మనిషి (కేవలం) మనిషేనా? (లేక) అన్నీ తనేనా?
గమనిక: దేవుడున్నాడని నమ్మేవారి నమ్మకాలని గౌరవిస్తూ నాకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగిస్తూ నా ఆలోచనలను రాస్తున్నాను. ఎవరైనా పొరపాటున నొచ్చుకుంటే అది నా ఉద్దేశ్యం కానందున అర్థం చేస్కోగలరని ఆశిస్తున్నాను.
దాదాపు ఇప్పటికి రెండేళ్ళక్రిందటనుకుంటాను, కులానికి, మతానికి నాలో అప్పటి వరకు జీర్ణించుకుపోయిన నిర్వాచనాలు వాటి తాకతు కోల్పోయి మరో దిశలో నన్ను ఆలోచింపచేశాయి. అసలు ఆ వ్యవస్థలు ఎలా పుట్టాయి? అవి ఖచ్చితంగా మానవ సృష్టేనా? అని. ఇక్కడ కులం అంటే వర్ణవ్యవస్థ. మతం అంటే దేవుడు అనేవాడి ఉనికి మాత్రమే, హిందూ, ముస్లిం etc లాంటి రకరకాల మతాలు కాదు. పనుల విభజనతో సంఘం అభివృద్దికోసం ఏర్పాటు చేయబడి, వేళ్ళూనుకుని, అవసరం తీరాక పెరికివేయలేని ఒక మహా విషవృక్షంలా కనబడుతుంది ఈ కులం. దాని గురించి పెద్దగా చర్చించదలుచుకోలేదు. ఇక అసలు విషయంలోకి వద్దాం, అదే, మతం గురించి! మతం అనే పదానికి అసలు అర్థం నమ్మకం. ఇందాక చెప్పిన ప్రశ్నలు బుర్రలో మొలకెత్తిన సమయంలో, చిన్నప్పుడు, మూడో క్లాసులోనో నాలుగో క్లాసులోనో, ఎల్సీ సిస్టర్(Sister Elsy) అని ఒకావిడ ఒక చిన్న కథ చెప్పింది, అది గుర్తొచ్చింది.
ఒకతనుండేవాడు. అతనికి దేవుడంటే అస్సలు పడేది కాదు. ఇంట్లో పూజలు చేయనిచ్చేవాడుకాదు. ఇంట్లోవాళ్ళని చర్చికి కూడా వెళ్ళకుండా నియమం చేశాడు. అతనికి పెళ్ళయ్యి, ఒక బాబు పుట్టాడు. ఈ పాడు జనం ఆ బాబుకి దేవుడి గురించి చెప్పి ఎక్కడ చెడగొడతారో అని, పసిప్రాయంలోనే ఆ బాబుని ఒక అడవిలో ఒక ఇంట్లో నిర్భందించి ఉంచుతాడు. అతను కూడా బాబుతో పాటు అక్కడే నివాసం ఉంటాడు. అసలు దేవుడనే వాడు ఒకడుంటాడనిగాని, అతనికి అందరూ పూజలు చేస్తారనిగాని ఏమీ చెప్పడు. అలా, "హమ్మయ్య! వీడు ఇంక దేవుడి ఊసే ఎత్తడు" అన్న ఆత్మానందంతో ఆ బాబుకి కాస్త వయసొచ్చేదాకా అక్కడే ఉంచుదామని నిర్ణయించుకుంటాడు. కానీ, ఒక రోజు ఉదయం పెరట్లో ఆ బాబుని చూసి నిర్ఘాంతపోతాడు ఆ తండ్రి! ఎందుకు? ఉదయిస్తున్న సూర్యున్ని చూసి తన్మయత్వంతో, గౌరవంతో, చేతులు చాచి కృతజ్ఞతా భావంతో ఏవో మాటలు చెబుతూ ఉంటాడు, దేవుడి గురించి ఊసు కూడా తెలియని ఆ బాబు!
