Memorable… the chevalier!

నాకు ఐఐఐటి పంచిన మరిచిపోలేని అనుభూతుల్లో మరో ముత్యం… ఇవాళ HCU లో ఆయన (chevalier అన్నా గుర్తు రాకపోయుంటే.. బాల మురళి కృష్ణ గారు) కచేరీ ఉంటే, తొక్కలో exams వల్ల వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సమయంలో సామ్రాట్ రూం కి వెళ్ళా. అదే time లో వాడు 'DVDs ఇవ్వాలి.. HCU కి వస్తావా?' అన్నాడు. హమ్మా.. దొరికాడ్రా బాబు తోడు, అనుకుని 'సరే' నన్నా. ఇద్దరం బైక్ మీద 3 నిమిషాల్లో ఆడిటోరియంకి చేరుకున్నాం. అప్పటికి లోన్నుంచి 'గౌరీ.. నన్ను బ్రోవుమా' అని వినిపిస్తుంది. లోపలికి వెళ్ళేసరికి, ఖాళీల్లేవే! చూడగా చూడగా చివరగా రెండు సీట్ట్లు కనిపించాయి.. పోయి కూర్చున్నాం.

పెద్దవాళ్ళు కొంతమంది తాళం వేస్తూ ఉన్నారు. students మాత్రం 'hmmm..' అన్నట్టు చూస్తున్నారు. ఒక నిమిషం అలాగే గడిచింది. వాసు sir, పురుష్ stage మీదనే వున్నారు. ఈ మధ్యలో సామ్రాట్ వెళ్తానని చెప్పి బయల్దేరాడు. sudden గా hall అంతా నిశ్శబ్దం!

అక్కడ మొదలైంది.. ఆయన 'స్వరకల్పన'!(అంటే, సరిగమపదని లతో ఆట!). ఆయనతో పాటు మృదంగం, వాయులీనం కూడా కచేరీలో ఉన్నాయి. నిజంగా వాళ్ళిద్దరితో ఒక ఆటే ఆడుకున్నారు, బాల మురళి గారు! ప్రేక్షకులంతా 'ఏం జరుగుతుందా' అన్నట్టు చూస్తున్నారు. 'నువ్వానేనా?' అన్నట్టుంది అక్కడ ముగ్గురి మధ్య వరస. అలా ఒక 3 నిమిషాల పాటు సాగింది.. చప్పట్లే చప్పట్లు! చాలామంది చీటీ మీద వాళ్ళకి ఇష్టమైన కీర్తనలు పంపుతున్నారు. ఎవరో అలాగే పంపినట్టున్నారు, గురువుగారు 'పలుకే బంగారమాయేనా' అని అందుకున్నారు.. now at this point.. everyone's out of their age bounds, generation gaps blah blah.. each and every soul in the auditorium is clapping to the rhythm and tapping the feet with joy. I dint quite expect this from HCU's metropolitans.. really they surprised me :P and something about me.. “I’m up above the cloud9!”. ఆ గళానికున్న గాంభిర్యం ఆ కీర్తనకో కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అక్కడితో ఆగలేదు.. గోపన్న ని మళ్ళీ మళ్ళీ రంగంల్లోకి తెచ్చారు.. వరసగా 'ఎంతో రుచిరా', 'రామ చంద్రాయ జనక..' కూడా పాడేసరికి జనం ఇంకో లోకంలో ఉన్నారు!

ఇక్కడ మళ్ళీ చిన్న change.. పక్కన violin వాయించే అతని నుండి violin తను తీస్కుని, ఎవో మూడు మెట్ట్ల మీద మీట మన్నట్టు నేర్పించి మళ్ళీ అతని చేతిలో పెట్టి, ఇలా మెదలెట్టారు.. 'ఏమి సేతురా లింగా' అని. ఇది lyrics special. అది పల్లెటూరి పాలెగాళ్ళ శైలిలో పాడడంతో, ఇంకా బావుంది. అలా అలా తిల్లానాల్లోకి వచ్చిపడేసరికి జనం ఎక్కడా ఆగేలా లేరు.. చప్పట్ల తోనే తాళాలు వేస్తూ, గురువుగారిచ్చే ఝళక్ లకి, సుర్రున పేల్చే టపాసులకీ ముగ్దులవుతూ బాగా enjoy చేసారు. కచేరీ అయిపోయాక... 'photo session!'. ఎలాగోలా తంటాలు పడితే, పురుష్, నేను ఆయనతో కొన్ని photos తీయించుకున్నాం.. thanks to Vasu sir! బయటకి వచ్చేసాక, పురుష్ తో అన్నా.. 'సుబ్బలక్ష్మి గారు కూడా బ్రతికి ఉండుంటే ఎంత బావుణ్ణు' అని. అవి అప్రయత్నంగా వచ్చిన మాటలు.. ఎదో miss అయ్యానా అన్న feeling తో వచ్చిన మాటలు.. stalwarts అని ఊరికే అంటారా?

Comments

mama .. naku text kanapadatla

mama .. naku text kanapadatla (unreadable) .. can u help ...

yet another one discovers the

yet another one discovers the beauty of carnatic music.
welcome to the club!

good description ... nijamga

good description ... nijamga nee posts chadavesariki naa tala pranam tokaki vasthondi raa baabu. pandaga chesukunnattu vunnav :P . vibbu gadini teesukellalsindi asala keka vundedi.

@ confused if you are using

@ confused

if you are using windows:
goto control panel > regional and langauge settings > check the boxes which talks about asian languages and it asks for ur installation cd, put it in cdrom. it'll install the language support. I recommend IE to read indic fonts(its rendering appears to be better than others).

else if you are using linux/derivants:
by default, if it is linux, you should be able to read.. in case you aren't, search for telugu using the package manager(yum in fedora, synaptic in ubuntu, yast in suse) and install correspoding packages.

@phani, ok babai, coming

@phani, ok babai, coming telugu post will be completely in 'our' words...

@కొత్త పాళీ : thanx mastaru!

maraa fotos sharing lo

maraa fotos sharing lo pedithe maa chuttalaki chuupistaa maa goggaadu musical uncle tho foto digaadu ani ... tondaragaa mail cheyyy

@kukaki.. neeeeeeeeeeeeee!!

@kukaki..
neeeeeeeeeeeeee!! goggadentra potti vedava! 'fotos' naa system lo vunnai. nirabyantaranga teeskovachu..

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options