నేస్తమా! నీ సృజన

ఉలి చెక్కని శిల్పమో
కవి రాయని కావ్యమో
నేస్తమా, నీ సృజన
రవి నిలిచిన సంద్రము.

తిరుగురాని ప్రయాణమో
విలయకాల వ్యాకులమో
లేదు లేదు ఏ భయమూ
అది మరపులోని ఙాపకము.

నీ ఎగ శ్వాసల అవిరిలో
మలి సంధ్యల కిరణాలూ
మసకలోని ముసుగులూ
దిశలు మార్చుకోనీ, ఆ దశలు మారనీ.

సడలని శుభ సంకల్పం
ప్రోద్భలమై సాగిపో
నేస్తమా, నీ సృజన
రవి నిలిచిన సంద్రము.

ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా స్పురించవచ్చు.. కానీ నేను రాసిన పరిస్థితిని వివరిస్తే.. అదో తుత్తి! అప్పుడప్పుడు, మనం కొన్ని సంఘటనల వల్ల వ్యాకులత చెందడం సహజం. నాకు ఈ మధ్య అలా అనిపించడం, మళ్ళీ నాలో నేనే సర్ది చెప్పుకోవడం కూడా జరిగాయి. అంటే నా జీవితానికి సంబందించి కొన్ని నిర్ణయాలు తీస్కోవటానికి ఎందుకో లేని పోని ఆలోచనలతో సతమతమవ్వటం అన్న మాట. కొన్ని విషయాలు నిశ్చయించుకోవాలంటే, కొంత గుండె ధైర్యం అవసరం. అలాంటి ధైర్యాన్ని నాలో నేను నింపుకోవటానికి చేసిన ప్రయత్నం ఫలితమే ఇది.

ఇక్కడ కొన్నింటికి అర్థాలు అవసరమని నాకు అనిపిస్తుంది..

'తిరుగురాని ప్రయాణ' మంటే.. ఇప్పుడు నువ్వు తీస్కోవల్సి వచ్చిన ఆ నిర్ణయం తాలూకూ పలితం నిన్ను మళ్ళీ వెనక్కి వద్దామంటే రానియ్యకపోవచ్చు.

'మరపు లోని ఙాపకము' అంటే, ఇదివరకు ఆ నిర్ణయం తాలూకు భయం నీకు ఉండేది, కాని ఇప్పుడది నీకు సమస్య కాదు అని.

'మలి సంధ్యల కిరణాలు' అంటే పాత జీవితానికి చెందిన ఆలోచనలు, మూఢాలు, కారణంలేని భయాలు.

సెలవు మరి..

Comments

Chaala bagundi :) Full

Chaala bagundi :)
Full involve ayipoyi raasinatu unnavu ga. Intakiii aa nirnayaalu ento teeskunnava leda??

thanks :) haa.. almost decide

thanks :)
haa.. almost decide aipoinatte. Those are just unconventional routes... anduke konchem alochinchalsi vachindi..

ఉలి చెక్కని శిల్పమో...అయ్యి

ఉలి చెక్కని శిల్పమో...అయ్యి ఉండాలి రా...
ఉలి అంటే చెక్కటానికి వాడే సాధనం అని నీకు తెలిసే ఉంటుంది...
జక్కన శిల్పం అన్నావనుకుంటే అక్కడ ఉలి ఉండకూడదు..శిల్పి జక్కన అయి ఉండాలి.
నీ ఎగ శ్వాసల ఆవిరి అనటం కంటే నీ ఉచ్ఛ్వాసాల ఆవిరి...అంటే అందంగా ఉంటుంది...ఎగశ్వాస అనేది భావహితంగా లేదు...
"నీ సృజన రవి నిలిచిన సంద్రము" అనటం లో నీ భావమేంటో నాకర్థం కాలేదు...

కాని నేను అర్థం చేస్కున్నంత వరకు భావగర్భంగా రాశావు...మన మనసు అల్లకల్లోల పడుతున్నప్పుడు,అమితానందపడుతున్నప్పుడు కూడా మన భావాలని ఇలా కాగితం పై పెడితే అదొక అద్భుతమైన ఆనందాన్నిస్తుంది...నీ ఆనందాన్ని నేను చూడగలుగుతున్నాను...ఇలాగే రాస్తూ ఉండు...
i wish u all the best...

