చలం - స్త్రీ స్వేచ్చ
1930 కాలంలో చలం నవలలు సృష్టించిన ప్రకంపనలకి, తెలుగు నేల కంపించి, పాతాళాన నాటుకున్న పురుషాధిక్య సమాజపు పునాదులు అట్టే గజగజ వణికాయి. ఆయన ప్రతిపాదించిన వివాదాస్పద స్వేచ్చ ఎంతో కలకలం రేపింది. నవలలకేనా..? అని అలా నోరెళ్ళబెట్టమాకండి. అది తెలుగు సాహిత్యానికి బంగారు యుగం. అందరూ సాహిత్యంలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు గుర్తించే కాలం.
మన(ఐఐఐటి-హైదరాబాదు) డైరెక్టర్ సంఘల్ గారు రెండో సం|| లో AI క్లాసులో ఒక మాటన్నారు. యథావిది గుర్తులేదు గాని, మనచేత ఒక పని చేయించాలి అంటే దాన్ని ఒక భూతద్దంలో చూపించి భయపెడితే గాని అందులో సగమైనా చేయడానికి మనకి మనసు రాదే అని అందరు గురువుల తరపున తనే గోడు వెళ్ళబోసుకున్నారు. నాకు చలం మైదానం చదివాక ఆ మాట గుర్తొచ్చి నవ్వొచ్చింది. నిజమే కదా! అప్పట్లో అలాంటి ఇనుప సంకెళ్ళ నిర్భంధంలో ఉన్న ఆడవాళ్ళు నిజంగా వాటిని తెంచుకుని ఉంటే పరిస్థితులెలా ఉండేవో మనకు చలం నవలల్లో కనబడుతుంది. ఆయన ఆ చెప్పడం కూడా ఎలా చెబితే జనాల బుర్రకెక్కుతుందో అలా చెప్పారు, అదే! భూతద్దం.
ఆయన మీద పాశ్చ్యాత్య జీవన విధానం విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఇక్కడ ప్రస్తావించిన జీవన విధానం అప్పట్లో పశ్చిమ దేశాల్లో వచ్చిన ఆర్థిక, మానసిక మార్పులది. ఆయన ప్రకటించిన తీవ్రభావాల బీభత్సునామీకి ఆంధ్రదేశం అట్టుడికిపోయింది. సంప్రదాయకుల గుండెలపై మద్దెలు వాయించి, నిరంకుశంగా నర్తించిన ప్రళయ రుద్రుడాయన. స్త్రీకి, శరీరపరమైన, మానసిక స్వేచ్ఛ ఉండాలని, తన ప్రతి రచనలోను ఉద్ఘాటించిన మహా రచయిత. అప్పటి భారత స్త్రీ, పురుషులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి మతిలేక పెట్టిన కొన్ని మితిమీరిన నీతినియమాల పేరుతో ఎంతగా మోసగింపబడుతుందో తన పదునైన , వాడి-వేడి రచనల ద్వారా రచ్చకీడ్చాడు, చర్చకు పెట్టాడు. పెద్దలు గొళ్ళుమన్నారు, సంఘంలో నిరాఘాటంగా సాగుతున్న తమ మగ పెత్తనానికి ఎసరు పెట్టాడని గుండెలు బాదుకున్నారు. కాని ఆయన ప్రతిపాదించిన స్త్రీ స్వేచ్ఛకి సంతోషకరమైన ముగింపు మనకు చాలా నవలలలో కనబడదు. అప్పటికి, స్త్రీకి విద్య లేకపోవటం, తనకు వృత్తి పరమైన ఆధారం లేకపోవడమే దానికి కారణాలని నేననుకుంటాను. ఆయన్ని ప్రభావితం చేసిన పశ్చిమ దేశాల సంస్కృతుల్లో అప్పటికే స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకోవటం, ఉద్యోగం చేయటం ఉన్నవి కాబట్టి అక్కడి స్త్రీ స్వేచ్ఛకి పెద్దగా ఆటంకాలేమి లేవని నా ఉద్దేశ్యం.
కాని ఇప్పటి పరిస్థితి ఎంతోకంత మారినందుకు చాలా సంతోషించాలి. ఆడవాళ్ళకి వారికంటూ ఒక ఆర్థిక బలం ఉన్నాక పూర్వం జరిగిన అన్యాయం చాలా మటుకు సాగడానికి వీలుపడదు. కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ఆత్మబలం చేకూరుతుంది. ఇంట్లో తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో వాళ్ళ పాత్ర పెరుగుతుంది.
