Indian Rock!
Carnatic Fusion
నిన్న రవీంద్ర భారతిలో రాజేష్ వైద్య గారి వీణ కచేరీ అని మన పురుష్ చేప్తే వాడితో బయల్దేరా. పురుష్ అతని గురించి కొంచెం చెప్పాడు, మాం..చి స్పీడులో వాయిస్తాడు మామ, వీణ, అని. ఒక video కూడా చూపించాడు. ఆ బావుందిలే అనుకున్నా, నిజంగానే బావుందనుకోండి, కాకపోతే ఎందుకో.. ఎందుకో ఏమిట్లే నా బొంద, ఆ బొచ్చు విరబోసుకుని, వాయించేటప్పుడు తెగ ఊగిపోతుంటే నాకు కాస్త చిర్రెత్తుకొచ్చింది. ఏదో శిలా విగ్రహంలా కూర్చోమని కాదుగాని, ఎందుకో కాస్త అతిలా అనిపించింది ఆ ఊపు! సరే ఆ చిరాకు కాసేపు దిగమింగుకుని వెళ్ళాను కచేరీకీ. నా జన్మలో మొదటిసారి రవీంద్రభారతిలో అదే అడుగు పెట్టడం. చాలా వరకు తెల్ల తలకాయలే కనిపించాయి ఆడిటోరియం నిండా.నా గుండె నీరుగారిపోయిందనుకోండి! కుర్రనాయాళ్ళొస్తారనుకుంటే ఒక్కడ్లేడక్కడ. వెళ్ళి కూర్చున్నాం. ఈ కార్యక్రమాన్ని South Indian Cultural Association వారు, వారి 50 సంవత్సరాల పండక్కి నిర్వహిస్తున్నారని, ఆ కార్యక్రమం ఇంకో రెండంటే రెండే నిమిషాల్లో మొదలవుతుందని మా చెవులు మోతెక్కేలాగా ఆ సెక్కెట్రీ పదే పదే మొరపెట్టుకుంటుంటే వినలేక వినలేక, గతిలేక వింటూ కూర్చున్నాం. చివరకు మొదలైంది..కార్యక్రమం. ఆ..హా..! ఎడారిలో దాహంతో పిడచగట్టుకుపోయిన గొంతుని కాస్త చల్లటి తేనీటితో తడిపినట్టుంది ఆ వీణావాద్యం. ఒక్కముక్కలో చెప్పమంటే,. పిచ్చెక్కిచ్చేశాడు! భారతీయ సంగీత వాయిద్యాలతో rock చేయొచ్చని నిలువెత్తు సాక్ష్యం చూపించాడు. ఇంతకీ మన చంద్రముఖిలో 'రారా' పాటకి వీణ మనోడేనంట! నాకు అతను వాయిస్తున్నప్పుడు అతని చేతి వేళ్ళు కనబడేవి కాదు, blurred గా ఉండేవి. అంత దారుణమైన స్పీడు నేనిదివరకెప్పుడూ చూడలేదు, విన్నట్టు కూడా గుర్తులేదు. anyways, hats off to him. వాయించిన వాటిలో నాకు గుర్తున్నవి, 'తందనాన అహి', 'వాతాపి', 'అలై పాయుదె','కళ్యాణం చూతము రారండి(ఇది కీర్తనే, 'సౌభాగ్యలక్ష్మి రావమ్మా' అని)', ఒక బాలమురళీ క్రిష్ణ గారి కీర్తన, తన గురువుగారు రాసిన 'wedding bells'. అన్నీ అదరగోట్టాడు. హా.. ఇక్కడికి కూడా ఆ బొచ్చుతోనే వచ్చాడు గాని, ఈసారి మరీ అంత అతి లేదులే. ఈసారి ఎక్కడైనా నాట్య ప్రదర్శనలుంటే వెళ్దామని గట్టిగా నిర్ణయించేసుకున్నా. ఎక్కడైనా జరుగుతున్న సమాచారం ఉంటే చెప్పండి. ఇలాంటి వాటికి రావాలనుకునే వాళ్ళు చెప్తే కలిసివెళ్ళొచ్చు. (అతను మరీ వయసైపోయినవాడిలా అనిపించలేదు, అందుకే ఆ ఏకవచన సంబోదన, దయచేసి తప్పుగా అనుకోరాదు)
OBH ground floor విశేషాలు:
- రోజూ.. పిల్ల సుధీర్ గాడు pregnant lady లాగా అలా corridor లో పచార్లు చేయడం, దాన్ని మన పొట్టోడు సమర్దించడం, ఎంత వరకు న్యాయమో wing సభ్యులే నిర్ణయించాలి.