క చ ట త ప లు గ జ డ ద బ లు..

క చ ట త ప లు
గ జ డ ద బ లు..

ఇక్కడ చ కి బదులు జ వాడటం జరిదింది. అది కావలనే వాడాను. ఎగ శ్వాసలు ఆవేశాన్ని తెలపటానికి వాడతారు.
రవి నిలిచిన సంద్రం అని ఎందుకన్నానంటే..
1. సూర్యుడు అంత సులువుగా అందేవాడు కాడు. మన మారుతి గారే మూతి కాల్చుకున్నారు.
2. సంద్రం అంటే ఎం...తో.. పెద్దది అని.

నీ సృజన అంత గొప్పదనీ, అది ఆ సూర్యుడ్ని సైతం తన గుమ్మం దగ్గరికి లాగిందని చెప్పడానికి వాడాను..

"నా ఉచ్ఛ్వాసం కవనం.. నా

"నా ఉచ్ఛ్వాసం కవనం..
నా నిశ్వాసం గానం"
అన్న పల్లవిలో కూడా గమనిస్తే అదే భావావేశం కనిపిస్తుంది...అందుకే చెప్పాను...ఎగ శ్వాసలు అన్న పదం నాకెందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది...అందుకే ఈ సవరణ...

ఇంకా క చ ట త ప లకు బదులు గ జ డ ద బ లు అన్ని చోట్ల వాడటానికి అనువుగా ఉండవు....ఒకవేళ ఈ సందర్భంలో వాడినా అది "జెక్కని" అని ఉండాలి...నేను చెప్పింది అదన్నమాట...చెక్కని బదులు "జెక్కని" ఉండాలనేది నా వాదన...

కాని మామ.. అక్కడ ఆయన

కాని మామ..
అక్కడ ఆయన ప్రశాంతతతో ఆ పాట రాశారు.. ఇక్కడ నా పరిస్థితి వేరు కదా. anyway, thanks for reminding this, విని చాలా రోజులైంది.. మళ్ళీ ఇప్పుడు వింటున్నా :)

హా.. ఇది కరక్టే.. కాని నేను రాసేటప్పుడు, చదివిన భాష కంటే, విన్న దాని ప్రభావమే ఎక్కువుంటుంది. మనం మాట్లాడే, వినే భాషలో తప్పులన్నీ ఇక్కడా దొర్లుతాయన్నమాట :P ఇది వరకు అనుపమ ఇలాంటి తప్పు ఒకటి చెప్పింది. (పాడి కి పాడె). technically, you both are right. :) సరి చేస్తాను.

thanks ra.

Chaala bagundi nee poem.

Chaala bagundi nee poem. Thanx to my schooling, I never gotta a chance to learn so much Telugu. Keep up the good work.

My previous comment seems lil

My previous comment seems lil vague, so here I am again..By saying "Thanx to my schooling", I meant that because of the stupid rules in my stupid school, I dint get to learn the nuances of our language.

@Deepti, thanks.. it's

@Deepti, thanks.. it's contextually understandable, though it might be mistaken otherwise :)

బ్రిల్లియంట్ పోఎం

బ్రిల్లియంట్ పోఎం ,గోపాల్!
ట్రులీ అమజింగ్ . బై ది వే , హౌ డిడ్ యు మేనేజ్ రైటింగ్ ది బ్లాగ్ ఇన్ తెలుగు? కెన్ యు సెంద్ మే ఎనీ టుటోరియల్ ఫర్ లేఅర్నింగ్ ఆన్ హౌ టు డూ ఇట్ ?
ఐ విల్ బీ వేరి గ్రేట్ఫుల్ ఫర్ ఎనీ హెల్ప్ ఇన్ థిస్ రిగార్డ్ !

@raghuram, thanks మాష్టారూ!

@raghuram, thanks మాష్టారూ! కాని, తమరు ఇంగ్లీష్ ని అంత బాగా తెలుగులో టైప్ చేసి మళ్ళీ నన్నడుగుతారేంటి? anyways.. I use aksharamala in windows, scim in linux to type content in indic scripts :)

tooooo much vundi gopal !!!!!

tooooo much vundi gopal !!!!! asalu kummesav . telugu novel drop chesav kada??? god bless me.. :P