అదలా ఉంచితే, కొన్నిసార్లు, అమ్మాయెవరైనా మనతో వాదనకు దిగితేనో, ఇంకేదైనా విషయంలో మనకి ఎదురొస్తేనో ఆ కోపంలో, ఆ వేడిలో చాలా మామూలుగా ఒక మాట వచ్చేస్తుంది... "అమ్మాయికి దీనికే ఇంత పొగరైతే, మనకెంతుండాల్రా?" అని. దయచేసి తప్పుగా అనుకోకండి. నా నుంచి ఆ మాట ఎప్పుడూ, ఎవ్వరూ వినలేదనే అనుకుంటున్నాను(మా చెల్లి తప్ప, అది కూడా సరదాకి మాత్రమే). కాని మన అదృష్టమో, దురదృష్టమో మన టైం ఎలాంటిదంటే, సరిగ్గా మార్పుకి మద్యలో ఉన్నామనిపిస్తుంది. కాబట్టి, అలవాట్లో పొరపాటు అలాంటి మాటలు వచ్చేస్తాయి. వాటిని పెద్దవి చేసి భూతద్దంలో చూడొద్దని ఆడవారికి నా/మా మనవి. వాటిని సరిచేసే ఓర్పు, సహనం మీలో సహజంగా ఉన్నాయని నా నమ్మకం. ఇది ఎందుకు చెప్పానంటే, ఇటీవల పెరుగుతున్న విడాకులు, తెగుతున్న (సం)బందాలు లాంటి వాటిల్లో ఇలాంటి వాటి పాత్ర చాలానే ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పగలిగానని ఆశిస్తున్నా.

Comments
కచ్చితంగా చెప్పావు. తప్పు
కచ్చితంగా చెప్పావు. తప్పు ఎవరిదైన, ఎ బందములొ్నైనా, తెగె దాకా లాగకూడదని నా ఉద్దెశం.
మన దేశ ఆర్డిక, రాజకీయ పరిస్తితుల వల్ల స్త్రీలు తమ స్థానం గురించి కచ్చితమైన అభిప్రాయమునకు రావడం లెదనుకుంటున్నను. మన ఇళ్ల్లలొ ఇప్పటికి ఆడవాళ్ల బద్రత మరియు నడవడిక విషయం లొ చాల ఆగ్నలు ఉంటున్నయి. ఇది మన సమాజం వల్ల అని నేను వెరె చెప్ప వలసిన అవసరం లేదు. దీన్ని మార్చుటకు మనం అందరం ప్రయత్నించాలి.
ఇక్కడ ఇంకొక చిక్కు వస్తుంది. మన ఆడవళ్లు తమకి మన సహాయం (ఇక్కడ ఆర్దికంగా మత్రం కాదు) కావాలని కొ్రుకుంటూనె తమకు స్చెచ్చ, స్వాతంత్ర్యం కావాలని అడుగుతారు. ఇది మన సమాజ పరిస్తితుల వల్ల అయినప్పటికి ఇలా సహాయం చెయ్యడం వల్ల మనిషి (ఇక్కద లింగ బేదం లేదు) కి కొంచం అహంకారం, గర్వం రావదం సర్వ సాధారణం. తర తరాలుగా ఇది జరుగుతుండడం వల్ల మగ వారికి అహంకారం, స్త్రీల పి అధికారం వచ్చయె తప్ప ఇందులొ వేరె దురుద్దెశం లేదు. మనం చేసె చాలా పనులకు సాక్షాలు ఉండవు. తర తరాలకు మద్య ఈర్పడె communication gap వల్ల ఎన్నొ విషయాలను మనం తెలుకొలేకుండా పొతున్నం.
ఉదాహరణకు స్త్రీలు మాత్రమె పూజ చేస్తారని మనకు తెలుసు. చదువు రాని వాళ్లు వాటిని చదవగలరని నేను అనుకొను. దీన్ని బట్టీ మన పూర్వం సమాజం లొ స్త్రీలు చదువును అబ్యసించారని తెలుస్థొంది. మద్యలొ తరాల మధ్య అంతరం రావడం వల్ల కొన్ని మార్పులు సమాజం లొ ఏర్పడ్డాఈ. ఆ మార్పుల వల్ల అదికంగా స్త్రీలు నష్టపొయారని నేను అనుకుంటున్నాను.
