జోకులు!
నాకు అప్పుడప్పుడు వెబ్ లోనో, స్నేహితుల దగ్గరో తారసపడే కాస్త బావుండే జోకులన్ని పొందుపరిచాను.. అందులో కొన్ని ఇవి...
ముఖ్య గమనిక : తొక్కలో లాజిక్కులు తీయకుండా, ఎక్కువైంది, తక్కువైంది అని గొణక్కుండా, జోక్ ని జోక్ లా ఆస్వాదించ ప్రార్థన. ఇవి మీకు ముందే తెలిసుంటే 'పోనిలే' అని వదిలేయటం మంచిది. ఇక జోకుల విషయంకెళ్ళిపోదాం..
లింగం మావ - మూత్ర పరీక్ష
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.
డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు
"ఎందుకేడుస్తున్నావు?" పలకరించాడు లింగం మావ.
"డాక్టర్ నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే?"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది"
అంతే....!! ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికి పారిపోయాడు లింగం మావ...
నెహ్రూ గారి మాటలు
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు.
"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.
"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్.
"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు " అంది దీప.
"మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి.
"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా..." దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి.
బలి
"ఏవండోయ్... ఈ రోజు మన పెళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.
ఈ ఆఖరిది సినిమాలో విన్నట్టు గుర్తు. దీని మూలం జంధ్యాల గారి రచనల్లోనిది. అదీ సంగతి. ఇంకా మీకు తెలిసిన జోకులు ఇక్కడ పంచుకుంటే నలుగురికి నవ్వుదానం చేసినవారవుతారు...

Comments
:D బావుంది మామ! అన్నీ ఇక్కడే
:D బావుంది మామ!
అన్నీ ఇక్కడే రాసేస్తే పెద్దదైపోతుందని ఊరుకున్నా..
మల్లాది నవలల్లో చాలా జోకులుంటాయి. 'తేనెటీగ' అనే నవల ఎక్కడన్నా దొరికితే చెప్పండి.
echaalpi గాడికి చివరికి నేను చదివినిపిస్తేగాని నవ్వు రాలేదు వెధవకి!!
mama!!!post length
mama!!!post length penchu....
ekkuva jokelu peTTu....
నాకు ఈ జోక్ ఎందుకు నచ్చిందో తెలీదు..
విపరీతంగా నచ్చేసింది...
ఒకసారి ఒక ఆడా,మగ కొట్టుకుంటున్నారు...
నారదుడు కలహప్రియుడు,కలహభోజనుడు గా ఊరుకోకుండా వాళ్ల దగ్గరకు వచ్చి ఏంటి బాబూ కొట్టుకుంటున్నారు అని అడిగాడట...వాళ్లేమో మాకు ఆడ గొప్పా??మగ గొప్పా? అనే విషయం మీద గొడవ అని చెప్పారట...
అప్పుడు నారదుడు నాకెందుకులే అని ఊరుకోకుండా..మీ గొడవ నేను తీరుస్తా అని పెద్ద ఫోజ్ పెట్టి నేను పైకి వెళ్లి అక్కడి నుంచి ఒక రాయి విసురుతా...అది ఎవరికైనా తగిలినప్పుడు "అమ్మా!!" అని అరిస్తే ఆడవారు గొప్ప..అదే "అబ్బా!!" అని అరిస్తే మగవారు గొప్ప అని తీర్పిచ్చి చిన్న రాయి తీసుకుని బయల్దేరాడు...
పైకెళ్లి రాయి విసిరాడు...
వెంటనే టక్కున సమాధానం వచ్చింది..ఏమని???
"ఎవడ్రా "దొం.నా.కొ" రాయి విసిరింది"...అని
దీన్ని ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఇంకా పెప్పీగా చెప్పుకోవచ్చు....అంటే మాస్ గా అన్నమాట....
goki 1 min , navvutunna vundu
goki 1 min , navvutunna vundu hahahaaaaaa hahahaaaaaa hahahaaaaaa :P . just oorike anna , cool post buddy :) !!. great going ra
bad jokes
bad jokes
Post new comment