ముసుగు!
నాకు తెలియక అడుగుతున్నా.. లౌక్యం అంటే? "గోడ మీద పిల్లి లా ఉండడం", "ఏం పట్టనట్టు తప్పించుకుపోవటం.".. ఇలాంటివి కాదు కదా? నాకు తెలిసిన వరకు లౌక్యం.. "సందర్భానుచితంగా, సమయస్పూర్తి తో మసులుకోవటం". ఇక్కడ సందర్భం అన్నది ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకి.. మహామంత్రి తిమ్మరుసు గారు ఆలోచించిన తీరు చాలా లౌక్యంగా ఉంటుంది.(తిమ్మరుసు గారెవరో తెలియకపోతే క్రిష్ణదేవరాయలవారు తెలిసినా దండగే.. :P ) కాని నా కళ్ళకి చాలా వింతలు కనిపించాయి(స్తున్నాయి). ఈ లౌక్యం అన్న పదాన్ని అడ్డుపెట్టుకుని భలే బ్రతికేస్తుంటారు కొంతమంది. రెండు నాలుకల వెధవలందరూ(క్షమించాలి) లోకం తెలిసినవారవ్వరు.. అలాగే నాలుక లేని వాళ్ళు కూడా కారు. మాట్లాడని వాడు బుద్దుడూ కాడు, నమ్మించేలా మాట్లాడే ప్రతీవాడు నాయకుడూ కాడు. సరే.. 'అవ్వరు, కాడు' అంటున్నావ్.. నువ్వు చెప్పరాదు వాళ్ళెలా ఉండాలో అంటే.. నా దగ్గర నా సమాధానం ఉంది(అందరికి వర్తించకపోవచ్చు), తక్కువ వాగినా.. వాగి చేసిన వాగ్దానాలన్నిటికి విలువిచ్చి నెరవేర్చేవాడు నాయకుడు... ఇందులో కూడా లొసుగులున్నాయ్. నాయకుడనేవాడు ఎన్నుకున్నవారికే కాదు, అందరికీ నాయకుడే.. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో సంగతి. కాబట్టి 'నేను తక్కువ వాగుతాను' అని ముడుచుకుని కూర్చుంటే కుదరదు.. ఎందువల్ల అంటే.. దొబ్బేవాళ్ళ గోల ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది కాబట్టి... మళ్ళీ అదే కారణం, ప్రజాస్వామ్యం! దీనికి కాల గర్భాన మనం కనుగొన్న కవచం.. ముసుగు. ఆ ముసుగు ఇది వరకు 'పైకి ఒకలా ఉంటూ, మనం లోలోపల మదన పడుతూ' అన్నట్టు ఉండేది. కాలక్రమేణ.. 'పైకి ఒకలా ఉంటూ, అవతలి వారిని లోలోపల మదన పెడుతూ' అన్నట్టు తయారైంది. ఇప్పటి మన నాయకులంతా(దాదాపుగా..) ఇదే(రెండో) కోవలో ఉన్నారు. ఒక్క మగాడు సినిమాలో నాకు నచ్చింది ఒకేఒక్కటి.. సరిగ్గా గుర్తులేదుకాని , ఇలా ఉంటుంది.. "పెదవి దాటని మాటకి నువ్వు యజమానివి.. పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి"... సత్యం! దీన్ని అనునయిస్తున్నట్టే మనల్ని మనం మభ్యపెట్టుకోవటానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం.. సంబంధం లేకుండా ఏదో చెత్త నెత్తికెత్తుకుని, ఎదో ఒకటి మోసి చస్తున్నాం కదా అని అవతలివారికి చూపించుకోవటానికన్నట్టు!
ఇప్పుడు నేను రాసిన దానికి 'అద్యాంతాలు' కనపడకపోవచ్చు.. కాని నా మనస్సులో ఉన్న మాటలివి.. ఇప్పటి నా తరంతో పంచుకోవాలనిపించి రాస్తున్నాను.. రాజకీయాలు కుళ్ళు కాదు, ఇప్పటి నేతలు(కొంతమంది) దాన్ని రొచ్చు చేశారు.. ప్రక్షాళన కోసం ఇంకో హిట్లర్ పుట్టనక్కర్లేదు.. అది మన చేతిలోనే ఉంది..
Listening to.. Jalsa!
Quote of the day:
"Once all village people decided to pray for rain. On the day of prayer all people gathered and only one boy came with an umbrella.... .. that's Confidence. Trust should be like the feeling of a one year old baby, when you throw him in the air, he laughs.....because he knows you will catch him.... that's Trust. Every night we go to bed, we have no assurance to get up alive in the next morning but still we have plans for the coming day....that' s Hope. Keep Confidence! Trust Others! Never Lose Hope!!"

Comments
orayee nee yabba em telugu
orayee nee yabba em telugu raa chachipotunna chadavadaaniki .. kastapdithe ganta ki oka sentence chaduvutunna hmmm I too will join the forum :D !! .. koncham chadivaa its going good. keep blogging.