ఇక్కడ స్త్రీలు కూడా తమ పాత్రలు గురించి సరి ఐన అవగాహన ఏర్పరుచుకొవడం ఎంతైన అవసరం. తమకు సమాన హక్కులు కావాలని కూరుకునే ఆడవాళ్లె, తమకు reservation కావాలని అదగడం లొ వారి confused state of mind తెసుస్తొంది. నేను ఇక్కడ వారిని తప్పు బట్టడం లెదు.
నువ్వు అన్నట్టుగ మనం మారుతున్న కాలం లొ బ్రతుకుతున్నాం. కాబటి మన generation లొ కొంత మంది స్త్రీల మీద అధికారం ప్రదర్సించె అవకాశం ఉంది. దీన్ని మన బలుపు గా కంటె ఇంక అలవాటు పడని మన పరిస్తితి ని అర్దం చెసుకొని సహనంగా మసలాలని నువ్వు ఉద్దెసించిన స్త్రీలను నేను కూడా అబ్యర్డిస్తున్నాను. కాని మన తరువాత generation మాత్రం చలం గారు కూరుకున్న లింగ బేదం లేని సమాజం లొ బ్రతుకుతారని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది.
నేను చెప్పలనుకున్నది నీకు అర్దం అయినదనుకుంటున్నా. ఎవరన్న నన్ను తిడుతూ రాస్తే నాకు రక్షన కల్పించగలవు.
చాలా మంచి విషయం మీద ఇంకా మంచిగా రాసావు. నను చలం కంటె స్త్రీ స్వెఛ్చకే ఎక్కువ ప్రాముక్యత ఇచ్చాను ఎందుకంటె చలం గారి కంటె వారి ఆదర్శాలే ముఖ్యం అని నా ఉద్దీశం.
chalam ana gaane chala(vere)
chalam ana gaane chala(vere) expect chesaa raaa.....kaani em chestam:(
kaani manchi derivation teesuko vachav...gud observations
tegevaraku laagakoodadu
tegevaraku laagakoodadu correct e..kani aa adjustment okkallone kadu..iddarilo undali..meeku sahanam ekkuva meere sardukupondi ante enta varaku samanjasam?
enta mandi magavallu tama partners tamakanna ekkuva hoda lo unte manaspurtiga accept chestunnaru?
note:ikkada nenu adjust ayyipotunnaru analedu..accept chestunnaru antunna!
reservation adugutunnadi inka ekkuva mandi aadavallani attract cheyyataniki..manaki kuda vastundi anna nammakam kalagacheyataniki..anduke kada caste prakaram kuda reservations pettaru..vallu takkuva ani kadu..its a sign of encouragement. ade lekapoyunte chala mandi aadavallu chaduvu vaipu mallevalle kadu..konni ellu poyaka adi inka undademo!(undakapote baguntundi)
nenu tittatledu..naa opinion cheptunna anthe..nuvvu evariki rakshana kalpinchakkarledu:)
నేను చెప్తున్న సందర్భం,
నేను చెప్తున్న సందర్భం, మగవాడు నోరు జారిన వేళ లోనిది. అసలు విడాకుల వరకు ఎందుకు, ఇద్దరు స్నేహితుల మద్యే ఇది సమస్యగా తయారైంది. మగవాడు కి సహనం లేదని కాదు, ఉండదని కాదు, అది వాడు కోల్పోయిన వేళ ఆడది, తనకు ఒక సామాజిక హోదా వస్తున్న ఈ తరుణంలో, ఆ ధైర్యంతో్, అక్కడే తెగతెంపులు చేస్కునేంత విపరీత నిర్ణయాలు తీస్కోవటం మంచిది కాదని మా అభిప్రాయం. రోహిత్ చెప్తున్నది కూడా అదే. పుట్టినప్పట్నుంచి అలాంటి సమాజాన్నే చూసి చూసి, మనసులో ఎక్కడో దాని తాలూకూ ఆనవాళ్ళు నాటుకుని ఉంటాయి. అవి అప్పుడప్పుడూ తలెత్తే ఆవేశ పూరిత వాగ్వివాదాల్లో బయటపడతాయి. అది మగవాడి నిస్సహాయత. దాన్ని వాడి బలంగా తీసుకుని, ఆడది తన హోదాతో దాన్ని తిరస్కరిస్తే ఆ నిస్సహాయతకి నీరు పోసినట్టవుతుంది. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మగవాడు ప్రయోగించే ఆయుధమే కోపం. ఇలా ఆ సమస్య చినికి చినికి తుఫానౌతుందే గాని తేలదు. ఇలాంటి తతంగాల్లో ఆ విపరీతాల్ని ఆపడానికి, ఈ తరుణంలో, ఆడవారికి ఎక్కువ అవకాశం ఉందని నా అభిప్రాయం. కాలం గడిచేకొద్దీ సామాజిక మార్పుని మగవాళ్ళు ఖచ్చితంగా అర్థం చేస్కుని తీరాలి. ఆడదాని గెలుపుకి బుసబుసలాడే వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక సమస్యని ఎదుర్కుంటేనే ఉంటారు. మెల్లగా అవే వారికి పాఠాలవుతాయి. అది నేనూ ఒప్పుకుంటాను. కాని అది అంత తేలిగ్గా జరిగే పని మాత్రం కాదు. ఈ పరిణామంలో వచ్చే మానసిక మార్పులు ద్వేషాన్ని పోషించేవిగా ఉండకూడదు.
