లోక్ సత్తాకి ఓటేసి రాష్టాన్ని గెలిపించండి!

ఎక్కడబడితే అక్కడ అడ్డంగా దోచుకుతినే ప్రభుత్వాలు వెలుస్తున్న ఈ రోజుల్లో తన నిజాయితీతో, సేవలతో మంచి IAS ఆఫీసర్ గా ప్రజల మన్ననలందుకున్న జేపీ(జయ ప్రకాశ్) గారు ప్రజల నాయకుడిగా ముందుకు రావడం రాష్ట్ర ప్రజల అదృష్టం.

ఒకడు కలర్‌ టీ.వీలంటాడు, ఇంకోడు బియ్యం, కరెంటూ ఫ్రీ, ఫ్రీ అంటాడు, మరొకడు నా రాష్ట్రం నాక్కావాలి ఇచ్చేయ్ మంటాడు, ఇహ చివరిగా వచ్చినోడు మీ గీత మీరే గీస్కోండంటాడు! అంతేగాని.. ఒక్కడు, ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడు "అరరే, మన రాష్ట్రం (మనవల్లే) ఇలా దరిద్రంలో నాని ముద్దవుతుందే, దీనికి ఇప్పుడన్నా ఏమన్నా చేసెడుద్దామా?" అన్న ఆలోచన చేయాడే? రాష్ట్ర ప్రజలకి ఇదే నా మనవి - పదే పదే అదే వలలో పడి మూతి పళ్ళు రాల్చుకున్నది చాలు. ఒక్కసారి తెరిపారా ఆయా పార్టీల ఎజెండాలకేసి ఎగాదిగా చూడండి. వాళ్ళేమేం చెప్తున్నారో, వాటి వెనుక వున్న భావాలేంటో తూకం వేసి చూసుకోండి. గుడ్డిగా ఓటు వేసి ఆ ఓటు హక్కుకున్న పవర్ ని కించపరచకండి! లోక్ సత్తా ఇచ్చిన వాగ్ధానాలను(మేనిఫెస్టో దింపుకోండి) ఒక్కసారి గమనించండి. మన తరానికి, మన ముందు తరాలకీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన ప్రణాళిక అది. అందులో ఉన్న అన్ని అంశాలు, అన్నీ... చేయగలిగినవే, లోక్ సత్తా అధికారంలోకి వస్తే తప్పకుండా జరిగేవే.

ఇంకో సంగతి, "ఆయా పార్టీలకి *అంగ* బలం అంతలా ఉంది కాబట్టే వాళ్ళాలా నెట్టుకొస్తున్నారు. జేపీగారికి అలాంటి అంగ బలం ఏదీ? ఆయన వారిలా అజమాయిషీ చేయలేడు బాబాయ్!" అని నోరు బార్లా తెరిచి బావురుమనేవారికి ఇదే నా సమాధానం - మీ దృష్టిలో రాష్టం అలా *అంగ* బలం ఉన్నవారి చేతుల్లో సురక్షితంగా ఉంటుందనా?? రాజుకి కావాల్సింది మేధా సంపత్తి, రాజనీతి! అంతేకానీ అరాచకత్వం, కుటిలనీతి కాదు! అలా అణచివేతలతో ఏలిన వాడి హయాంలో ప్రజలు బాగుపడినట్టు, సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు! ఒక IAS ఆఫీసర్ గా ఆయనకి ఇప్పుడున్నవారికంటే తెలవాల్సినవి మెండుగానే తెలుసు. ఒక్క ఉదాహరణ చెబుతా.. ఇదివరకు రాజుల పరిపాలనలో రెండు దళాలుండేవి, బటులు, బందిపోటులు. కొందరు రాజులు, అతితెలివితో బందిపోటుల్ని కూడా అక్కున చేర్చుకుని ఆదరించి, వారి "సహయాంతో" ప్రజల్ని చీల్చి, చెండాడి - పరిపాలించారు. ఇప్పటి ప్రభుత్వాల్లో కూడా రెండు దళాలున్నాయ్. ఒకటి పోలీసులు, రెండు గూండా ముఠాలు. ఇప్పటి *మరీ అతితెలివి* నాయకులు ఆ గూండా ముఠాల సహాయంతో, మరింత బరోసాగా ఉంటుందనో ఏమో, పోలీసుల సాయం కూడా తీసుకుని రాష్టాన్ని తెగ ఏలేస్తున్నారు.

ఇహ మీ ఇష్టం బాబులు - దొంగలరాజునే కోరుకుంటారో, ధర్మరాజునే ఎన్నుకుంటారో!

