పిలుపులు

కొంతమంది.. వాళ్ళకి సంబందించిన వాళ్ళని పిలిచే తీరు చమత్కారంగా ఉండి నవ్వు తెప్పిస్తుంది. ఉదాహరణకి..   మా పక్కింటావిడ మా అమ్మని పేరు పెట్టి 'అనంత' అని పిలుస్తుంది, అదే అలవాటుగా  అవిడ  3-4 ఏళ్ళ మనుమలు కూడా అలాగే పిలవటం నేర్చుకున్నారు.  మొన్న ఇంటికెళ్ళినప్పుడు నోరెల్లబెట్టి చూస్తున్న.. ఆ పిల్లలలా పిలుస్తుంటే! ఇలాగే... మా చిన్నమ్మమ్మ వాళ్ళంతా వాళ్ళమ్మాయిని(మా పెద్దమ్మని) చిన్నప్పట్నుంచి  'పాపా' అనటం అలవాటు.  ఆ పెద్దమ్మ పిల్లలిద్దరూ (అన్నయ్య, అక్క) ఇప్పటికీ , బందువులందరూ అలానే పిలవటం వల్లనేమో,  వాళ్ళమ్మని పాపా అనే పిలుస్తారు. మా ఊర్లో ఒకడు, చిన్నప్పుడు, బావలిద్దరూ  వాళ్ళ నాన్నని డాడీ అని పిలవటం చూసి, వాడు కూడా, మావయ్య అనటం అటుంచి, డాడీ అనటం మొదలెట్టాడు. తర్వాత పెద్దవాళ్ళు చెప్పాక, పాత పిలుపు వదులుకోలేక.. 'డాడీమావయ్య' అని అందుకున్నాడు. :D

బార్యాభర్తల విషయంలో ఐతే ఇది ఇంకో రకంగా కనిపిస్తుంది.  చాలా మంది ఆడవాళ్ళు 'ఏవండీ' అనే పిలిచేస్తారు... వాళ్ళకి పర్లేదు. పాపం ఎటొచ్చి మగమహారాజులకే చిక్కంతా! సరిగ్గా గమనిస్తే ఇప్పటికీ పెళ్ళాన్ని పేరెట్టి పిలిచేవాళ్ళు తక్కువే. 'ఇదిగో', 'ఒకసారి ఇటొస్తావా..', 'వింటున్నావా..' లాంటి వాటితోనో.. ఇంకొంచెం పాతతరమైతే 'ఏమేవ్', 'ఒసేయ్' లాంటి సంభోదనలతోనో నెట్టుకొచ్చేస్తుంటారు. పెళ్ళిలో అమ్మాయి పేరడిగినప్పుడు  టక్కున చెప్పే పురుషపుంగవులు కూడా ఇదే తంతు! పట్ణాల్లో నాకు పెద్ద తెలీదు గాని, పల్లెల్లో నూటికి తొంబై శాతం ఇదే రకం జాతి.  మన తరానికి ఇలాంటి సమస్యలేమి రావనే నా ధీమా.. లవ్వైతే  సరే.. కాకపోయినా పర్లేదు, పెళ్ళిచూపులకీ, పెళ్ళికీ వున్న సందు చాలు.. చెలెరేగిపోవడానికి..  :P

కాని ఈ మధ్య పిలుపుల్లో వస్తున్న అనేక మార్పుల్లో నాకు నచ్చనిదేంటంటే.. చిన్నపిల్లలకి మన పద్దతిలో అత్తయ్య, మావయ్య, పిన్ని, చిన్నాన్న అని కాకుండా, ఎదో అపరిచితుల్ని పిలిచినట్టు ఆంటీ, అంకుల్ అని పిలవడం నేర్పిస్తున్నారు.. నేటి 'మమ్మీ, డాడీ'. చిన్నప్పట్నుంచి  'వావి-వరుస' ఎంటో తెలియాలంటే.. సరైన పిలుపు  అవసరం. ఇది దృష్టిలో పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం.

Comments

@nag and rasagna, thanks..

@nag and rasagna, thanks..

baavundi mama...inkaa

baavundi mama...inkaa elaborate gaa raayaalsindi..
i mean relations gurinchi...pilupula gurinchi...

I fully support your opinion

I fully support your opinion ra. There is no match between describing relations in Telugu and English .. I hope all the telugu ppl realise this and understand the greatness of this language .. btw nice post ra ..

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options