"రేయ్ మామా! మన టింకూగాడు పరువుతీశాడ్రా, తలంబ్రాల కాణ్ణుంచి ఉంగరం దాకా అన్నిటిలోనూ తుస్సే!"
"తెలిసిందేకదరా! లావణ్య దగ్గరుంటే ఆ ఎదవకి నిప్పెట్టేసినా చల్లగా ఒళ్ళప్పగించి కూర్చుంటాడు, ఇంక పెళ్ళంటే ఏ లోకంలో ఉండుంటాడో!"
"సర్లేగానిఅసలు నువ్వెళ్ళిన పనేమైంది? ఐపులేకుండా పోయావ్! వాళ్ళు రేపు అన్నవరం వెళ్ళి, తర్వాత నాలుగు రోజులు ఇక్కడుండి బెంగళూరెళిపోతారంట. ఎప్పుడొస్తావ్ నువ్వు?"
"ఏం చెప్పమాంటావ్ రా? ఇక్కడి పరిస్థితి ఏం బాలేదు.."
"ఊహు..."
"ఇంకెన్నాళ్ళు పడుతుందో చెప్పలేం. నేను ఎటూ ఫోన్ చేస్తానులే వాళ్ళకి! బెంగళూరులో తప్పకుండా కలుస్తానన్నానని చెప్పు!"
"నువ్వు జాగ్రత్త స్వామి, వాడికి లావణ్యైతే, నీకు నీ పని! వీలైతే వాళ్ళకి పిల్లలు పుట్టేలోపు వచ్చేయడానికి ట్రై చేయ్.."
"ఏడిశావ్! నేను జాగ్రత్తగానే ఉంటాలేగాని, ఇప్పుడు బయల్దేరాలి. ఉండనా మరి?"
కౌముదిలో గొల్లపూడి గారి కాలమ్ లో 21/05/2011 న ఒక వ్యాసం పడింది, 'సీత' అనే బూతు అని. అది చదవంగానే అలాంటిదే మా అమ్మ చెప్పిన ఇంకో కథ గుర్తొచ్చింది. ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగస్తులు. గొల్లపూడి గారు చెప్పిన దాంట్లో భర్తకి అండమాన్ లో పోస్టింగ్ పడింది, భార్య రానంది - విడాకుల దాకా పోయింది. అమ్మ చెప్పిన కథలో భార్యకి అమెరికాలో పోస్టింగ్ పడింది (కొన్ని నెల్లకే!), తన అత్తమామలు వద్దన్నారు, భర్త మారు మాట్లాడలేదు - అది కూడా విడాకుల దాకా పోయింది. మారుతీరావుగారి వాదనలో ఇదీ అని చెప్పలేని ఏదో ఒక లోపం ఉందనిపించింది - సీత గురించి కాదు, విడాకుల గురించి.
Very concisely for non-telugu readers, here is what I have to say: You can learn this language (Telugu) just for this movie! If you think it is an exaggeration, ask your Andhra friends about Jandhyala or Viswanath movies.
జంధ్యాల, విశ్వనాధ్ సినిమాలు చాలానే చూశాను. ఇదెక్కువ అది తక్కువ అనను కాని చాలా కారణాల వల్ల ఈ ఆనంద భైరవి సినిమా మటుకు మా బాగా నచ్చేసింది. అదేదో సినిమా చూసినట్టు కాదు, వాస్తవాన్ని నెమరువేసుకున్న భావన కలుగుతుంది తెలుగుదనం తెలిసిన వాడికి. కథ సంప్రదాయ నృత్యం కోసం ప్రాణాలిచ్చే ఒకతని పట్టుదల చుట్టూ అల్లుకుని ఉంటుంది, శంకరాభరణం సంగీతానికెలాగో ఇది నృత్యానికలాగన్నట్టు. కథని ఒకపక్క వాస్తవానికి చాలా దగ్గరగా నడిపిస్తూనే, ప్రేక్షకుల బావోద్వేగాలకేలోటూ రానియ్యలేదు జంధ్యాల. అది పక్కనబెడితే ఇందులో చాలా విషయాలు కళ్ళు చెమర్చేలా, మనసు నిండేలా, కడుపు పగిలేలా... ఇలా ఒకరకం గాకుండా ఉన్నాయ్! జరిగే సన్నివేశాలన్నీ అస్సలు ఊహించనివి కావూ, మనం జీవితంలో చూడనివి కావూ, అయినాసరే! ఉదాహరణకి, రెండు సీనులు.
మూడేళ్ళ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా కుదరనిది, ఈ యేడు బంపర్ ఆఫర్ తగిలినట్టు ఉత్సవ సీజన్ మొత్తం చెన్నైలోనే ఉండే అవకాశం వచ్చింది. అదేంటో తెలియని వాళ్లకి రెండు ముక్కల్లో చెప్పాలంటే - క్రికెట్ అభిమానులకి వరల్డ్ కప్ ఎలాగో, సంగీతాభిమానులకి చెన్నై డిసెంబర్ ఉత్సవాలు అలాంటివేనని చెప్పొచ్చు!
మొత్తం మూడు రకాల ప్రోగ్రాంలు ఉంటాయంట.