ఇక రిజర్వేషన్ల సంగతి గురించి నేను మాట్లాడను. :)
రిశర్వేషన్లు ఎప్పుడొ
రిశర్వేషన్లు ఎప్పుడొ ఎంకరేజ్మెంట్ దాటి కేవలం రాజకీయ లబ్ది కా రూపాంతరం చెందాయి. ఇక్కడ స్త్రీల అబివ్రుద్ది కోసం ఏర్పడ్డ సంస్థల ఉనికి కాపాడుకోవడం కోసం వారు ఏర్పాటు చేసుకున్నవె ఈ రిశేర్వెషన్లు.
నేను రోహిత్ రాసిన మొదటి
నేను రోహిత్ రాసిన మొదటి పోస్ట్ తో కొంత వరకు ఏకీభవిస్తున్నాను...
మన భారతీయ మహిళకి తనకున్న ఉన్నత స్థానమేంటో తెలియదు...
వాళ్లు confusion లో ఉన్నారు...
సమస్య మధ్య యుగాల్లో వచ్చింది...జనాల misinterpretation వల్ల వచ్చింది...
మన సమాజంలో ఆడవారికున్న స్థానం ఏంటో తెలుసుకోవాలి...
ఒక గాయత్రీ మాత,ఒక శక్తి,ఒక సరస్వతీ దేవి...
మన పురాణాల్లో చెప్పుకోవటానికి కూడా మహత్తరమైన స్త్రీ పాత్రలెన్నో ఉన్నాయి..
వాటి గురించి మనకేమీ తెలియదు...కాని "అణగతొక్కేశారో" అంటాం....
బ్రిటీష్ వాడు తను భారతదేశం గురించి రాసిన దాన్ని చదువుకుని మనం అదే నిజమని నమ్మిన అసత్యాలు ఎన్నో ఉన్నాయి...అందులో ఇది కూడా ఒకటి...
"ఆడది అబల కాదు సబల"...ఐతే వారి రక్షణ వారే కల్పించుకోవచ్చుగా...మగవారెందుకు??
రిజర్వేషన్ల విషయానికొస్తే రిజర్వేషన్ కి ఒప్పుకుంటే అక్కడ వారు బడుగు బలహీన వర్గం అని ఒప్పుకున్నట్టే..
ఎందుకు రిజర్వేషన్ల విషయంలో బడుగు బలహీన వర్గాల నుంచి పైకి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోరు????...సహాయం కావలసింది సమస్య ఉన్నవాడికి...అంబలి అంగిట్లోకి వెళ్తున్నవాడికి కాదు....
ఈ చలం అనే ఆయన ఉద్దేశ్యాన్ని నేనెప్పుడూ అనుమానించను కానీ పద్ధతిని ఒప్పుకోలేను...
స్త్రీ కి లైంగిక స్వేచ్ఛ అవసరమా??ఆ మాటకొస్తే పురుషుడికైనా అవసరమా??
అలాంటివి ప్రచారం చెయ్యాలా?? మీరు "మైదానం" లాంటి నవల గమనిస్తే మొత్తం బూతు రాసేసి,
"నేను స్త్రీ స్వేచ్ఛని ప్రతిపాదించాను!!" అంటే చాలా?? పెళ్లాం కి ప్యాంటులేసి ఊళ్లో తిప్పితే స్వేచ్ఛ ఇచ్చినట్టా...
