్షణ్యంగా తీసేస్తాను. :D






ఈ మాట గత నెల రోజుల్లో పలుమార్లు నాలో నేను అనుకోవటం జరిగింది.. ఒక్కోటి ఒక్కో రకం అనుభూతి.. ఒకదానికి, ఇంకోదానికి సంబందం లేదు. సరే.. మరీ ఎక్కువ నాంచకుండా విషయాలకొచ్చేద్దాం.
మొదటిది, అది నా అలవాటో, పొరపాటో...... శ్వేత! N.I.T తిరుచ్చి నుంచి మన కాలేజీకి intern చేయడానికొచ్చినమ్మాయి. చూడగానే మొదట నా మనసులో అనుకున్నా.. 'హామ్మా..', ఆపుకుందాం అనుకునే లోపే మిగతా మాట పైకే వచ్చేసింది.. 'దీంతస్సారావలోడి బొడ్డు!' ఆ అమ్మాయిని రెండు ముక్కల్లో tag చేయాలంటే.. graceful, beautiful. మరీ perfect అని కాదుగాని, ఎందుకో.. చూస్తుంటే చూడాలనిపించే అందం ఆమెది. అందుకే, అప్పుడప్పుడు NBH mess లో తిని తరించేవాడ్ని. :P "you look beautiful!" అని నేను rehearsals వేసి ఆ అమ్మాయికి చేబుదామనుకునే లోపే తుర్రుమంది. మీరు గాని, ఆ అమ్మాయికి గాని, ఫ్రెండు గాని అయితే, కాస్త ఈ కాకి కబురు ఆ పిల్ల చెవిన వేద్దురూ.. :) ఇంతకీ ఆ పిల్ల తమిళమ్మాయి. నాకు అరవం రాదు గాని, లేకపోతే ఈ టపా అందులోనే ఇరగ దీసే వాడ్ని.