ఎప్పుడో చిన్నప్పుడు చుట్టాలందరం కలిసి ఒకసారి వెళ్లినట్టు గుర్తు అంతే. మళ్ళీ దాని ముఖమెరిగింది లేదు. అప్పుడప్పుడు టీవీలో జనం పెరిగారు, తగ్గారు అని వినడమే. ఇదిగో ఇన్నాళ్ళకి ఇప్పుడు ఇంట్లో అందరికీ కుదిరి మొన్న శుక్రవారం 29న వెళ్ళాం. శనివారం పొద్దున్నే రైలు దిగ్గానే మా చెల్లి, నేను మెట్ల దారిలోనూ, అమ్మ, నాన్న, మావయ్య బస్సులోనూ తిరుమలకి చేరుకున్నాం. దాదాపు 3500 ఉన్నాయేమో మెట్లు, ఎక్కడానికి సుమారు 4 గంటలు పట్టింది, మెల్లగా ఫోటోలు తీస్కుంటూ ఎక్కితే. తెలిసినవాళ్ళు ఉండబట్టి రూం దొరికింది. మామూలుగానైతే ఏ ఎమ్మార్వోనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫార్సు చేస్తేనేగాని ఓ పట్టాన దొరకవంట అంత తొందరగా!
చంద్రముఖికి గుణశేఖరుడు ఎలాగో.. కోతికి కొబ్బరిచిప్ప ఎలాగో.. తెలుగు, కర్ణాటక సంగీతం, కృష్ణదేవరాయలు - ఇవి నాకు అలాగ. నాతో పాటు ఉంటున్న పెరూ దేశస్తుడికి వీటి గురించి నేను చెప్పేవి వినీ వినీ వినీ నేను చెప్పే కొన్ని విషయాలు కంఠతా వచ్చేశాయి. ఒక రోజు రాయల గురించి చెప్పాక, వాడిలా అన్నాడు, "అదంతా బానే ఉంది గురు (వాడ్ని వాడు శిష్య అని పిలుచుకుంటాడు), ఇప్పుడు మీ రాజు గురించి కొన్ని నచ్చని విషయాలు చెప్పు" అని. అంతగా ఏం లేవు పొమ్మన్నా. "పోనీ నచ్చనవి కాకపోతే, తను చేసిన ఏదైనా పనిని పరివిధాల ఆలోచించి విమర్శిస్తూ చెప్పు" అన్నాడు. "అబ్బే, ఏమీ తోచట్లేదబ్బాయ్, ఒకవేళ చెప్పినా ఆయన గొప్పతనానికి ఆ విమర్శలన్నీ చంద్రుడి మీద మచ్చలే అవుతాయి" అన్నా. నా సమాధానం అసంతృప్తిగానే ఉంది వాడికి.
CompMusic (English version of this article here) అని పిలవబడే ఈ పరిశోధక ప్రాజెక్టు, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సౌజన్యంతో చావియర్ సెర్ర (Xavier Serra) నిర్వహణలో 2011 నుంచి 2016 దాకా నడుస్తుంది.
Click here for the english version.
నా తలరాత రాసిన వాడు కుంచె తేనెలో ముంచి రాశాడో ఏమో.. నా జీవితం అంతా ఇంతగా సంగీతమయం అవుతుందని కొన్నేళ్ళ క్రితం అనుకోను కూడా లేదు. ఆ తీపి నాకు దగ్గరలో ఉన్న నలుగురికీ రుచి చూపించాలన్న తాపత్రయంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అందాలు పైపైన చూస్తే అగుపించవు, పాలపుంతల్లో వింతల్లా! విశ్లేషించే కొద్దీ కితకితలు పెట్టి, వెన్ను చలి పుట్టించే అద్భుతాలు దర్శనమిస్తాయి. అలాంటి అపురూమైన ఒక కళ మన కర్ణాటక సంగీతం! వైరాగ్యం ఒళ్ళంతా పులుముకుని, సర్వరస పానం చేస్తూ, భావ గర్భంగా ఒక మౌని పలికే పలుకును ఆబాలగోపాలం సహానుభూతితో వింటూ పరవశించేలా చేసే అమోఘమైన వాహకం! ఎన్ని చెప్పినా ఆ అమృతం తీపి అనుభవిస్తేనే గాని తెలీదు. అందుకే ముందు ఈ కృతి వినేయండి :-)
నోట్: ఆటలో అరటిపండులాగా ఫీలయ్యిపోయి ఏడ్చే మొహాలు ఈ టపా చదవరాదు, చదివితే పేలరాదు :P
పరుచూరి, బాలయ్య, జూ.ఎన్టీయార్ లాంటి వాళ్ళ పుణ్యమా అని మా సామాజిక వర్గానికి చెందిన మగవారి తొడలు, జబ్బలు బాగా బలిష్టమైనవిగా చరిత్రకెక్కాయి. వాటి పవర్ కి మెరుపులు రావడం, పిడుగులు రాలడం లాంటి చిన్న చిన్న పరిణామాలే కాక రైళ్ళు వెనక్కి వెళ్ళడం, కుర్చీలు నడిచి రావడం లాంటి బృహత్కార్యాలు కూడా జరుగుతాయని ధియేటర్ల స్క్రీన్లు చింపించి మరీ చెప్పారు మరి! :D అన్నట్టు మీసాలు కూడాను! ముడ్డి మీద పదేళ్ళు లేని మా పిల్లనాయాళ్ళు కూడా రొయ్యల్లా మెలేసేస్తుంటారు! ఇంక పెద్ద వాళ్ళ సంగతి సరే సరి!