అంతే కథ, చాలా చిన్నది! ఈ కథ కూడా మానవ సృష్టే. కానీ ఆలోచించేదాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. ఈ కథని రెండు రకాలుగా అర్థం చేస్కోవచ్చు. ఒకటి - మతం మానవ సృష్టేనని! ఎలా అంటే - తప్పు, ఒప్పు ఉంటాయని, తప్పు చేస్తే నరకం, మంచి చేస్తే స్వర్గం వస్తాయని, స్వర్గానికి దేవుడ్ని, నరకానికి రాక్షసుడ్ని కాపలా పెట్టి, ప్రజలు ఏ విధంగా మసులుకుంటే అందరికీ మేలు జరుగుతుందో ఆ విధంగా వాళ్ళని కొన్ని నియమ నిబంధనలకి కట్టుబడిఉండేలా చూసేందుకు, కొందరు తెలివైన మనుషులే ఇలాంటి వ్యవస్థను నిర్మించారు. అలాంటి మతాన్ని ప్రభోదించడానికి కొందరు చేసే ప్రయత్నమే ఇలాంటి కథలు అనుకోవచ్చు. ఇక రెండో అర్థం -మనం కొన్ని జంతువుల్ని పెంచుకుంటాం, మనం వాటికి తిండీ, ఆశ్రయం ఇస్తున్నాం కాబట్టి అవి మనపట్ల విశ్వాసంగా ఉంటాయి. అచ్చం అలాగే, తెలియని ఒక శక్తి మనల్ని సాకుతుందేమో? అందుకే మన నరనరాన ఆ కృతజ్ఞతా భావం కొట్టొచ్చినట్టు కనబడి, అదే మతంగా పరిణమించిందేమో! ఇదిలా ఉంచితే, ప్రస్తుతానికి, ప్రపంచం ఎలా ఉండి ఉండొచ్చు అని సగటు మనిషిని అడిగితే ఈ క్రింది heirarchy ఇస్తాడనుకుంటాను.

మొత్తంమీద ఈ వ్యవస్థలో ఒక Conspiracy ఉంది. ఇలాగే ఉండాలి అనుకోవడమేంటి? ఇంకోలా కూడా ఉండొచ్చుకదా? ఎపుడూ కనిపించనివాడ్ని ఉన్నాడనుకుని పూజించడం ఏంటి?" అని God centric గా కాక, Human centric గా ఆలోచించాలనిపించి మొదలుపెట్టాను. భూమ్మీద పడే ముందు, పోయిన తర్వాత సంగతులు తెలియవు కాబట్టి అసలేమీ లేదనే అనుకుందాం. మనిషి పుట్టుకే ఆది, అతని మరణమే అంతం అనుకుంటే అతనికి వచ్చిన నష్టం కనబడలేదు. కాబట్టి అనుకుందాం. మరి ఇంతకీ ఆ ఆద్యాంతాలెవరివి? ఆ మనిషివా? ఈ లోకానివా? మనిషివే అనుకుంటే అసలు అలా ముందులా అనుకుని ప్రయోజనం లేదు. కాబట్టి లోకానివే అనుకోవాలి. మరి మనిషులు పోతూనే ఉన్నారు కదా? ఈ లోకం ఇలాగే ఉంది కదా? అంటే మనిషి లోకంలో ఒక చిన్న entity మాత్రమేనా? అంటే ఖచ్చితంగా అందరిపైనా ఒక శక్తి ఉండి తీరాల్సిందేనా? హా! సరిగ్గా ఇక్కడే నాకు బ్రేక్ పడింది! అక్కడ్నుంచి ఆ వాదన కాస్త ముందుకి జరగడానికి చాలా కాలం పట్టింది. సరిగ్గా సంవత్సరం తర్వాత నేను (ఐఐఐటి హైదరాబాద్ లో)Cognitive Science, Advanced Cognitive Science కోర్సులు చేయడానికి కుదిరింది. ఆ కోర్సుల్లో, కొంతలో కొంత, ఇంతకు ముందు ఇలాంటి విషయం గురించే కొంతమంది కొన్ని థియరీలు ప్రతిపాదించారని అర్థమయింది. కానీ వాటి కోసం ఏమని వెతకాలో, ఎక్కడ వెతకాలో తెలియక, ఏదో వెతికి చివరికి దొరక్క కిమ్మని కూర్చున్నాను. చివరికి ఇదిగో ఇప్పుడు, కొన్ని రోజుల క్రితం బెన్నీ షానన్ అనే ఒకాయన(లింగ్విస్టు, కాగ్నిటివ్ సైంటిస్టూనూ) తన పుస్తకం "Representational and the presentational" లో రాసిన కొన్ని చర్చలు చదివి, ఆ తర్వాత వికీపిడియా మీద పడితే కొన్ని లంకెలు తగిలాయి. ఇందాక మనుషులు పోతున్నారే కానీ లోకం అలాగే ఉందనుకున్నాం కదా? ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. ఒక్కక్క మనిషిది ఒక్కో లోకమనుకుందాం. అంటే నా లోకం మీ లోకం ఒకటి కాదు, అవి వేర్వేరు. ఒక మనిషి పోయిన వెంటనే తనతోపాటే తన లోకం కూడా పోతుంది. మన థియరీ దాదాపు పూర్తి కావచ్చింది. ఆది శంకరాచార్య గారు ప్రతిపాదించిన అద్వైత సిద్దాంతంలో ఆయన "అంతా మాయే(Illusion)" అంటారు. కాసేపు అదే సిద్దాంతం నమ్ముతూ, మనం పంచేంద్రియాలతో అనుభవించేది ఏదీ నిజం కాదు. అది కేవలం మన మనఃసృష్టే(Mental Creations/Illusions) అనుకుందాం. ఇప్పుడు ఈ లోకాలన్నిటికి అనుసంధానిద్దాం, Butterfly Effect లాగా.
"కేవలం మనుషులకేనా ఈ థియరీ?" అంటే, కాకపోవచ్చు, అన్ని జీవాలకూ వర్తించవచ్చు అనే నా సమాధానం.
ఇప్పుడు ఆలోచించండి. దేవుడికి ఉనికి ఉందని చెప్పే వాదనలో ఎంత బలం ఉందో, ఈ వాదనకి అంత బలం లేదంటారా?

Comments
ivanni naku telidu... manda
ivanni naku telidu...
manda ekkuvinappudu.. manishi control lo petadaniki.. unna oke okka aayudham... "Bhayam".. so mana poorvaniki poorvikulu.. ila janalu ekkuvipotarani.... evariki ishtam ochinattu.. varu.. (appatlo svatantram anedi andariki undedi.. rajulu paalinche varu kani.. niyama nibandanalu katinanga levappudu) undatam choosi.. sahajanga janmataha vache chedu alochanalu.. manishini mariste... samajaniki jaragaboye nashtanni oohinchi.... oka Icon figure in the form of devil ni create chesi.. chedu panulanni dani cheta cheyinchi.. daniki antham untadi.. sukham undadu ani cheppataniki.. mariyu manchi edo cheppataniki matrame GOD ni create chesaru...
so manam chedu cheste devudu shikshistadu ane oka bhayam tho prajalanu control cheyyalanukunnaru.. ikkada control ante.. only from not doing BAD.. but.. neti samajam lo matanni exploit cheyyatam jarugutondi.. kondariki nachani pani cheste devudu shikshistademo anna bhayanni puttinchi.. tappuni devudi katha lo vesi.. taamu chese panulaku devudni bhadyudni chesi.. tappu chestunnaru...
so God and Devil are two fictional entities.. and idanta chepte.. burraki emi ekkadu kabatti vatini fictional ani cheppakunda.. inka bhayanni create cheste.. ila alochistene devudu shikshistadu ane stage ki tesukochi vadilesaru.....
inka matham antava.... idi
inka matham antava.... idi kooda prajalanu paalinchataniki matrame tappa.. inka vere uddesham ledu... mana samajam lo prati pani avasaram ainade... kabatti.. prati paniki evaro okaru undali.. vari vari kashtanni batti variki jeetham undedi....ikkada svarda parulina KONDARU jeetham kosam.. konni panulane cheyyadam modalu pettaru... danitho vere panulaku janalu lekunda poyaru.. ikkada puttinde matham.. so konni mathaluga vibhajinchi.. ee matham vallu ee pane cheyyali.. ani rules rasi.. aa rules ni evvaru break cheyyakunda.. devudni kapala pettaru!!