"స్వేచ్ఛ" అనే పదానికి మితిమీరిన అర్థాలివి...ఇదే స్వేచ్ఛ అనుకునే ప్రమాదముంది...
విశృంఖలత్వం(బరితెగించినతనం) ఎక్కువైపోదా?? ఎప్పుడో అయిపోయింది...ఇప్పుడేమి చేయగలం...
మన సాంప్రదాయమంటే ఏంటో తెలుసుకుని కదా "ఇది బాలేదు!!!నాకు నచ్చలేదు!!!ఈ సాంప్రదాయం నన్ను నిర్బంధిస్తోంది!!!ఇబ్బంది పెడుతోంది!!" అనుకోవాల్సింది...అసలేమి తెలుసు మనకి....this is a big question mark???? learn about our culture first and then crave for others.
we don't know anything...anything about our culture and its greatness.
since the cultures outside are easy to adapt,lavish,luxurious,pleasing to our senses we are craving for those. But at the end of the day, we'll come to know about the greatness of our culture and then we find that we are too late.
"దూరపు కొండలు నునుపు!!!"
వ్యక్తిగతంగా; చలం శృంగారాన్ని
వ్యక్తిగతంగా; చలం శృంగారాన్ని వస్తువుగా తీసుకున్నాడు కాబట్టే, ఆ నవల ఇంత చర్చనీయాంశంగా మారిందని, ఇంత మందిని ఆలోచింప జేస్తుందని నా అభిప్రాయం. అంతకుమించి ఆయన ప్రతిపాదించిన లైంగిక స్వేచ్చని నేను కూడా అమోదించను. ఆయన ఫ్యాంట్లు వేసి తిప్పినా, ఏం చేసినా, ఆమె ఇష్టాయిష్టాల్ని గౌరవించాడా లేదా అన్నది మాత్రమే ముఖ్యమని, అది మత్రమే మనం గ్రహించాలని నా అభిప్రాయం. ఇక జనాన్ని తీసుకుంటే, "బాబూ! ఆడదాన్ని దేవతలా పూజించిన దేశం మనది, మీరలా తక్కువ చేసి చూడ్డం తప్పు" అంటే వినే పురుష పుంగవులు సనాతన ధర్మం నాలుగు పాదాల మీద నడిచే యుగంలో ఉన్నారేమో గాని, ఇప్పుడైతే నాకు అనుమానమే!
కాబట్టి ఎఫ్ఫుడో అదేదో కాలంలో మన సమాజం ఎలాగో ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటే, (హద్దు మీరితే క్షమించాలి) పగటి కలలు కంటునట్టే!
పాశ్చత్య సంస్కృతి మనదాని కన్నా బాగా? హీనమా? అన్నది కాదు ప్రశ్న. మనమున్న సంఘానికి పట్టిన అసమానత అనే రోగాన్ని వదిలించడానికి మందు కావాలి. ఆ వేటలో భాగమే ఆ రచనలు. ఈ వాద ప్రతివాదనలు.
Well I don't see the whole
Well I don't see the whole point here.. The ultimate goal of the "intelligent" humans is to advance the human race and make the world a better place to live in.. For this to happen in an optimal way, everyone has to contribute. Our ancestors divided the various tasks required for the betterment among various groups of people (castes) and jobs of the family among males and females thinking that they would be good at them. For example: females who generally have a high EQ and better managerial skills would be better at managing the house while males who generally have a higher IQ and are strong are chosen for the betterment of the society. However there is a fundamental flaw in the theory as in : the people who are born in a certain caste/ gender need not necessarily develop a natural liking towards the job assigned to them since ages and may be good at other things. Also the feeling that some jobs are better than others which is absolute rubbish lead to great discrimination in the past. Reservations are a noble idea to encourage people to new fields of jobs and to squeeze the talent from all castes and genders however they are shamelessly exploited for political benefits and its high time we need to find an alternative. So the best way would be to provide opportunities, security and confidence in the highest level in every human irrespective of what but sticking to the basics that everyone and every job is equally important and taking the initiative to do what one is really good at (females in calming down the tensions in family, males in leading the family and note that this is a general case). Thats my opinion. So any takes on it ? :)
well young man(I hope I
well young man(I hope I guessed it right),
That's an idealistic utopia. Everyone would definitely like to live such life. But things aren't so easy and light as one takes. However, you pointed out a good thing about exceptions in people liking their traditional assigned jobs. That's where the whole system gets complex.
