నేను చదివిన మొదటి ప్రేమ(తో) లేఖ

అది నాకు రాసింది కాదనుకోండి. కాని నాకు ఇదివరలో బాగా నచ్చిన రాతల్లో అదొకటి. చాలా సహజంగా రాశారామె. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో, ఒకానొక ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిందది. నా అలవాటు ప్రకారం కత్తిరించి దాచుకున్నా. అలా దాచుకున్నవి ఎన్ని పోయిన ఇదోటి మాత్రం భద్రంగా ఉంది. శ్రీ చైతన్యలో మాది మగాళ్ళ కొంప కావడం వల్ల ప్రతి ఒక్కడు కక్కృత్తి గాడే. మా హాస్టలు కూకట్‌పల్లిలో సరిగ్గా బస్టాండుకి ముందుండేది. పక్కనే అమ్మాయిల కాలేజీ. ఇక సాయంత్రం ఐదైంది మొదలు, వాళ్ళ కాలేజీ వదిలేయగానే సొళ్ళు కార్చుకుంటూ వరండాలోకొచ్చి తిష్టేసేవాళ్ళం. ఒక అరగంట నేత్రానందం. :P అలాంటి బీభత్సమైన హాస్టల్ వాతవరణంలో ఇలాంటివి చదివిన ప్రతిసారి మామీద మాకే అసహ్యం వేసేది. ఎందుకురా మన బ్రతుకు అని! ఇదే అది... హా.. ఒక్క విషయం, ఇది నచ్చలేదని చెప్తూ చేసిన ఏ చెత్త వ్యాఖ్యైనా నిర్థాక్షణ్యంగా తీసేస్తాను. :D

"కాలేజీకి వచ్చేటప్పుడు నా వెంటే నడిచే నీ చూపులు... అవి ఏదో చెప్పాలనుకోవడం, కానీ ఏమీ చెప్పలేకపోవడం... నన్ను చూడగానే నీ కళ్ళల్లో మెరుపు, పెదవుల మీద చిరునవ్వు... మొదట్లో విసుగ్గా అనిపించినా రానురానూ నీ మీద పెరిగిన అభిమానం... ఒక్క క్షణమైనా నిన్ను మిస్ కాకూడదన్న దృడమైన సంకల్పం... వణికించే శిశిరంలో దుప్పటి తీస్తే వచ్చి అమాంతం కౌగిలించుకునే చల్లగాలి... ఏం లేస్తావులే కన్నా బజ్జో అంటూ బుజ్జగించి జోకొట్టే నిద్రాదేవత... అప్పుడు సడెన్‌గా గుర్తొచ్చే నువ్వు... అమ్మ బాబోయ్ కాలేజీ టైమ్‌కు వెళ్ళకపోతే నిన్ను ఎంత కోల్పోతానూ! ఉదయం కనిపించకపోయినా మధ్యాహ్నం కలుస్తావని తెలుసుగానీ పిచ్చి మనసు వింటే కదా! పనేమీ లేకపోయినా ఏదో వంకతో బ్రేక్‌లో ఆఫీస్‌రూమ్‌కు రావడం... డైరెక్టుగా చూడలేక కళ్ళచివరి నుంచి నీ కోసం క్లాస్‌లోకి చూడ్డం... నేను ఎటెటో చూస్తుంటే నవ్వుతూ ఎదురుగా ప్రత్యక్షమయ్యే నువ్వు... అప్పుడు చూడాలి నా తిప్పలు... అందరూ రోజులు అని పిలుచుకునే కొన్ని యుగాల తరవాత, నీలో నేను అర్థాంగినవడం... సాక్ష్యంగా మెడలో పచ్చగా మెరిసే మంగళసూత్రాలు... నీకు తోడుగా నేనున్నానంటూ నా చేతిలో నీ వెచ్చని చేయి... తల్లి ఒడిలో బిడ్డలా టెన్షన్స్ అన్నీ మరిచిపోయి నీలో ఒదిగిపోవడం... మాటలకందని ఆనందం... ఇంకెంతో చెప్పలేని ఏదో ఏదో... ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటూ, నీ నేను"

స్పందన, విజయవాడ

Comments

precise...but కక్కుర్తి

precise...but కక్కుర్తి గాళ్లు...సొల్లు కార్చుకోవడం...

మరీ కాలేజి ప్రేమ నుంచి మెళ్లో మంగళ సూత్రాలకి ఒకేసారి జంప్ చేసేస్తే కష్టంగా అనిపించినా బావుంది..
ఏదో ఒక తొందరతనం ఉంది ఆ అమ్మాయి వ్యాఖ్యానంలో....ఆ తొందరతనమే "మెచ్చుకోవాలా?" అని అనిపిస్తోంది నా చేత...

ప్రేమలంటే ఇలాగే వుండాలి అనే

ప్రేమలంటే ఇలాగే వుండాలి అనే ఒక fixed idea నుంచీ ఈ ప్రేమలేఖని చూసి అలా అంటున్నట్లున్నారు. ప్రతి ప్రేమకథా సినిమాల్లో చూపించినంత రొటీన్గా వుండదు.

అరేయ్ కృష్ణ !! నీ స్వహస్తాలతో

అరేయ్ కృష్ణ !! నీ స్వహస్తాలతో వ్రాసిన ఇప్రేమ లేఖను చదవాలని
"""
ఓ ఊర్వసి ,, నా ప్రేయసి ,,
నువ్వు నవ్వుతుంటే GNOME ,, నవ్వకపోతే KDE నే గుర్తొస్తున్నాయి.
అసలు నువ్వు ఏది చేసినా నాకు UBUNTU నే అనుకో ....
నా లినక్స్ ప్రపంచంలోకి వచ్చిన FC వి నువ్వు.
ఏనాడైనా నీతో నా Cog_Science lab లో గడపకపోతానా !!!!
""" -- అని కలలు కంటూ,, సదా అందరినీ గోకే గోకి ని,, నీ గోపాల కృష్ణ ని. నీకు నా వెయి్య ముద్దులు, లక్ష ప్రాజెక్టులు, కోటి బగ్గులు. (bugs)

ఇలాంటి ఒక ప్రేమ లేఖ, కాదు కాదు, ఒక ప్రాజెక్టు లేఖ వా్రసావంటే ..... నా సామి రంగ ,,, గంతులేసుకుంటా వచ్చిద్ది నీ దెగ్గరికి నీ పోరి.

btw Nice Love Letter buddy. :)

baa undi.. ilantivi evaro

baa undi.. ilantivi evaro evariko raste chadavam tappa.. manam raso.. manaki rasevo chadive time eppatiki vastundoooo

oreyy gopi intermediate

oreyy gopi intermediate entraa babai , ippudu koodaa adhey kakkurthi kadhara mandhi :P,
intha peddha hyderabaadhu lo ikkada mana colg lo vunna pakshullo , oka 5 - 6(indhulo ekkuva mandhi pg pakshulu,pittalu ) andhamainaa pakshula kosam sollu , kullu ......... , only change is akkada bus stops lo , ikkada mess lo ....

inka prema lekhalni entha yedavainaa konchem creativity vaadi raasthaadu , so ee premaleka keka anuko (nee happies kosam)

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options