Indian Culture

మహానగరంలో మాయగాడు

ఆఫీస్ మెట్లు దిగి అలా నడుస్తూ వస్తున్న గోపాలం చుట్టూ ఏదో మాయ అల్లుకుంటోంది. అది మాయో కాదో దానిలో పూర్తిగా మునిగిపోయిన అతనికి రవ్వంతైన తెలియలేదు.

చలం - స్త్రీ స్వేచ్చ

1930 కాలంలో చలం నవలలు సృష్టించిన ప్రకంపనలకి, తెలుగు నేల కంపించి, పాతాళాన నాటుకున్న పురుషాధిక్య సమాజపు పునాదులు అట్టే గజగజ వణికాయి. ఆయన ప్రతిపాదించిన వివాదాస్పద స్వేచ్చ ఎంతో కలకలం రేపింది. నవలలకేనా..? అని అలా నోరెళ్ళబెట్టమాకండి. అది తెలుగు సాహిత్యానికి బంగారు యుగం. అందరూ సాహిత్యంలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు గుర్తించే కాలం.

ఒకే ఒక్కడు!

ఇది సినిమాల గురించి కాదు, సినీ యాక్టర్ల గురించి అంతకంటే కాదు. ఇదొక యధార్థ గాద. మీరు మహారాజు సినిమా చూసుంటే, ఆ సినిమా చూసి నాకంత భావావేశం కలగలేదు. కథే కదా అనుకున్నా. కాని అంతకంటే దుర్భర జీవితాన్ని ఒక మహనీయుడు గడిపాడన్న విషయం నన్ను చాలా భాదించింది. ఇది ఈనాడు పత్రికలో, పోయిన నెలలో, మన గడ్డం-ముక్కు పంతులు గారు రాసిన ఆ మహనీయుని కధ (పురుష్ కి కృతజ్ఞతలు!). తెలుగువాళ్ళందరూ ఓపికగా చదవాలని నా ఆశ. చదవమని నా మనవి. చదివి కనీసం మనకున్న కక్కృత్తిలో కొంచెమైనా వదిలి, తెలుగు భాషకి ఐరాస వాళ్ళు చెప్పినట్టుగా పొంచివున్న అంతరింపు ముప్పుని తొలగించడానికి కనీసం మన ఇంట్లోనన్నా ప్రయత్నిద్దాం. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించండం ఒకింత సాయం చేసినా పరిశోధనశాలలలో వస్తువుగా మన భాష మిగిలిపోకుండా చూడటం మాత్రం మనందరి భాద్యతేనన్న విషయం అందరూ గుర్తించాలి! మీ పిల్లలకి తెలుగు నేర్పించటం, వారిని ఈ భాషలో వున్న సాహిత్యాన్ని చదివేలా ప్రోత్సహించటం లాంటివి చేస్తే మీ భాద్యత మీరు నిర్వర్తించినట్టే.

Jugalbandi!

It all began when I came to know about the series of Classical Music concerts and Dance performances, called 'Festival of Bala Murali', at Chowmahalla palace, a beautiful place!

Third day(yeah, I missed first two) there were two cultural events, a concert by Devan-Drone and a Kuchipudi dance performance by Mrs.Shallu Zindal. The concert went well except for few minor mistakes. I liked 'nothing but peace', 'english note', 'jagadodharana' and the conclusion concept of 'colors' where they played various pieces of classical bits, one after the other with smooth transition. The dance performance was good.

Fourth day rocked!! There was a natyalaya run by Dr.Bala Murali in chennai, called Vipanchi. Four from that group performed four forms of dance, Bharatanatyam, Kuchipudi, Odyssey and Kathak. And the final piece was Jugalbandi!! It's a mix of the four forms performed by all four on stage! About the performances, 'awesome' and 'astounding' can at best be modest in talking of those enthralling performances. Following are few details about the performers...

చెలియలి కట్ట

చిన్న మనవి : తెలుగు సాహిత్యానికి ఆనాడు కవిత్రయం చేసిన సేవని తలపించిన విశ్వనాథ సమకాలీన,అంతకు మునుపు వున్న రచయితల,కవుల గురించి రాద్దామని ఉంది. కాని టపాసుల్లాంటి సంగతులుంటే గాని అలాంటి రాతలు రక్తిగట్టవు. కాబట్టి మీకెవరికైనా ఎంతోకంత, ఎన్నోకన్ని విషయాలు తెలుసుంటే, నాకు ఇక్కడ తెలుపగలరు.