- పుడిగాడు laurrels(స్పెల్లింగు ok నా పుడి?) కి వెళ్ళి వాడి ఉండీ లేని బొచ్చుకి funky hair style పెట్టమంటే, వాడు కుదరదు సార్ అని చెప్పి, ఎదో వాడికి తోచినట్టు గీకి పంపించాడు.
- క్రాంతి గారు ఈ మధ్య జనాల్ని దొబ్బడం మానేశారు, అదేలే, కాస్త తక్కువుగా దొబ్బుతున్నారు. కారణం SRP కాదని ఆశిద్దాం :P
- క్యాట్ గాళ్ళు bizzy గా ఉన్నారు, కెలికినా కెలికిచ్చుకోవటం లేదు. All the best guys!!

Comments
@rohit, తెలిసిందేననుకో, ఐనా
@rohit, తెలిసిందేననుకో, ఐనా ఎన్నేళ్ళని భరిస్తాం రా బాబు ఈ గోల? :P
@vJay ఒరేయ్, రోజు ఎవడు తెస్తే పీపాలు, పీపాలు నీళ్ళు ఆ...పలంగా గుటుక్కుమనిపిస్తున్నావ్రా? మళ్ళీ నాకు సెట్టైర్లు!
@Nag cold coffee అనుకో మామ :P (నా ఉద్దేశ్యం అది కాదనుకో). చూస్తుంటే, IIIT నుంచి రవీంద్రభారతికి మంచి tender పోయేలా ఉంది :)
"చల్లని తేనీరు" అనటం correct
"చల్లని తేనీరు" అనటం correct కాదనుకుంట...ఎందుకంటే తేనీరు అంటే tea అని అర్థం....మిగతా అంతా బావుంది...ఇది అన్యాయం మామా...నేను కళా పోషకుడిని(అదే కళారాధకుడిని) అని తెలిసి కూడా నన్ను పిలవలఏదు చూశావా...ఎప్పుడైనా అవకాశం ఉంటే రాకుండా ఉన్నానా?? :(
ఇంకో మాట...బొచ్చు అని సంబోధించటం బాలేదు...anyways నీ భావన నాకర్థమయ్యిందనుకో......ground floor updates as usual rocking
కాసేపు వీణ గురించి మాట్లాడుకుంటే
నేను మా అమ్మతో ఒక సారి వాదించాను..మన Indian musical instruments ఏవీ అంత ఫస్త్ గా ఉండవు..ఆ beat ఉండదు etc etc అని...అప్పుడూ మా అమ్మ నాకు left and right ఇచ్చింది....ఉదా:వీణ అని చెప్పింది...
అంతే అప్పుడు start అయింది వీణ మీద నా ప్రేమ...నేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాన్ను...వాసు గారు మన first year లొ ఉన్నప్పుడు violin school పిల్లలు,పెద్దల్ని పిలిపించినప్పుడు ఆ school head గారిని అడిగాను...మాస్టారూ,ఇది నా కోరిక అని...ఆయన ఇలా ఉంటుంది బాబు...music college ఐతే సరైన place అన్నారు...అక్కడ నాకు బ్రేకు పడింది..మళ్లీ వాసు గారు నాలో ఆశలు రేపినట్టే రేపారు...చివరకి నీకు తెలిసిందే...violin కి commit అయిపోయాను..అది కూడా lite అయిపోయింది.... :(
anyways fusion (Indian classical+Western) లో వీణ ది ప్రత్యేక స్థానం....అందుకే వీణ rocks.... :)
maama... baga rasav.. alanti
maama... baga rasav.. alanti progs unte.. naku oka vartha padeyyi.. vachesta ani kadu.. vaste vasta ... interest anedi okati edichindi le naku kooda :)
inka wing updates antava.. as usual pottodu (chaala mandi unnaru le kani nuvvu cheppina vade ), vadi chilipi chestalu.. telsinde ga :)
nee floor aina, Main
nee floor aina, Main Building 3rd floor, gurinchi raaskoka neekenduku bey OBH ground floor gurinchi... eppudoo naalugu rojula kritham kanipinchaav. IIIT lone vuntunnavaa ??? ela vundi life ??
>> క్రాంతి గారు ఈ మధ్య జనాల్ని దొబ్బడం మానేశారు, అదేలే, కాస్త తక్కువుగా దొబ్బుతున్నారు. కారణం SRP కాదని ఆశిద్దాం
srp love post raasina deggara nundi, kranthi ilaa vuntunnadu.. I donno da exact chemistry running b/w ***
Post new comment