@gopal, thanks man. please
@gopal,
thanks man. please let me know when u start. i will be here all summer. please inform me at harshsatya@gmail.com
@Harsh.. dude.. I'm starting
@Harsh..
dude.. I'm starting a telugu tutorial site cum forum for people who would like to learn telugu, during this summer. If possible, I'll also arrange short(30 min) interactive sessions during evenings... you are very welcome! The material is almost ready :P
ofcourse, all this is with support from Nag and Ambati,
didnt understand a word
didnt understand a word there. im looking for someone who can teach me telugu. kindly help
@ Nag.. ఎంత మాట మామ..నీలాంటి
@ Nag..
ఎంత మాట మామ..నీలాంటి వాళ్ళు స్పందిస్తేనే ఇక్కడ వాదోపవాదాలకి తావు,తెన్ను.
నాక్కూడా రాజకీయాలంటే ఆసక్తి లేకపోలేదు.. కాని ప్రస్తుతానికి నాది అర్జున పాత్ర, కృష్ణయ్య కావాలి. ఆ కృష్ణున్ని నేనే తయారు చేసుకోవాలని (లేదా వెతుక్కోవాలని) ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చెస్తుంటా.. నేనన్నది అర్థమైతే.. ఇక్కడ నేను 'కృష్ణుడ'న్నది ఇలా ఆలోచనతో స్పందించి ఆలోచింపజేసేవాళ్ళనే..
Inter లో అందరం విడిపోయేటప్పుడు 'ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సంఘానికి ఉపయోగపడాలి' అన్న నిశ్చయంతో(ఆవేశంతో కూడా..) farewell చెప్పుకున్నాం.. ఎంత మందికి గుర్తుందో తెలీదు.. కాని, 'నా వంతు ప్రయత్నం మాత్రం చేస్తున్నా'నని చెప్పగలను..
నేనన్నది అదే మామా!!! "ఎవరో
నేనన్నది అదే మామా!!!
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా!!" అని జనావళికి చెప్తున్నా...ఆ అవకాశం నీ blog ద్వారా దొరకటం బావుంది....
దీనికి ఇంకా ఎవరైనా మంచి replies తో వస్తారని ఆశిస్తున్నాను.....
@ Gopal: Thank u sir!
@ Gopal: Thank u sir!
నీ blog ని నేను ఇంత fast గా
నీ blog ని నేను ఇంత fast గా follow అవుతున్నందుకు నీకెలా ఉన్నా నాకు మాత్రం బావుంది...ఎందుకంటే ప్రపంచం లో ఇంతకన్నా ఆనందం ఏముంటుంది...అదే ఎదుటివాళ్లు మంచి మంచి విషయాలు చెప్తుంటే వింటూ ఉండటం కన్నా.....
నువ్వు చెప్పినట్టే "ఆద్యంతాలు" కనపడకపోయినా అర్థమైతే ఉంది,అయ్యింది కూడా....."ఓక్క మగాడు" లో ఇంత మంచి dialogue ఉందని నేను చూసిన ఏ ఒక్క review లోను రాయలేదు...చాలా బావుంది...అది saying(సామెత) అనుకుంట...
"ప్రక్షాళన నిమిత్తం ఒక నాయకుడు వస్తాడు మన మధ్య నుంచే...దాని అర్థం ఎదురుచూడమని కాదు...నువ్వే ఆ నాయకుడు ఎందుకు కాకూడదు...ఏమో ఎవరికి తెలుసు...ఈ దేశానికి దిశానిర్దేశం చెయ్యగల భావిభారత 'అప్రజాస్వామ్య(నాకు ప్రజాస్వామ్యం మీద అంత నమ్మకం లేదు) నాయకుడివి నువ్వే కావచ్చు..
ముందుకెళ్దాం...మనతో పాటు మన దేశాన్ని కూడా ముందుకి తీసుకెళ్దాం" అని నేననుకుంటున్నాను....రెండు నాల్కల ధోరణి కొత్తగా వచ్చింది కాదు...మన పురాణాల నుంచి ఉన్నదే అయినప్పటికీ అలాంటి వాళ్లని తొక్కిపట్టేవాళ్లు ఎప్పటికీ "తిమ్మరుసు" లాంటి లౌక్యం తెలిసిన మహానుభావులు...ఇప్పుడు లౌక్యం ఉన్నవాళ్లు "నాకెందుకులే?"అనుకోబట్టి ఈ రెండునాల్కల విషసర్పాలు మన దేశాన్ని వాటి కోరల్లో బిగిస్తున్నాయి...హాలాహలాన్ని చిమ్ముతున్నాయి....మరి ఈ పాలసముద్రం లాంటి దేశాన్ని చిలికి జనావళికి ఆ సుధను పంచే "జగన్మోహిని" అవతారరూపుడైన శ్రీ మహావిష్ణువు ఎప్పుడొస్తాడో....-----మీ నాగార్జున
Post new comment