ee analogy appati samajaniki sambandinchinadi.. kani ippudu deeniki ee matram VALIDITY ledu.. kabatti andaru anni panulu cheyochu.. kani dabbu techina ahankaaram tho.. manishini inko manishi EVALUATE cheyyadam prarambinchadu... ee evaluation metric ee money.... so samajam lo exploitation start aindi... pedavadi kashtanni exploit cheyyataniki suluvina margame matham! daani pina enno ennenno rules rasi.. matham anedi piki kanapadakunda.. vere inkevevo cheppi.... samajanni venakku nettadam jarugutondi...
idi kooda oka rakanga manchide.. anni gamanistunna prajalu....edo oka roju tirugubatu chestaru.. appudu mathanni koolankushanga vrellatho saha peekestaru....
aa roju kosam eduru choostoooooo
-- Rohit
PS: ivi kevalam kevalam kevalam.. naku anipinchina dani gurinchi nenu alochinchindi... veetitho meru ekibhavinchalsina avasram ledu.. emanna tappulu unte cheppandi.... nachakapote.. odileyyandi ante kani godavaku rakandi!
రోహిత్, నీ రెండో వ్యాఖ్యలో
రోహిత్, నీ రెండో వ్యాఖ్యలో కులం గురించి చెప్తున్నావనుకుంటున్నాను. ఎందుకంటే, "క్షత్రియులు పాలించాలి, బ్రాహ్మణులు వేదాలు పఠించి అందరి సుఖం కోరాలి, వైశ్యులు ఆర్థిక వ్యవాహారాలు చూడాలి, శూద్రులు మిగతా పనులు చేయాలి" లాంటి చతుర్వర్ణ వ్యవస్థకి నీ వ్యాఖ్య సరిపోతుంది. నాకు తెలిసి మతాల భేదంతో పనుల విభజన జరగలేదు, ఒకవేళ అలా ఎప్పుడైనా జరిగుంటే అది చెప్పి నన్ను సరిచేయి..
avnu adi kulame.... matham
avnu adi kulame....
matham goorchi naa uddesham entante.. vivida pranthala vaaru vivida rakaluga bratikevaru.. aa teda ne mathalaku daari teesindi!
రోహిత్, అందుకే ప్రారంభంలో మతం
రోహిత్, అందుకే ప్రారంభంలో మతం అంటే నా ఉద్దేశ్యం రకరకాల మతాలు కాదు, దేవుడి ఉనికి మీద నమ్మకమని చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఆ రకరకాల మతాల సందర్భంలో వస్తుంది.
avnu correct ee... kaani
avnu correct ee... kaani prasthuta paristitulalo mathanni aa view point nundi evvaru choodatledu.. so manam choosi alochinchadam samajaniki pedda upayogam undakapovachu ani naa uddesham!
కొమ్మ దగ్గర వేసే మందులు కొమ్మ
కొమ్మ దగ్గర వేసే మందులు కొమ్మ దగ్గర, వేరు దగ్గర వేయాల్సినవి వేరు దగ్గర వెయ్యాలి, దేని ఉపయోగం దానిది కదా మరి. నాది వేరు మందు, నీది కొమ్మ మందు.. :)
naadi asalu mande
naadi asalu mande kaadu!!
nenu samasya gurinchi dani puttu poorvotrala gurinchi matladanu kani.. parishkaram gurinchi kaadu... parishkaram telike ga ento mandi mahanu bhavulu.. ee deshanni choosi baada padaru navvukunnaru kani.. inka peddaga emi cheyyalekpoyaru...!
సమస్య ఇదీ అని జనానికి
సమస్య ఇదీ అని జనానికి అర్థమయ్యేలా చెప్పడంకంటే పెద్ద మందు ఏముంటుంది? మనం ఎన్ని ఎత్తులు, ఉపాయాలు ఆలోచించినా ఎవరికి వారు realise ఐతేనేగాని ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి సమస్య గురించి దాని పుట్టుపూర్వొత్తరాలల గురించి చెప్పడమే ఒక మందనుకుంటాను..
