మహానగరంలో మాయగాడు
ఆఫీస్ మెట్లు దిగి అలా నడుస్తూ వస్తున్న గోపాలం చుట్టూ ఏదో మాయ అల్లుకుంటోంది. అది మాయో కాదో దానిలో పూర్తిగా మునిగిపోయిన అతనికి రవ్వంతైన తెలియలేదు. అతను జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 11 మొదలు అక్కడ్నుంచి పెద్దమ్మ గుడివైపు వస్తున్న దారి మొత్తం హఠాత్తుగా సినిమాల్లో చూపించినట్టు పచ్చని బయళ్ళతో నిండిపోయింది. రోడ్డు ఒక నదిపాయలా, కార్లు, బైకులు దానిలో హంసల్లా కనబడుతున్నాయి. అలాంటి ఆ ప్రదేశంలో చేనుగట్లు మీద, అదే, పాదాచారుల మార్గం, ఆ గట్లు మీద నడుస్తూ కొందరు ముద్దుగుమ్మలు చేసే నాట్యం చూడ్డంలో లీనమైపోయిన గోపాలం తను వెళ్తున్నదెక్కడికో, నడిచేదెటో మర్చిపో్యాడు. అలా వింత అనుభూతులతో కాసేపు ఏదో సినిమా క్లైమాక్సులో ఉన్నట్టు ఉత్కంఠగా పెడతాడు మొహం, ఇంకాసేపు చిరునవ్వుతో ఏదో దొరికినవాడిలా మురిసిపోతాడు - చూసేవాళ్ళకి సరిగ్గా పిచ్చోడిలా కనిపిస్తాడేమో! ఈ రకంగా అలా వెళ్తున్న అతన్ని పక్కనే వెళ్తున్న ఒక హంస ఏదో అంది, గోపాలం నవ్వుకున్నాడు. అది చుర చుర చూసి మళ్ళీ ఏదో అంది. గోపాలం మళ్ళీ నవ్వుకున్నాడు. ఈసారి ఏమనుకుందో ఏమో, కాస్త గట్టిగా ఇంకేదో అంది. ఉలిక్కి పడ్డాడు గోపాలం, అలా ఒక్కసారిగా ఈ లోకంలో పడేసరికి పక్కనే ఒక కారోడు తెగ మోగించేస్తున్నాడు, పక్కకి తప్పుకుని కొంచెం తల పైకెత్తి చూస్తే Cafelette అని ఉంది. అప్పుడర్థమైంది, తనకి తెలియకుండానే దాదాపు 1.5-2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేశాడని. "వా...ర్ని!" అనుకున్నాడు.
అదండీ సంగతి. వింటూ వెళ్దామని సెల్ లోకి ఎక్కించుకున్న నాలుగు పాటలతో నా ప్రపంచమే మారిపోయింది! అది సంగీతమో, సితార్ తో ఆయన చేసిన మాయోనని కాసేపు బుర్రపాడయ్యింది! నన్ను నేను అంతగా మర్చిపోయిన సంఘటనలు చాలా తక్కువ. నిజంగానే భలే మాయగాడు! సంగీతలోకంలో గ్రహాంతర వాసులకి తెలియకపోతే - ఆయన్ని పండిట్. రవిశంకర్ అంటారు. మీరు ఇప్పటికీ ఆయన పాటలు/కచేరీలు వినకుంటే, చచ్చేలోపు ఒక్కసారైనా వినాల్సిందేనంతే :)
P.S:
- SRP గాడు క్రాంతి సార్ కిచ్చిన స్పీకర్లు నేను కొట్టేశా.. తెచ్చిన కొన్ని రోజులకే హర్ష గాడు దాని పర్యవసనాన్ని చవిచూశాడు.. ఇంకా చూస్తాడు :)
- జంగ్లీ జంగా గాడు AMAV లో వెంకటేష లాగా కంపెనీలో అప్పుడే ఎదో చేసేసి చాలా మార్కులు కొట్టేసినందుకు, ఒక "ఓ......."!

Comments
Post new comment