Take two societies:
1. Here everyone takes a decision purely based on its approval from his/her community.
2. Here no one minds about the other one. He/she just does something to his/her likes/dislikes.
Neither of them is possible. We MUST live in a compound model of the above two. Hence we must try to attain some balance between two groups, be it caste or sex. Thats what this discussion is about. I hope I'm clear.
నేనూ అందరూ సంతోషంగా
నేనూ అందరూ సంతోషంగా ఉన్నారనట్లేదు...
సంతోషం పొందాలంటే మన ధర్మమేంటో తెలుసుకోవాలంటున్నాను...
మన ధర్మమేంటో తెలుసుకునే ఓపిక లేకుంటే దాన్ని నిరసించకుండా పక్కకి తప్పుకోవాలి...
ఇక్కడ మగ ఆడ తేడా లేదు...
ఎవ్వరికీ సరైన అవగాహన లేదు..
నేను మన సంస్కృతి,ధర్మం గురించి మాట్లాడేటప్పుడు లింగ,వర్ణ భేదాల్లేకుండానే మాట్లాడుతున్నాను...అందరూ సమానమైన అజ్ఞానులమే...మనం ఇప్పుడనుకుంటున్న అభివృద్ధి అప్పటికే అన్ని రకాలుగా ప్రయోగించి అవి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించారు మన పూర్వీకులు..
అందుకని మనం ప్రకృతి నియమాలకనుగుణంగానే జీవించాలని, ప్రకృతి కి విరుద్ధంగా ఏమి చేసినా అది మనకే చేటు అని వారికి బాగా తెలుసు...అదే మన సంప్రదాయం ద్వారా మనకి తెలియజెప్పారు....
నేను మాట్లాడేది వారి గురించే....అందుకే మరీ general statements ఇవ్వకూడదు మన సంస్కృతి,సాంప్రదాయాల పైన...ఎందుకంటే దాని లోతు మనెవ్వరికీ తెలీదు...
ఆడవారిపై ఉన్న అసమానత ఒక్క భారతదేశంలోనే కాదు...అన్ని దేశాల్లోనూ ఉంది...మనం అనుకునే వ్యక్తి స్వేచ్ఛ,స్త్రీ స్వాతంత్ర్యం ఆయా దేశాల్లో మొదలైంది కూడా ఒక 100,200 సంవత్సరాల క్రితమే...
ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే మనం భారతీయ సంస్కృతి లో ఆడవారిని నిర్బంధించేస్తున్నాం వగైరా వగైరా అని చెప్పుకునేవన్నీ అన్ని సంస్కృతుల్లో నిన్నా మొన్నటి వరకు ఉన్నవే...అది మన సమస్య మాత్రమే కాదు...
కాకపోతే మన దేశంలో ఆ అసమానతని వ్యతిరేకించింది బయట వారికంటే కొంచెం వెనుకగా...అంతే...
ఆడవారిపై హింస,వారిని ఆచారాల పేరుతో నిర్బంధించటం...ఈ రెండు సమస్యలు ప్రధానమైనవి....
ఇంకేమన్నా సమస్యలున్నాయా??(ఉంటే చెప్పండి) దీనికి పరిష్కారం మన ఆలోచనల్లోనే ఉంది...వాటిని మనం ఎంత సంస్కరించుకుంటామనే దాని పైన ఉంది...అందుకే మన సంస్కృతిలో నిజంగా ఆడవారికెంత గొప్పతనం ఉందో తెలుసుకుంటే చాలదా??
నాకు అర్థమైంది సరైతే, నేను
నాకు అర్థమైంది సరైతే, నేను చెప్పేదానికి, నాగార్జున చెప్పేదానికి ఒక్కటే తేడా.
మన సమాజంలో స్త్రీ స్థానం ఇదివరకు చాలా ఉన్నతమైందని, దాన్ని మద్య యుగంలో కొందరు తమతమ స్వార్థాల కోసం ఏమార్చారని నాగ్ వాదన. మళ్ళా ఆ మధ్య యుగానికి పూర్వపు పరిస్థితిని తెలుసుకుని తిరిగి నెలకొల్పుదామని చెప్తున్నట్టుగా నాకర్థమౌతుంది.
