తెలుగీకరణ

అల్లెప్పుడో తెల్లోడి దగ్గర పెరిగిన కంప్యూటరనే ఒక బూచి ఇదిగో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఉన్న మతులు పోగొడుతూ, దాని నడతలో నడకలో సరికొత్త పదును కోరుతూ దుమారం లేపుతోంది. మొట్ట మొదట అది ప్రపంచానికి అటు వైపు ఉండటం వల్ల, వాళ్ళు మాట్లాడే భాషలోనే దాన్ని ఏమార్చుకోవడం జరిగింది. కాని ఇప్పుడు మనక్కూడా దాని అవసరం పడి అది లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కాబట్టి, దాన్ని కాస్త మన భాషలోకి కూడా అన్వయించు కుంటే ఇంగ్లీషు రాని వారు కూడా దాన్ని ఉపయోగించే వీలు కలుగుతుంది. తద్వారా digital divide అనే దాన్ని కాస్త తగ్గించుకున్నవాళ్ళమవుతాం. ఈ పుస్తకం లో రాసేవన్నీ తెలుగులో కంప్యూటర్‌తో రోజువారి విధులు నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటాయి.

పైన చెప్పినదాని బట్టి ఇక్కడ ఈ తెలుగీకరణ పుస్తకంలో రాసేవన్నీ తెలుగు రాని వారికి, ముఖ్యంగా పల్లెటూరిలో భాషే సమస్యగా కంప్యూటర్‌ వాడలేకపోతున్నవారికి బాగా పనికొచ్చేలా ఉంటాయి. ఇంగ్లీషొచ్చిన వాళ్ళు కూడా దీన్నుంచి లబ్ది పొందవచ్చు. రీజూవారి కార్యక్రమాల్లో, పనుల్లో మాతృభాష వాడకం వల్ల వచ్చే ఉపయోగాలని శాస్త్రవేత్తలు నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, వృత్తి పేరుతో ఎంత వరకు ఇంగ్లీషు వాడుకోవాలో నిర్ణయించుకోండి.

ప్రస్తుతానికి ఈ కింద రాసిందే నా చిట్టా. ఒక్కోక్కటిగా రాసుకుంటూ వెళతాను. మీకు ఇంకా ఏమైనా కావాలంటే, నా వీలును బట్టి సంతోషంగా రాసేస్తాను... ఇక్కడే ఒక కామెంట్ కొట్టినా సరే, నాకో ఈ-ఉత్తరం ముక్క రాసిపడేసిన సరే! ఈ కింద రాసినవి పాతబడిపోయాయి అనుకుంటే నాకు చెప్పడం మరవద్దు సుమా! వీటిని ఎప్పటికప్పుడు నవీకరించడానికి సాయశక్తుల ప్రయత్నిస్తాను.

 

  1. ఏవగింపు & చిన్నచూపు – కారణాలు
  2. విండోస్‌
    1. విండోస్‌లో తెలుగు చదవడం
    2. తెలుగులో టైప్‌ చేయడం – రకాలు
    3. విండోస్‌ మొత్తం తెలుగులోకి మార్చడం
    4. వివిధ సాఫ్ట్వేర్లను తెలుగీకరించడం
  3. లినక్స్‌
    1. లినక్స్ లో తెలుగు చదవడం
    2. తెలుగులో టైప్‌ చేయడం – రకాలు
    3. లినక్స్ మొత్తం తెలుగులోకి మార్చడం
    4. వివిధ సాఫ్ట్వేర్లను తెలుగీకరించడం
  4. ఇంటర్‌ నెట్‌
    1. పద్మ - ఫైర్‌పాక్స్‌ లో యూనికోడీకరణ
    2. తెలుగులో గూగుల్‌ పరికరాలు
      1. జీ-మెయిల్‌
      2. గూగుల్‌ క్యాలెండర్‌
      3. గూగుల్‌ సమూహాలు
      4. ఆర్కుట్‌ - సాంఘిక స్నేహ సమూహాలు
    3. తెలుగులో బ్లాగు రాయడం, సైటు నిర్వహించడం
      1. ఉపయోగాలు
      2. సైటు పేరు, స్థలం(డిస్క్‌ స్పేస్‌) - ఎక్కడ, ఎలా కొనాలి?
      3. వర్డ్‌ప్రెస్‌(Wordpress)
        1. ఉచిత బ్లాగు
        2. సొంత సైటు లో వర్డ్‌ప్రెస్‌ స్థాపించుకోవటం
        3. బ్లాగు నిర్వహణ
      4. ద్రుపాల్‌(Drupal)
        1. సొంత సైటు లో ద్రుపాల్ స్థాపించుకోవటం
        2. బ్లాగు, సైటు నిర్వహణ