గోదావరి

ఈ రెండు రోజులు ఇంటికెళ్ళడం, పనుండి అలా రాజమండ్రి వెళ్ళడం జరిగింది. గోదావరి ఉద్దృతి తగ్గి, ప్రశాంతంగా ప్రవహిస్తోంది. చా...ల అందంగా ఉంది.

నేస్తమా! నీ సృజన

ఉలి చెక్కని శిల్పమో
కవి రాయని కావ్యమో
నేస్తమా, నీ సృజన
రవి నిలిచిన సంద్రము.

తిరుగురాని ప్రయాణమో
విలయకాల వ్యాకులమో
లేదు లేదు ఏ భయమూ
అది మరపులోని ఙాపకము.

నీ ఎగ శ్వాసల అవిరిలో

అహో... ఆంధ్రబోజ!

కన్నడ రాజ్య రమా రమణ, మూరురాయరగండ, ఆంధ్రబోజ..
సాహితీ సమరాంగణ సార్వభౌమా. విజయనగర సామ్రాజ్యాదీశా..
. శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయ.

అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి.. ఆ పేరు వింటే పులకించని జన్ముండదు దక్షిణ భారతాన. ఆయన కీర్తి నెమరువేసుకుంటేనే వెన్నులో వేల వాట్ల విద్యుత్ పుట్టి, నరాల్లో జీవం పుడుతుంది. రక్తం అభిమానంతో మరుగుతుంది. ఆయన గురించి రాయడం మొదలుపెడదామంటే ఎక్కడ, ఏ విషయం మీద రాయాలో పాలుపోవటం లేదు. అటు యుద్దభూమిలో శత్రువులను తరిమి తరిమి కొట్టిన ఆ శౌర్యమా? యుద్దం అయ్యాక అదే యుద్దభూమికి వచ్చి క్షతగాత్రులందరినీ తీసుకెళ్ళి సొంతమనిషి కూడ చేయని పరిచర్యలు చేసే ఆ ఔదార్యమా? సమర రంగాన సైతం విరామ సమయాల్లో కవి దిగ్గజాలతో అలరారే ఆ నిరుపమాన కళాపోషణా? సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ ప్రజల ఉనికిని చాటి, ఈ దేశ సంస్కృతిని తనతరం, తదనంతరం విరాజిల్లేలా దిద్దిన ఆ కౌశలమా? ఇలా అడుగుతూ పోతే ఎన్నయినా వస్తాయి.

జోకులు - 2

కొన్ని జోకులు చదివేకంటే, చెప్తేనే బావుంటాయి.. ఈ కిందవాటిలో 'రావణుడు - April Fool!' జోక్ ఆ కోవలోనిదే.(ఈ జోకులన్నిటికి మూలాలు కూడా చెబుదామనుకున్నగాని ఇవన్నీ చాలా చోట్ల ఉండే జోకులే.. ఏది మొదటి మూలమని చెప్పటమో కుదరక చెప్పటం లేదు.. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మందు

రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏంటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

అన్నమయ్య - తెలియని విశేషాలు

'చందమామ రావే, జాబిల్లి రావే.. ' అనో, 'లాలి లాలి.. ' అనో, 'జో అచ్యుతానంద.. ' అనో ... తెనుగింట అమ్మ పాడకపోతే, హన్నన్నా! ఇంకేవైనా ఉందా? కొంపలంటించేయరూ కోతిరాయుళ్ళు.. అదే, పిల్ల పిడుగులు! మనం ఇప్పుడు చెప్పుకోబోయే 'అన్నమయ్య' గారు వాళ్ళ మీద జోలలూపడానికి సంధించిన అస్త్రాలే అవన్నీ. ఇలాటివి అన్నీ ఇన్నీ గాక.. ఏకంగా ముప్పైరెండు వేలు పైచిలుకు  సంకీర్తనల్ని కూర్చారు.. రాయొద్దూ? ఈ కోతిరాయుళ్ళకే ఇంత బెట్టయితే, ఈ కోతులందరి ముఠానాయకుడైన కోతులరాయుడ్నే కాచే కొండలరాయుడి మెప్పు కోసం, తప్పదు మరి!

జోకులు!

నాకు అప్పుడప్పుడు వెబ్ లోనో, స్నేహితుల దగ్గరో తారసపడే కాస్త బావుండే జోకులన్ని పొందుపరిచాను.. అందులో కొన్ని ఇవి...