ఇక నేను చెప్పేదానికి వస్తే, వాళ్ళెలా మార్చిన, స్త్రీకి సంఘంలో తన స్థానానికి మోసం(ఖచ్చితంగా మోసమే!) జరిగింది కాబట్టి, ఇది వరకు ఎలా ఉన్నది అన్న దాని మీద మనం సమయం వెచ్చించకుండా, ఇప్పటి సమాజానికి తగు విధంగా వారి స్థితిని తిరిగి నెలకొల్పాలన్నది నా వాదన.
రెండింటి ఆశయం ఒక్కటే. సరే! అప్పటి పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటిని నేటి సమాజానికి అన్వయిస్తూ ఎవరైనా మంచి ప్రతిపాదన తెస్తే మంచిదే. ఇది వరకు జరిగిన evolution ని మనం సద్వినియాగం చేస్కున్నవాళ్ళమవుతాం. ఇది సాధ్యామేనని ఒప్పించగలిగితే చాలా మంచిది. ఒప్పించలేకపోతే? (వేరే సమస్యకున్న చరిత్ర చూపిస్తూ ఇచ్చే ఉదాహరణలు ఈ సమస్యకు సరిపోవని నా అభిప్రాయం). సరిగ్గా ఇక్కడే నా వాదన మొదలైయ్యేది. మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఎవరో వచ్చి ఆ విశ్లేషణ ఇచ్చేవరకు ఆగే పనిలేదు. అసలు ఆలోచించడం అంటూ మొదలెడితే ఈ అసమానత అన్న విషయం ప్రతి మనిషికి common sense గా అర్థమవుతుంది. ఇలా జనం కూడా ఆలోచించేలా చేయగలిగితే ఆ సమస్య దానంతటదే మాయమవుతుంది. "దీనికి బీజం, కుటుంబంలో స్త్రీకి, ఆమె నిర్ణయాలకిచ్చే విలువ పెరగడం" అన్నదే నా విశ్లేషణ, తద్వార చేసిన వాదన.
ఈ టపా నుంచి ఎదైనా ఉపయోగం ఉండాలనుకునే చదువరులకి నేను విన్నవించుకునేదిదే..
1. స్త్రీ లైతే : మీ సహనాన్ని వదలొద్దు. బందాల్ని దూరం చేస్కోవద్దు. మనస్తాపంలో, కష్టకాలంలో ఒక తోడుండటం(స్నేహితులైనా, భర్తైనా) ఎంతో అవసరం. మగవాళ్ళకి ఇవన్నీ అనవసరమని కాదు! కాని నిలదొక్కుకోవటంలో వాళ్ళు కాస్త ధైర్యంగా ఉంటారన్న విషయం ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయిన ఉన్న సత్యం. ఆ ధైర్యం పురుషాదిక్యత వల్లనే కావచ్చు, లేక ఇంకేదైనా(శాస్త్రపరమైన కారణం) కావచ్చు.
2. మగవారు : ఆడవారిని వారి వృత్తిలో రాణించడానికి తోడ్పడితే అంతకన్నా మీరిచ్చే ధైర్యం వేరొకటి ఉండదు. దీనికి మనలో ఉన్న అహాన్ని కొంచెం తొక్కిపట్టి అణచగలిగాలి.(ఆ అహమే లే్కపోతే ఇంకా మంచిది). ఆమె విజయాల్ని మనస్పూర్తిగా ఒక స్నేహితుడిగానైనా, కుటుంబ సభ్యుడిగానైనా అభినందించగలగాలి, ప్రోత్సహించే పెద్ద(కాదు, మంచి) మనసుండాలి.
ఇక నేను ఈ టపా ద్వారా చెప్పదలుచుకోని కొన్ని విషయాలు : లైంగిక స్వేచ్చ. భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల భిన్నత్వాలు. చలం ప్రతిపాదించిన లైంగిన స్వేచ్చని భూతద్దంగా అర్థం చేస్కుంటే, ఒక వేళ, ఇదే పురుషాధిక్యత ఇలాగే కొనసాగితే ఆయన మైదానంలో లాంటి కథలు దగ్గర్లోనే ఉంటాయనేది మీరు భరించలేని చేదు నిజం.
ఈ విషయంపై నేను నా బ్లాగులో
ఈ విషయంపై నేను నా బ్లాగులో రాసిన ఒక చిన్న టపా చూడండి.
http://parnashaala.blogspot.com/2008/11/vs_07.html
Post new comment