మరో ముఖ్యమైన విషయం - "ఉన్నవాళ్ళలో జేపీయే బెటర్" అని మాత్రం ఎక్కడా అనకండేం, అలా పోల్చడానిక్కూడా అవతలి వారికి ఒక అర్హత ఉండాలి. నా భావనలో లోక్ సత్తా తో పోల్చబడడానికి ఆ అర్హత ఉన్న పార్టీ ఏదీ లేదనే. ఇంకో మాట - మన బాబు గారు, రాజా గారు మంచి వారు కాదని నేనెప్పుడూ అనను, అనుకోను. ఇద్దరూ రాజనీతి పారంగతులే, సకల కళా కోవిదులే! రాజొక్కడే మంచివాడై ఆయన దళం గందరగోళమైతే ఆ రాజు మాత్రం ఏం చేయగలడు పాపం? కానీ జేపీ గారు తన బృందాన్ని చాలా జాగ్రత్తతో నిర్మించుకున్నారు, అందరూ సమిష్టిగా రాష్ట్ర ప్రగతిని కోరుకునే విధంగా. మిగతావాళ్ళు అలా చేయలేకపోయారు. అలా చేయలేకపోవడం మాత్రం వాళ్ళ అసమర్థతే, అలా కాని పక్షంలో ఆ అసమర్థత రాష్ట్ర ప్రజలది - ఇవన్నీ తెలిసీ(తెలియక) అలాంటి వారిని నాయకులుగా ఎన్నుకున్నందుకు.

Comments

Why not Chiru ? PRP is better

Why not Chiru ? PRP is better than TDP and INC and it is in a better position to grab the power.

Its a war between have and havents and Chiru is new leader. [ I don't want power share between old/cbn thief and current/ysr thief..I want another thief]I would expect a new list of power brokers among more people. This is what creates more competitive democracy. I relate this to the political process going on in UP/Bihar.

LS is not a position to make a splash this time..so I do not want to vote for[ waste my vote] by going for LS.

ఏది అడిగినా

ఏది అడిగినా ఆయన(చిరంజీవి/పార్టీ ప్రధాన కార్యదర్శి).. "మేము మార్పు తెస్తాం! తెస్తాం!!" అనే గాని, ఇంకో మాట లేదు. ఈ మార్పేంటో, అది ప్రజల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, స్పష్టంగా, వివరంగా ఒక్క సభలోనన్నా చెప్పారా? పోనీ రాజకీయ పరిణామాలు చక్కదిద్దే మార్పు అనుకుందామంటే, అది చస్తే కాదని వారి అభ్యర్థి ఎంపిక విధానం తేటతెల్లం చేసింది(పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది).

ఇక ప్రజల జీవితాల గురించి, వారికి అందిచాల్సిన వివిధ సదుపాయ, మనరుల గురించి, సమాజానికి కావాల్సిన రాజకీయ మార్పుల గురించి (ఇప్పటికే ఎంతో చేసి, ఔరా అనిపించిన)జేపీకి తెలుసో, చిరూకి తెలుసో మీరే ఆలోచించండి. మీకు జేపీ గురించి తెలియకపోతే, లోక్‌సత్తా ఉధ్యమం గురించి పూర్తి అవగాహన లేకపోతే ఒక్కసారి http://loksatta.org/cms కి వెళ్ళి కాసేపు అటుఇటు తిరగండి.

Gopal, I do not underestimate

Gopal, I do not underestimate JP..at the same time I am confident about CHIRU. May be the next time JP will pick it from Chiru. Chiru has the caliber to deliver it and he will do it and he already showed it by giving tickets to what he promised.

I feel that practically chiru can do it this time ; I feel CHIRU has the personality and energy to do it[CHANGE]. If chiru comes to power it’s a change and I do not anticipate more than that and the rest follows…may be JP will be the next CM.

చిరంజీవి గారు పార్టీ పెట్టిన

చిరంజీవి గారు పార్టీ పెట్టిన మొదట్లో నేనూ ఇలానే అనుకునేవాడిని. కానీ, తర్వాత ఆ పార్టీ ఒక నిర్థిష్ట ప్రణాళికంటూ ఆశించిన విధంగా ప్రజల్లోకి తీసుకురాలేకపోయింది. అంతేకాదు, మరొక పార్టీపై, పార్టీ నాయకులపై (అసంబద్ద) విమర్శలు చేయడం వారి నైజం కాదంటూనే ఎన్నో సార్లు విసురుగా అదే తోవలో వెళ్ళారు. కుళ్ళు రాజకీయాలకూ, గూండా ప్రతినిధులకు స్వస్తి అన్నారే కాని, వాస్తవాలు వాటికి భిన్నంగా ఉన్న విషయం విదితమే.

ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని, చిరూకి ఓటు ఏం ఆశించి వేయమంటారు? నమ్మి ఎలా ఎన్నుకోమంటారు?

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options