ఆధునిక తెలుగు - కొత్త పదాల ఆవశ్యకత

ఇక్కడ చెప్పినట్టు ఇంగ్లీషు అంతగా వృద్ది చెందడానికి ముఖ్య కారణం కాలంలో వచ్చే వివిధ మార్పులతో పుట్టుకొచ్చే అవసరాలకి ఆ భాషలో తగినన్ని కొత్త పదాలు సృష్టించుకోవడమే. తెలుగులో, నాకు తెలియని కొన్ని కారణాల వల్ల, ఈ పురోగతి కాస్త కుంటుపడిందని మనం అపారంగా అరువు తెచ్చుకునే పదాలు చూస్తే తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితి గమనించిన కొందరు ఔత్సాహికులు తెలుగుపదం.ఆర్గ్ కు జన్మనిచ్చారు. అక్కడ మనం నిత్యం అరువు భాషల్లో మాట్లాడే పదాలను తెలుగీకరించుతారు. అలా అరువు భాషల్లో మాట్లాడ్డం శాస్త్రీయంగా తప్పూగాదు, ఒప్పూగాదు. కానీ, ఏ భాషకైనా ప్రాణం ఆ భాషలోని పదకోశమే. అలాగని పదాలన్ని కూర్చి ఒక మూల పడేస్తే మాత్రం ప్రయోజనమేముంటుంది? మనం నలుగురం మాట్లాడుకునే సమయాల్లో మెల్లగా ఈ పదాలు కూడా వాడుకలోకి వస్తే తెలుగుభాషకి పట్టిన చిలుం వదిలి నవ యౌవ్వనంతో మళ్ళీ సొగలసులద్దుకుంటుంది. కొత్తగా ఏదైనా పదం వాడేటప్పుడు, రోజూ కొన్ని పదాలకలవాటైపోయి, కొత్త పదాల తాకిడే నొప్పిగా తోచే బతుకుల నుంచి, "ఏంట్రా నీ చోద్యం, చాదస్తం? ఇప్పుడు అవన్నీ నేర్చుకుని ఏం పీకాలి?", "అబ్బా, వినడానికెలా ఉందో చూడు? ఎలా మాట్లాడతాం రా??" లాంటి వ్యాఖ్యలు వినబడవచ్చు. అలవాటైతేనే ఎదైనా నచ్చేదీ, మనం మెచ్చేదీ. కాబట్టి నిత్యజీవితంలో వాడుక ఒక్కటే మళ్ళీ మనల్ని మన భాషకి దగ్గరగా చేరుస్తుంది. ప్రపంచ భాషలలో ఉన్నత స్థానం కలిగిన ఒక భాష పునర్నిర్మాణంలో మనదీ ఒక చేయి ఉందన్న సంతృప్తి, సంతోషం చాలవంటారా? మీకు రోజు వాడే పదాల్లో ఏవన్నా తెలుగులో తెలియకపోతే ఇక్కడ అడగొచ్చు.టిడ్‌బిట్స్ లో ఇవ్వాళ్టి నుండి సుమారు రోజుకొక పదం పరిచయం చేయబడతుంది. ఇలాంటి పదాల్ని వీలైనంతవరకు నిత్యజీవితంలో వాడటం ఆరంభించమని అభ్యర్థిస్తూ...

Comments

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options