జోకులు - 2

కొన్ని జోకులు చదివేకంటే, చెప్తేనే బావుంటాయి.. ఈ కిందవాటిలో 'రావణుడు - April Fool!' జోక్ ఆ కోవలోనిదే.(ఈ జోకులన్నిటికి మూలాలు కూడా చెబుదామనుకున్నగాని ఇవన్నీ చాలా చోట్ల ఉండే జోకులే.. ఏది మొదటి మూలమని చెప్పటమో కుదరక చెప్పటం లేదు.. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మందు

రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏంటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

పాతది

"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.

"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపడి చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.

చూస్తూ

"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో అనూరాధను చూడు. 95% తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...." కొడుకు మీద కేకలేస్తున్నాడు కోదండం.

"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆ అనూరాధను “చూసి చూసే” ఇలా అయింది!" చెప్పాడు కొడుకు.

Operating System - తెలంగాణా భాషలో

ఓక వేళ తెలంగాణా భాషలో Operating system ఉంటే ఎట్లా ఉంటుంది??
Microsoft Windows 2000 = గింతంత మెత్త కిటికీల్ రెండువేల్
Search = దెవులాడు
Save = బచాయించు
Save as = గిట్లా బచాయించు
Save All = గన్ని బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎతుకు
Find Again = మళ్ళా ఎతుకు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చేయ్
Open = తెరువు
Close = ముయ్
New = కొత్తది
Old = పాతది
Replace = మార్చెయ్
Insert = నడిమిట్ల ఎట్టు
Space = జాగ
Backspace = ఎనక జాగ
Run = వురుకు
Print = అచ్చు
Copy = గట్లనే దించు
Cut = కోయ్
Paste = అతికియ్
Paste Special = పెషల్ అతికియ్
Delete = బొందలొ కొట్టు
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గొట్టం
Exit = ఇగ వోరి
Mouse = ఎల్క
Click = ఒత్తు
Double Click = మల్ల మల్ల ఒత్తు
Scrollbar = తిప్పుడు గొట్టం
Errors = నీ నోట్ల మన్ను వడా!!
Home = ఇంటికి వో
End = కొనాక్కి వో

రావణుడు - April fool!

రావణుడు సన్యాసి లా రూపు మార్చి సీతా రాముల కుటీరానికి వచ్చే సీన్ ..
రావణుడు, "భవతీ బిక్షాం దేహి "
సీత, "తీసుకోండి స్వామీ .."
రావణుడు, "గీత దాటి రామ్మా .."
సీత గీత దాటుతుంది ...
రావణుడు "హ .. హా .. నేను సన్యాసిని కాదు .. రావణుడిని ...."
సీత, "హ ... హా .... APRIL FOOL! నేను సీతను కాను పనిమనిషిని ...."

Comments

kummai mama..:ha

kummai mama..:ha

last joke kEka.... migataa

last joke kEka....
migataa jokes already vinnaa gaanii maLlii vinTE haayigaa undi...keep rocking mama!!!Emannaa gurtostE post chEstaalE jokes...

era asala aa jokulu rase

era asala aa jokulu rase mundu chadivavaa laphoot gaa okka aa APRIL FOOL joku tappa migathavanni navvataniki min. 2 days padutundi !!. kabatti f(f)

@"Pudi peru cheppi kottina

@"Pudi peru cheppi kottina vedavaki".. neekokati telsa.. "నవ్వటం ఒక బోగం, నవ్వలేకపోవటం ఒక రోగం నవ్వించగల్గడం ఒక యోగం". waste fellow of india ga.. migatavallaki navvochi neeku raledante.. edo teda vundra mr.bobby...

mama... last joke tappa

mama... last joke tappa migatavi anni super :) kummai..
Looking forward for more posts ..

Hi Mr.Admin , జోక్స్ చాలా

Hi Mr.Admin , జోక్స్ చాలా బాగా వున్నాయ్ రా.

awesome jokes dude... ilage

awesome jokes dude...
ilage continue chestavani asistuna

@all thanks!

@all thanks!

First and last are good.. all

First and last are good.. all other heard many times

anni jokulu

anni jokulu bagunnayi.......naakoo chinna sandheham---jokuluni telugulooo yemantara ani???

thelisthey cheppandi ....theliyakapothey thelusukuni cheppandi.....thelisi thelisinattu unety cheppakandi.... :)

alagey kaastha teluguloo yela

alagey kaastha teluguloo yela typu cheyyalo chebithey..... ika aatharuvatha meekey thelusthundhi

chakra గారు, ధన్యవాదాలు. joke

chakra గారు, ధన్యవాదాలు.
joke ని తెలుగు లో పరిహాసము అంటారు. ఇంకా ఎకసక్కెమని కూడా అనొచ్చు. నమ్మకం లేదా? అయితే ఇక్కడ చూడండి. http://www.aksharamala.com/telugu/e2t/search.php

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options