ముఖ్య గమనిక : తొక్కలో లాజిక్కులు తీయకుండా, ఎక్కువైంది, తక్కువైంది అని గొణక్కుండా, జోక్ ని జోక్ లా ఆస్వాదించ ప్రార్థన.  ఇవి మీకు ముందే తెలిసుంటే 'పోనిలే' అని వదిలేయటం మంచిది. ఇక జోకుల విషయంకెళ్ళిపోదాం..

పిలుపులు

కొంతమంది.. వాళ్ళకి సంబందించిన వాళ్ళని పిలిచే తీరు చమత్కారంగా ఉండి నవ్వు తెప్పిస్తుంది. ఉదాహరణకి..   మా పక్కింటావిడ మా అమ్మని పేరు పెట్టి 'అనంత' అని పిలుస్తుంది, అదే అలవాటుగా  అవిడ  3-4 ఏళ్ళ మనుమలు కూడా అలాగే పిలవటం నేర్చుకున్నారు.  మొన్న ఇంటికెళ్ళినప్పుడు నోరెల్లబెట్టి చూస్తున్న.. ఆ పిల్లలలా పిలుస్తుంటే!

'కట్టు'బాట్లు - సొగసు ముద్దే.. కాని అతి వద్దు.

ముఖ్య గమనిక : ఇదో వేలంవెర్రిగా సాగే చర్చ. దీనికి 'ఇదీ' సరిహద్దు అనేది ఏదీ లేదు. కింద నే చెప్పేదంతా 'నా' మనస్సులోనిది మాత్రమే. దీన్ని యావత్పురుష ప్రపంచానికి  అణ్వయించొద్దని మనవి... కానీ.. మగజాతిలో చాలామంది  ఆలోచనలకి ఇది వర్తిస్తుందనుకోండి...

ముందు నేనొక విషయం చెప్తాను.. ఒప్పుకుంటె మిగతాది చదవండి. లేకపోతే వద్దు... ఛస్తే వద్దు!

"భారత దేశ సంస్కృతికి మిగతా ప్రపంచం ఇచ్చే గౌరవం భారత స్త్రీ కి ఇచ్చే గౌరవమే."

నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను. ఎందుకూ అంటే.. 

ఘల్ ఘల్ 'ఘజల్'

అనగా అనగా అనగా... ఒక ఐఐఐటి. అదేంటోగాని నిన్నమొన్నటి దాకా 'made of techy-crap' లా కనిపించిన ఆ ఐఐఐటి... మన ఐఐఐటి.. హైదరాబాద్ లో, గచ్చిబౌలిలో ఉన్న ఇదే ఐఐఐటి.. నాకీ మధ్య రకరకాలుగా కనిపిస్తుంది. ఒక సంగీతారాధనలోనేంటి, ఒక 'స'సమాజ నిర్మాతగానేంటి.. ఒక సదిశానిర్ధేశిగానేంటి.. ఇలా మొత్తానికి నేను చేరుకోవల్సిన చోటికే చేరుకున్నానని, నా జీవితంలో మూడు అతి చిన్న[1]సంవత్సరాలలో తెలిసింది..అనగా నేనిప్పుడే నాలుగో సంవత్సరంలోకి వచ్చానన్నమాట! ఒకసారందరూ SE[2]కి గోవింద కొట్టాలమ్మా.. 'గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద! గోవిందా!.. గోవింద!..' శబ్బాష్!!

Memorable… the chevalier!

నాకు ఐఐఐటి పంచిన మరిచిపోలేని అనుభూతుల్లో మరో ముత్యం… ఇవాళ HCU లో ఆయన (chevalier అన్నా గుర్తు రాకపోయుంటే.. బాల మురళి కృష్ణ గారు) కచేరీ ఉంటే, తొక్కలో exams వల్ల వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సమయంలో సామ్రాట్ రూం కి వెళ్ళా. అదే time లో వాడు 'DVDs ఇవ్వాలి.. HCU కి వస్తావా?' అన్నాడు. హమ్మా.. దొరికాడ్రా బాబు తోడు, అనుకుని 'సరే' నన్నా. ఇద్దరం బైక్ మీద 3 నిమిషాల్లో ఆడిటోరియంకి చేరుకున్నాం. అప్పటికి లోన్నుంచి 'గౌరీ.. నన్ను బ్రోవుమా' అని వినిపిస్తుంది. లోపలికి వెళ్ళేసరికి, ఖాళీల్లేవే! చూడగా చూడగా చివరగా రెండు సీట్ట్లు కనిపించాయి.. పోయి కూర్చున్నాం.