నవనీతం

అప్పుడప్పుడు మనసు నా అదుపు తప్పి నన్ను నా కిష్టమైన కొన్ని ఆలోచనల సముద్రంలో అమాంతంగా విసిరేస్తుంది. అక్కడ ఏ సౌందర్యమో, పరవశమో, భావావేశమో అలలా వచ్చి తాకినప్పుడు పుట్టే గిలికి, నాలుగు సరదా పదాల్ని కలిపితే అప్పటి నా అనుభవం నాకు తెలియకుండానే ఒక అక్షర రూపం తీస్కుంటుంది. అలా నా తలపుల్ని తడిపి మనసు తీరంపై నాటిన వాటి ఆనవాళ్ళని కాలాంబుదిలో కలిపేయలేక, నేను చేసే ప్రయత్నం - నవనీతం.

పేరలా పెట్టడానికి ఆ పదానికున్న విశిష్టతే కారణం. పాలు చిలికితే పుట్టే వెన్నకి మరో పేరది. అలా నాలో నేను మధనపడి నప్పుడు వచ్చిన భావాలు కనుక వాటికాపేరు పెట్టాను :)