ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం (Creating Unicode text index in Drupal)

నా సైటులో ఉండే సమాచారం ఈ మధ్య తెలుగులో కూడా ఎక్కువ ఉండటం వల్ల, ద్రుపాల్‌తో పాటే వచ్చే శోధన యంత్రంలో యూనీకోడ్‌ వెతకడానికి సదుపాయం లేకపోవడంతో కాస్త చిక్కుల్లో పడ్డాను. వెతికినప్పుడల్లా, "You must include at least one positive keyword with 3 characters or more." అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది.

దీనికోసం "ద్రుపాల్ లో తెలుగు వెతకడం ఎలా" అని అక్కడ, ఇక్కడ కనబడిన వారందర్నీ అడిగి విసిగించేశాను. కాస్త స్వయంగా రంగంలోకి దిగి కిందా మీదా పడ్డాను, కాని ద్రుపాల్ గురించి తెలుసుకోవల్సినవి బోల్డన్ని తెలుసుకున్నాం కాబట్టి, అదంతా వృధాగా పోలేదు. మొత్తానికి దారి దొరికింది. మీ సైటులో యూనీకోడ్‌ మూలానికి సూచిక నెలకొల్పాలంటే చేయాల్సిందిదీ..

  • modules/search లోకి వెళ్ళి search.module అనే ఫైల్ ని తెరవాలి.

    gopal@tidbits# cd <drupal's root>/modules/search

    gopal@tidbits# vim search.module

  • ఆ తెరిచిన ఫైల్లో PREG_CLASS_SEARCH_EXCLUDE అనేదాని కోసం వెదకండి. అలా వెతికేటప్పుడు ఈ కింద చెప్పిన లైనొకటి కనిపిస్తుంది.

    $text = preg_replace('/['. PREG_CLASS_SEARCH_EXCLUDE .']+/u', ' ', $text);

  • దాన్ని నిర్వీర్యం చేసేస్తే సరి! అనగా disable/comment చేయమని :P అంటే ఆ లైనుని ఈ కిందున్న లైనులా మార్చండి. (ఆ లైనుకి ముందు రెండు '/' పెడితే సరిపోతుంది).

    //$text = preg_replace('/['. PREG_CLASS_SEARCH_EXCLUDE .']+/u', ' ', $text);

  • తర్వాత, మీ సైటులో search configuration కి వెళ్ళాలి. మీ సైటు http://yoursite.com అనుకుంటే, http://yoursite.com/admin/settings/search కి వెళ్ళాలి. అక్కడ Re Index Site ని నొక్కి, కింద Simple CJK handling అనుంటుంది. దాని వల్ల ఇండియా వాళ్ళకి ఆవగింజంత ఉపయోగం కూడా లేదు, టిక్ తీసేయ్యొచ్చు. ఈ రెండు పనులూ అయ్యాక Save Configuration అని నొక్కేయండి.
  • ఇప్పుడు, http://yoursite.com/admin/reports/status/run-cron కి ఒక్కసారి వెళితే, Cron ప్రోగ్రాం నడుస్తుంది. మీ సైటులో ఉన్న యూనీకోడ్‌(అంటే, తెలుగు, హిందీ, తమిళం లాంటి భాషల్లో ఉన్న మూలం) మొత్తానికి సూచిక తయారయినట్టే. ఒకసారి పరీక్షించి చూస్కోండి.

Comments

మీరు చాలా ప్రయాసపడి దీనిని

మీరు చాలా ప్రయాసపడి దీనిని సాధించారు . ఒక vBullettin ఫోరంలోనూ తెలుగు లో సెర్చి అనుకూలతని చూసి invision board లో ఈ సౌకర్యం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను . ఇంకా సాధ్యపడట్లేదు :-(

ఇక్కడ foolowup comments

ఇక్కడ foolowup comments సదుపాయం ఉన్నట్లు లేదు ...

ఓహ్! permissions సరిగ్గా

ఓహ్! permissions సరిగ్గా పెట్టడం మర్చిపోయాను.. సరిచేస్తాను :)

ఇతర నిపుణులెవరైనా తగు

ఇతర నిపుణులెవరైనా తగు పరిష్కారం సూచించగలరనే ఆశతో ఉన్నాను
...

నేను ఇదివరకు దాన్నెప్పుడూ

నేను ఇదివరకు దాన్నెప్పుడూ వాడలేదండి మరి.. తొందర లేదు అంటే, నాకు సమయం కుదిరినప్పుడు ప్రయత్నించి చెప్పగలను.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options