నలుడు, భీముడు.. గోపాలుడు!

వీళ్ళంతా పేరు మోసిన వంటగాళ్ళు. ముందున్న ఇద్దరూ ఇప్పుడు లేరు. "పోయినోళ్ళంతా గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు" అన్నాడు ఒక సినీ కవి. అచ్చం అలాగే, ఆ పోయిన వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా కొత్తగా అవతరించిన ఒక కలియుగ నలభీముడు.. గోపాలుడు! అతనెలా వచ్చాడో చూద్దాం!

ఈ మధ్య ఇంటర్న్ షిప్ ఒకటి ఉన్నందున ఫ్రాన్స్ చేరుకున్నాను. వెళ్ళే ముందు పప్పలతోపాటు తినడానికి గాను ఇంకా ఏమన్నా తీసుకెళ్ళమని ఎందరు చెప్పిన చెవిన పెట్టకుండా ఏదో నామమాత్రానికి నాలుగు మ్యాగి ప్యాకెట్లు మాత్రం పట్టుకుని, పెట్టిన ఆవకాయ కూడా బరువు పేరు చెప్పి తీసేసి, గీరగా బయల్దేరి వచ్చాను. అలా చెయ్యడానికి కారణం లేకపోలేదు. అంతర్జాలం అనే ఒక పిశాచం ఉంది చూశారూ, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించడంలో దీనికిదే క్వీను! ఆ పప్పులో కాలేసే, మా అమ్మ "తిండెలాగరా?" అని అడిగినప్పుడు, "అబ్బో.. ఫ్రాన్స్ అంటే అది, ఫ్రాన్స్ అంటే ఇది, అక్కడ చికెను, మటనూ తప్ప ఇంకేం తినా!!" అంటూ ఫోజులిచ్చుకుంటూ కాలరెగరేసుకుని చెప్పా! ఇక్కడ దిగాక అర్థమయ్యింది, వీళ్ళ చప్పిడి కూటి మహత్యం, యా....క్!! ఛి! ఛి!! సప్పగా, సడుగులాగా.. బాబోయ్! పొద్దున్నే టిఫినీలు కూడా ఉండవంటా, కాఫీలు తాగేసి మొదలెట్టేస్తారంట పనులు, "బలిసే ఉన్నారే, ఏంటెహె ఈళ్ళ కకృత్తి!?" అని చిరాకేసింది. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం తిళ్ళు చూసి వికారం వచ్చింది, వెంటనే ఏడుపు కూడా వచ్చింది. అసలే భోజన ప్రియుడ్ని! ఎలా తట్టుకోవడం?

ఎంత బంగారం ఐనా సరే, అగ్గిలో కాలిస్తే కాని దానికో రూపం, విలువా ఉండవు. మళ్ళీ అచ్చం అలాగే ఆ ఏడుపూ బాధల్లో ఉన్న ఈ బంగారంలోంచి ఒక బంగారంలాంటి ఆలోచనొచ్చింది - "మనమే వండుకుంటే?!" అమోఘం! అద్భుతం!! అదే తడవుగా మా చెల్లిని, అమ్మని కాంటాక్ట్ చేసి సింపుల్ గా నాలాగు స్టెప్పుల్లో అయిపోయే వంటలేమన్నా ఉంటే రాసి మెయిల్ చేసేయ్ మన్నా. నేనెళ్ళి అప్పటికే ఇక్కడ స్థిరపడ్డ ఇండియావాళ్ళదగ్గర కావల్సిన సరుకులెక్కడ దొరుకుతాయో కనుక్కుని సిద్దంగా ఉన్నా. లిస్ట్లో మొట్టమొదటిది "ఆలు ఫ్రై!". ఊపిరితిప్పకుండా వండేసా! చంద్రమండలం ఈలేసి ఏలేసినంత ఫీలింగ్ వచ్చింది. ఒక్క స్పూను మిర్చిపేస్ట్ తక్కువ, ఒక్క స్పూను వెల్లుల్లి పేస్ట్ ఎక్కువా అయ్యాయే కానీ, లేకపోతే కూర అమృతమే! అప్పటికే నాలుగు రోజులు ఆ చప్పకూడు తినీతినీ విసిగెత్తిపోయిందేమో నా నోరు, ఒక్క మెతుకు మిగల్చకుండా మొత్తం పీల్చేశా! ఆ తర్వాత మన మీద మనకే నమ్మకం ఎక్కువైపోయి ఎందుకైనా మంచిదని జ్యోతిగారి సైటుకెళ్ళి నాలుగైదు కూరలు దిగుమతి చేస్కున్నా. ఇక మూడు నెలల్లో భారతదేశం ఒక బ్రహ్మాండమైన వంటోడ్ని చూడబోతోంది. నా కూర, అదే, నా ఫస్ట్ వంట తాలూకూ బొమ్మలు ఇవే, నోళ్ళూర్చుకుంటూ చూసి పండగ చేస్కోండి :)

Comments

Choodatam varaku bane

Choodatam varaku bane unnai..tinte ela untayo mari :P
ekkadiki vellina batikestaru.. vegetarians rock!

tokka le.. vandatam teda

tokka le.. vandatam teda vaste nenu lechipotanane kani, lekapothe only non veg ye vandukuni mekke vadni!

@anu: anthe anu. ekkadiki

@anu: anthe anu. ekkadiki poyina ee pichina non-veg gallaki mana vege gathi..

@goki: ilage pichekinchu. ikkadiki vachaka kranthi sirki potiga teyaravuduvu. pichekincheyi anthey!

Evaru chesukunnadi.. vallaki

Evaru chesukunnadi.. vallaki bane untadi :P
idi fact.. deeni tappu ani prove cheyyatam kashtam...!

@Rohit, Agreed!! :)

@Rohit, Agreed!! :)

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options