Religion is a belief of a
Religion is a belief of a group of people. It is independent of truth. It is the respect paid to the society and the nature for our existence.
I think of it as a part of a society with understanding. Hinduism is named by foreigners. They named the beliefs and customs of the land as Hinduism. This suggests religion can exist without the knowledge of society.
An intelligent society has its own ways of quenching its needs.Modern religions like Christianity, Buddhism are born because of the societal needs.
I clearly disagree with the idea a long term millinium plan sorted out to control the ways of living. Nobody has such a vision and If somebody made such decisions it is pure coincidence.
I do not think god as the judge of our deeds. If he is so he should find a better job soon. Everybody has a god in their world. Some say it is the way to explain miracles. I define God in my world as the unexplained phenomenon occuring throughout the universe. Our path should point to God, to understand them.
Kautilya's
Kautilya's arthashastra...
Aristotle's politics...
Valmiki's ramayana...
vyasa's mahabharatha...
these are not sheer coincindences and I perfectly believe that these books talk about the so-called caste and religion in the most detail way possible...!!
Agreed few are works of fiction but then.. they are able to see the path mankind is marching....
and religion is a way of life... there is no "need" that brings it into existence.. its just the conditions that make ppl lead their life in a diff way and so comes a new way of living...
and regarding God.. I didnt say that he is a judge... he is fictional entity that is supposed to be judge for our deeds so that people can be controlled with fear.... as responsibility cannot alone control them...!!!
I may be wrong.. but I definitely have valid points!
rohith, మతంలో రెండు
rohith,
మతంలో రెండు విభాగాలున్నాయనుకుందాం. ఒకటి నమ్మకం, రెండు ఆ నమ్మకానితో కలిగించగలిగే భయం. నమ్మకం == నువ్వు చెప్పిన దాంట్లో way of life, భయం == నువ్వు చెప్పిన దాంట్లో God అని అనుకోవచ్చా?
yes exactly... aa rendu
yes exactly... aa rendu entities ni veru veru ga chooste.... manaku ardam avutundi assalu enduku ochayi ani.. kani renditini baaga kalipeste.. confused state loki vellipotamu.. god nundi way of life ochinda.. way of life kosam god ochada ani... ee confused state nundi extremes ostayi.. fanatism and aesthetism...
Gani, But somehow, I'm not
Gani,
But somehow, I'm not convinced that it is(Independent of truth) so. మనకి తెలియకుండానే మతం ఉంటుందన్న విషయం ఒప్పుకుంటాను.
"Modern religions like Christianity, Buddhism are born because of the societal needs" నేను చెప్పేది అదే. కానీ, ప్రజల పాలనదృష్ట్యా చెప్పుకొచ్చాను. అదే విషయాన్ని ప్రజల సమస్యలకు(needs) వారే చూపుకున్న ఒక పరిష్కారంలా(quenching) కూడా చూపించొచ్చు. అలా చూపించి ఉంటే నువ్వు చెప్పినదానికి దగ్గరగా ఉండేదేమో!
దేవుడు, శిక్ష, స్వర్గం, నరకం అనేవి ఖచ్చితంగా దేవుడ్ని ఒక రక్షకుడిలా, కాపలాదారుడిలా, న్యాయమూర్తిలా చూస్తేనేగాని పుట్టేవి కాదు కదా. మనం వివరించలేని పకృతి కార్యక్రమాలు కొన్నిటిని దేవుడిలీలలని చెప్పి సరిపుచ్చుకుంటాం. మతానికి ఇది కారణం అంటే ఒప్పుకోలేకపోతున్నాను. ఎందుకూ అంటే, ఒకవేళ ఇదే కారణం ఐతే తిరుపతిలో అంత మంది కనబడరు. ఒకవేళ ఈ కారణం నీ వ్యక్తిగతమైతే, అదె వేరు :)
As I already said religion is
As I already said religion is the respect we pay to forces responsible for existence. Like saying thanks to sun for all the energy and rain for all the water.
We believe in balance. It is a good thing because it makes things clear. But the problem is we want balance at every point of time. When we do the action, before the consequence, at the consequence and after the consequence - at all these points we try to look at the world and see if it is balanced. Most of the times it is not - the invisibility of the balance is shown as punyam-papam. But nobody knows if balance exists. But the events in this world are better explained by its existence. So we attribute that to god.
