ఘల్ ఘల్ 'ఘజల్'

అనగా అనగా అనగా... ఒక ఐఐఐటి. అదేంటోగాని నిన్నమొన్నటి దాకా 'made of techy-crap' లా కనిపించిన ఆ ఐఐఐటి... మన ఐఐఐటి.. హైదరాబాద్ లో, గచ్చిబౌలిలో ఉన్న ఇదే ఐఐఐటి.. నాకీ మధ్య రకరకాలుగా కనిపిస్తుంది. ఒక సంగీతారాధనలోనేంటి, ఒక 'స'సమాజ నిర్మాతగానేంటి.. ఒక సదిశానిర్ధేశిగానేంటి.. ఇలా మొత్తానికి నేను చేరుకోవల్సిన చోటికే చేరుకున్నానని, నా జీవితంలో మూడు అతి చిన్న[1]సంవత్సరాలలో తెలిసింది..అనగా నేనిప్పుడే నాలుగో సంవత్సరంలోకి వచ్చానన్నమాట! ఒకసారందరూ SE[2]కి గోవింద కొట్టాలమ్మా.. 'గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద!..' శబ్బాష్!!

సరే! దురద తట్టుకోలేక అదంతా వాగేశాను.ఇంతకీ సంగతేంటంటే, మా కాలేజీకి మొన్న 29వ తేదీన 'ఘజల్' శ్రీనివాస్ గారొచ్చారు. ఆయన రాక సందర్బంగా ఏర్పాట్ల కోసం తలోపనీ చేస్తున్నాం. సామ్రాట్ గాడు ఆయనకి ఫోన్ చేసి ఒక మూడు,నాలుగు సార్లు మాట్లాడాడు. ఒక రెండుసార్లు ఆ ఫోన్ సంభాషణ విన్న నాకు, శ్రీనివాస్ గారి మీద అస్సలు మంచి అభిప్రాయం కుదర్లేదు! 'ఏంట్రా బాబు! ఈ సెలబ్రిటీస్ మొత్తం ఇదే జాతా?' అన్న నా ఈసడింపు కాస్తా ఎక్కువైంది. కానీ 29న, అంటే ఆయన వచ్చిన రోజు.. ఆయనతో ఒకసారి మాట్లాడాకా, ఆయన మాటలు ఒక గంట సేపు విన్నాక.. I was so impressed that I just want to listen him, again, in the nearest possible future! I realised the sarcasm behind every word he spoke on phone. నాకు నవరసాల్లో మూడు రసాలంటే ప్రీతి.. హాస్య, శృంగార, రౌద్ర[3]. ఈ మొదటి రెండింటిని 'తనవైన' ఘజల్స్ తో పండించారు.. పండించటం అంటే అల్లాటప్పాగా కాదండోయ్.. కుమ్మిపారేశారు. అసలు లెక్చర్ మొదలెట్టక ముందు, జనం కాస్త తక్కువగా స్పందించటం చూసి [4] ఒక రెండు పద్యాలొదిలారు..అవి సరిగ్గా గుర్తులేవుగాని, అర్థం ఇలా వస్తుంది.. 'అక్కడ పాపం artist అంత కష్టపడుతుంటే.. ఇక్కడ నువ్విలా మూల గుడ్లగూబలా కుర్చూంటావేమి సామీ?' అని. కొంతమంది పక్కవారు చప్పట్లు కొడుతున్నారని వాళ్ళు కూడా కొడుతుంటే, 'ఎవరి దురద వారే గోక్కోవాలి గాని, పక్కవారి దురద నువ్వు గోకనేల' అని అర్థం వచ్చేలా ఇంకోటి వదిలారు... నవ్వులే నవ్వులు! ఇలా అంతా సరదాగా సాగిపోయింది. ఆయన కొన్ని ఘజల్స్ పాడి వినిపించారు.. నిజంగా అవి విన్నందుకు, కన్నందుకు 'జన్మ ధన్యం' అన్నట్టుగా ఉన్నాయి. అసలు పాడేటప్పుడు అతని హావభావాలు.. అబ్బో అన్న మాట! అసలు ఆయన ఘజల్ లో సగం అందం ఆ హావభావాల తోటే వచ్చింది! ఇంతకీ ఆయన స్వస్థలం.. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నాయ్ కి అక్కడి ఎటకారమంతా అబ్బింది! పుట్టుకతో వచ్చే బుద్దులు పాడెతోనే పోతాయంటారు.. ఎంతైనా గోదావరి జిల్లా వారికున్న 'ఎటకారా'నికి మరెవరు సాటిరారు.

1:ఒట్టండీ బాబు.. నాకింకా ఆ 'interaction scenes' అన్ని మొన్నమొన్నే జరిగినట్టున్నాయ్!
2:SE అంటే ఒక కోర్స్ లెండి... అదే 'మా' చివరి మరియు చెత్త పరీక్ష!
3:మొదటి రెండు రసాలూ ok కాని ఈ మూడో రసమేంటా అనుకుంటుంన్నారా? అదేంటోనండీ.. నా కోపానికి నేనంటే ఇష్టమో, నాకు అదంటే ఇష్టమో.. అది మాత్రం నన్ను వదలట్లేదు!

అదీ సంగతి! మళ్ళీ April 12న కలుసుకుందాం.. అంతావరకు సెలవు, ఉంటామరి!

Comments

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options