And when I say independent of truth it means it is dependent on reality but not truth
నేను మాత్రం ఒక శక్తి(మనము
నేను మాత్రం ఒక శక్తి(మనము మాత్రం ఆ శక్తిని దేవుడు అంటున్నాము ) ఉందని గట్టిగా నమ్ముతున్నాను.
ఆ శక్తి ఆకారం మనిషి రూపం కాకుండా వేరే రూపంలో ఉండవచ్చు.
ఎందుకంటే మనిషి పుట్టి కొన్ని years(దేవుని దృష్టితో చుస్తే కొన్ని years (లేక)మీ(scientists) దృష్టిలో కొన్ని వేల years ) మాత్రమే!
అంటే మనిషి రుపుదిద్దుకోకముందు(darwin థియరీ ప్రకారం కోతులు లేక చిపాంజిలు నుండి మనుషులు రుపుదిద్దుకున్నారట ...!) కూడా దేవుడు ఉన్నాడు కదా .....!(?)
అందువలన శక్తి ఆకారం మనిషి రూపం కాకుండా వేరే రూపంలో ఉండవచ్చు అని నేను నమ్ముతున్నాను !
ఇక్కడ ఒక చిన్న డౌట్ .....
darwin థియరీ ప్రకారం కోతులు లేక చిపాంజిలు నుండి మనుషులు రుపుదిద్దుకున్నారట ...!
ఇది మాత్రం నేను నమ్మటంలేదు ...
ఎందుకంటే (క్రింద రాసినది కొంచెం జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్ )
ఇప్పుడు మనం కూడా ....కోతులు లేక చిపాంజిల నీ చూస్తున్నాం కదా...! అంటే కోతులు లేక చిపాంజిలు మనకు అసలే కనిపించవద్దు కదా ...!
నా డౌట్ ఏమిటంటే మనిషి ఎలా రుపుదిద్దుకున్నాడు ?కొందరు(బాగా భక్తి ఉన్నవారు) అంటారు "దేవుడే మనిషిని చేసాడు ".
అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను వాళ్ళని "అంటే దేవుడు ఆకారము మనిషి లాగా ఉండదు కదా ?". అప్పుడు వాళ్ళు కొంచెంసేపు (కొంత మంది చాల టైం ) అలోచించి "అవును ... " అంటారు . మరి మీరు ఏమిఅంటారు ?
ఇది అంతా ఎందుకు చెప్తునానుఅంటే ఏదో శక్తి ఉంది ....ఉంది....ఉంది...ఆ శక్తి మనుషులని control చేస్తుంది(T.V రిమోట్ లాగ ) .
మరి మీరు ఏమంటారు ......శక్తి లేదనా లేక ఉంది అనా ? darwin థియరీ ఒప్పుకోరు కదా ?
-----------------
my blog:
http://rameshsoftwares.blogspot.com
రమేష్ గారూ, మీరు తప్పుగా
రమేష్ గారూ,
మీరు తప్పుగా అర్థం చేస్కున్నారు ఈ టపాని. సృష్టికి ప్రాణం పోసే కార్యక్రమమే లేదని ఎక్కడా అనలేదు, నేను ప్రతిపాదించిన దాంట్లో కూడా అలా అనలేదు. కాకపోతే మీరంటున్నదానికి దానికీ కాస్త వ్యత్యాసం ఉంది. ఎలా అంటే, ఆ శక్తిని పూర్తిగా ఒక బయటి వస్తు రూపం లో ప్రాణసృష్టి అనే తంతు నడిపిస్తుందని అని మీరంటున్నారు, కాకపోవచ్చు, ఈ ప్రాణసృష్టి అనే తంతే(Process) శక్తి అని నేనంటున్నాను. అదే తేడా.
Hi, The question is about the
Hi,
The question is about the belief system; Does God exist?
It is as good as asking, do you believe in your father?
That is not about belief system. It is something practical.
God is also like father, but father of soul and not body.
if you have any queries visit brhama kumaris, you can get answer to any question you can iMAGINE:
Post new comment